అందుకే రషీద్‌కు బౌలింగ్‌ ఇచ్చాం:విలియమ్సన్‌

0

ముంబయి : సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తాజా ఓటమితో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓడిపోయింది. మిడిల్‌ ఆర్డర్‌ విఫలం కావడంతో మనీశ్‌పాండే ఒంటరి పోరాటం వ థా అయింది. అయితే జట్టు ఓటమిపై సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మాట్లాడాడు. ‘మనీశ్‌పాండే అద్భుతంగా ఆడాడు. నబీతో కలిసి దాదాపు విజయతీరాలకు చేర్చాడు. అయితే, నాతో పాటు మిగితా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ అతనికి తోడుగా నిలవలేకపోయాం. నబీ ఒక్కడే అతనితోపాటు పోరాడినా ఫలితం లేకపోయింది. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం వల్ల పాండేపై ఎక్కువ భారం పడింది. అయితే, మొదటి పది ఓవర్లు మొత్తం మ్యాచ్‌ మావైపే ఉందనిపించింది. మా బౌలర్లు కూడా బాగానే బౌలింగ్‌ చేశారు. అయితే, సూపర్‌ ఓవర్‌లో మేం కేవలం 8 పరుగులు మాత్రమే చేశాం. అది చాలా చిన్న లక్ష్యం. రషీద్‌ఖాన్‌ ప్రపంచస్థాయి స్పిన్నర్‌. అతను సూపర్‌ ఓవర్‌ వేయగలడని నమ్మాం. అందుకే అతనికి బౌలింగ్‌ ఇచ్చాం. మిగిలిన మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తాం’ అని విలియమ్సన్‌ పేర్కొన్నాడు. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తన తర్వాతి మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ఆడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తేనే హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. సన్‌రైజర్స్‌ ఇప్పటి వరకూ ఆడిన 13 మ్యాచుల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్న మిగిలిన జట్లతో పోల్చుకుంటే సన్‌రైజర్స్‌కు మెరుగైన రన్‌రేట్‌ ఉండటం కలిసొచ్చే అంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here