Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

అది బాంబు కాదు

పేలింది కెమికల్‌

  • ఎవరూ భయపడొద్దు : సీపీ
  • రాజేంద్రనగర్‌లో పేలుడు
  • చెత్త సేకరించే వ్యక్తి మృతి

హైదరాబాద్‌ :

రాజేంద్రనగర్‌ లో భారీ పేలుడు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుట్‌ పాత్‌ విూదున్న అనుమానాస్పద బాక్స్‌ ను ఓ వ్యక్తి తెరవగానే అది భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. రెండు చేతులు తెగిపడ్డాయి. దీంతో బాంబు పేలిందేమోనని స్థానికులు భయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపించారు. పేలింది బాంబు కాదు కెమికల్‌ అని తేల్చారు. ఎవరూ భయపడాల్సిన పని లేదని పోలీసులు ధైర్యం చెప్పారు. అది బాంబు పేలుడు కాదని పోలీసులు నిర్ధారించారు. కెమికల్‌ డబ్బా కారణంగానే పేలుడు సంభవించినట్టు గుర్తించారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

నగరంలోని రాజేంద్రనగర్‌లో పేలుడు సంభవించింది. పీవీ నరసింహరావు ఎక్స్‌ ప్రెస్‌ వే 279 పిల్లర్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి మరణించాడు. ఫుట్‌పాత్‌ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఓ కవర్‌ ను తెరుస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి ఆ వ్యక్తి చేతులు ఛిద్రమైపోయాయి. వెంటనే స్థానికులు అతడిని 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ క్షతగాత్రుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాస్క్వాడ్‌ బృందాలతో తనిఖీలు చేపట్టారు. రాజేంద్రనగర్‌ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాధితుడిని రాజేంద్రనగర్‌కు చెందిన అలీగా గుర్తించారు. చెత్తను సేకరించే అలీ.. అనుమానాస్పదంగా కనిపించిన ఓ పాలిథిన్‌ కవర్‌ ను తెరుస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రే వినాయక నిమజ్జన ఊరేగింపు ఈ ప్రాంతంలో జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు శనివారం రాత్రి చోటుచేసుకొని ఉంటే ఊహించని నష్టం చోటుచేసుకుని ఉండేదని పేర్కొంటున్నారు. పోలీసులు అక్కడ ఉన్న సీసీ కెమెరా దృశ్యాల ద్వారా మరిన్ని వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close