శబరిమల ఆలయం వద్ద ఉద్రిక్తత

0

భక్తుల కళ్లు కప్పి ఆలయంలోకి ప్రవేశించిన మహిళలు

మహిళల ప్రవేశాన్ని ధ్రువీకరించిన కేరళ సీఎం పినరయి విజయ్‌

మహిళల ప్రవేశంతో శబరిమల ఆలయం మూసివేత

సంప్రోక్షణ చేసిన తర్వాత తెరుచుకున్న ఆలయం

కేరళలో నిరసనకు దిగిన హిందూ సంస్థలు

తిరువనంతపురం,జనవరి2(ఆర్‌ఎన్‌ఎ): కేరళలోని శబరిమల ఆలయ ప్రవేశంపై మహిళల పంతం నెగ్గింది. సుప్రీం తీర్పుతో శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఇద్దరు 50ఏళ్లలోపు మహిళలు నేడు దర్శించుకోవడం తీవ్ర దుమారానికి దారితీసింది. మహిళల ప్రవేశంతో శబరిమల ద్వారాలను తాత్కాలికంగా మూసివేశారు. వెంటనే ఆలయ సంప్రోక్షణ చేపట్టారు. కోజికొడె జిల్లాకు చెందిన బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు బుధవారం తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో తాము ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్పను దర్శించుకున్నట్లు తెలిపారు.అయితే అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత 50ఏళ్ల లోపు మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకోవడం ఇదే తొలిసారి. వీరి ప్రవేశంతో దిగ్భాంతి వ్యక్తం చేసిన తంత్రి.. ఆలయాన్ని మూసివేసి శుద్ధి కార్యక్రమం చేపట్టారు. కాగా.. మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు వస్తున్న వార్తలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ధ్రువీకరించారు. ’50ఏళ్ల లోపు మహిళలు ఇద్దరు నేడు ఆలయాన్ని దర్శించుకున్నారనేది నిజం. అంతకుముందు భద్రతా కారణాల వల్ల వారు ఆలయంలోకి వెళ్లలేకపోయారు. అయ్యప్ప దర్శనం చేసుకునేందుకు వచ్చే మహిళలకు మరింత భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించాం అని పినరయి తెలపడంతో కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయ్యప్ప దర్శనానికి వెళ్లే క్రమంలో ఇద్దరు మహిళలు నల్లటి దుస్తులు ధరించి ఎవరికి అనుమానం రాకుండా సాధారణ భక్తుల్లాగా దర్శనానికి వెళ్లారు. కొండపై అర్ధరాత్రి నడకను కొనసాగించి బుధవారం తెల్లవారు జామున వారు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ బయటకు వచ్చి కేరింతలు కొడుతూ అయప్ప స్వామిని దర్శించుకున్నామని ఆనందంగా చెప్పారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశంచడంతో అపచారం జరిగిందని ఆలయాన్ని మూసివేశారు. శుద్ది చేసిన తర్వాతే ఆలయ తలుపులు తెరుస్తామని ప్రధాన పూజారి చెప్పారు. భక్తుల కళ్లు కప్పి మహిళలు ఆలయంలోకి ప్రవేశించారన్నారు. పోలీసుల సహకారంతో అయప్ప స్వామిని దర్శించుకున్నారని చెప్పారు. మహిళల ప్రవేశాన్ని అయప్ప భక్తులు, సాంప్రదాయవాదులు తప్పుబట్టారు. అలయంలో అపచారం జరిగిందని గుడిని మూసివేశారు. సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆలయ తలుపులు తెరుస్తామని చెబుతున్నారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 12.40గంటల వరకు ఆలయాన్ని మూసివేశారు. అయితే శ ఉద్ది తరవాత శబరిమల అయ్యప్పస్వామి ఆలయం మళ్లీ తెరుచుకున్నది. దీంతో మళ్లీ భక్తులు అయ్యప్పను దర్శించుంటున్నారు. ఉదయం 10.30 గంటలకు పూజారులు ఆలయాన్ని మూసివేశారు. తెల్లవారుజామున ఒంటి గంటకు ఇద్దరు మహిళలు శబరిమలకు చేరుకున్నారు. ఆ ఇద్దరూ ఉదయం మూడున్నర గంటల సమయంలో అయ్యప్పను దర్శించుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆలయ పూజారి సంప్రోక్షణ చేపట్టారు. దేవస్థానం బోర్డుతో సంప్రదించి ఆ తర్వాత శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10.30 నిమిషాల నుంచి 11.30 నిమిషాల వరకు శుద్ధి పూజ నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఆలయాన్ని భక్తుల సందర్శనకు తెరిచారు.

నల్లజెండాలతో నిరసన ఈ ఘటన జరగడంతో గురువాయూర్‌లో ఉన్న కేరళ దేవస్థాన బోర్డు మంత్రికి వ్యతిరేకంగా యువ మోర్చా కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన గళం వినిపించారు. మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ.. శబరిమల కర్మ సమితి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించనున్నది. బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు ఇవాళ ఉదయం ఆలయంలోకి ప్రవేశించారు. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు.. శబరిమల అయ్యప్పను దర్శించుకోవచ్చు అని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలో ఈ ఇద్దరూ ఆలయ ప్రవేశం కోసం ప్రయత్నం చేసినా.. సక్సెస్‌ కాలేదు. కానీ ఈసారి ఆ ఇద్దరూ అయ్యప్పను దర్శించుకున్నారని సీఎం విజయన్‌ కూడా ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here