కాస్త తేడాగా కనిపిస్తున్న తెనాలి రామకృష్ణ

0

యువ హీరో సందీప్‌ కిషన్‌ కు ఈమధ్య చెప్పుకోదగ్గ విజయాలు దక్కలేదు. అయినా అలుపెరగకుండా విజయం కోసం తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సందీప్‌ ప్రస్తుతం ‘తెనాలి రామకష్ణ ‘ అనే ఒక కామెడీ ఎంటర్టైనర్‌ లో నటిస్తున్నాడు. కామెడీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రెస్‌ లాంటి జీ. నాగేశ్వరరెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ విడుదల చేశారు నిర్మాతలు. ఈ రోజే ఎందుకంటే.. రేపు మే 7 న సందీప్‌ కిషన్‌ పుట్టిన రోజు. అందుకే రేపు ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేస్తారట. దానికి ముందు శాంపిల్‌ గా ప్రీ లుక్‌ ను ఈరోజు విడుదల చేశారు. పెయింటింగ్‌ లాగా ఉన్న ఈ ప్రీ లుక్‌ లో సందీప్‌ కిషన్‌ కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక టేబుల్‌ పై డాబుగా ఒకదానిపై మరో కాలు పెట్టుకుని ఉన్నాడు. ఆయన బూట్లు మాత్రమే హైలైట్‌ అయ్యేలా ఉంది ఈ ప్రీ లుక్‌. టేబుల్‌ పై కొన్ని ఫైల్స్‌.. ఒక పెద్ద పుస్తకం.. ఆ బుక్కుపై టీ గ్లాసు ఉంది. పక్కనే కళ్ళజోడు కూడా ఉంది. ఓవరాల్‌ గా ఈ ప్రీ లుక్‌ ఇంట్రెస్టింగ్‌ గా ఉంది. లాయర్‌ టైటిల్‌… ఈ గెటప్‌ చూస్తుంటే చిరంజీవి ‘చంటబ్బాయ్‌’ స్టైల్‌ కామెడీ ఉంటుందేమో మరి. ప్రీ లుక్‌ తో ఆసక్తి రేకెత్తించిన ఈ ‘తెనాలి రామకష్ణ ‘ మరి రేపు ఫస్ట్‌ లుక్‌ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌ సరసన హన్సిక హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతం అందిస్తున్నాడు. సాయి శ్రీరాం ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here