తెలుగమ్మాయి డెనిమ్‌ గెటప్‌

0

తెలుగు అమ్మాయి అయిన ఈషా రెబ్బా సోషల్‌ మీడియా జోరు తెలిసిందే. ముంబై భామలకు ఏమాత్రం తీసిపోకుండా ఫోటో షూట్లు చేస్తూ తరచుగా తన ఇన్స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా ఫోటోలను పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. అదే ట్రెండ్‌ కంటిన్యూ చేస్తూ ఈసారి కూడా ఒక ఫోటో షూట్‌ చేసింది. డిఫరెంట్‌ పోజుల్లో ఆరు ఫోటోలు పోస్ట్‌ చేసింది. ఈ ఫోటో షూట్‌ డ్రెస్‌ కోడ్‌ డెనిమ్‌.

ఈ ఫోటోలకు ఈషా ఇచ్చిన క్యాప్షన్‌ ”సరైన డెనిమ్‌ జీన్స్‌ లో ఒక అమ్మాయి ప్రపంచాన్ని జయించగలదు అంటారు కానీ అదేం లేదు. నేను చెప్పేదేంటంటే ఒక అమ్మాయి అనుకుంటే ఎలాగైనా ప్రపంచాన్ని జయించగలదు. షేర్‌ చాట్‌ లో నన్ను ఫాలో అవ్వండి.” క్యాప్షన్‌ అధిరిపోయింది కదా? ఈషాకు కాన్ఫిడెన్స్‌ ఎంతుందో ఈ క్యాప్షన్‌ చెప్పేస్తుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఈ డ్రెస్‌ లో ఈషా యమా రఫ్‌ గా ఉంది. నలిగిన డెనిమ్‌ షర్ట్‌.. చిరుగుల జీన్స్‌ వేసుకోవడంతో ఎప్పుడూ లేనంత డిఫరెంట్‌ గా ఉంది. డ్రెస్‌ కు తగ్గట్టే యాక్సెసరీస్‌ ధరించకుండా సింపుల్‌ గా ఉంది. కొంచెం పరిశీలనగా గమనిస్తే కుడిచేతిపై ఒక పచ్చ బొట్టు కూడా ఉంది. అంటే డెనిమ్‌ లుక్‌ కోసం పర్ఫెక్ట్‌ గా ప్లాన్‌ చేసిందన్నమాట. తెలుగమ్మాయి డెనిమ్‌ లుక్‌ కు నెటిజనుల నుండి భారీ స్పందన దక్కింది. ఒక క్రియేటివ్‌ నెటిజనుడు ”నిన్ను ఇంత కంటే అందంగా చూడలేనని అనుకున్న ప్రతిసారీ.. యూ ప్రూవ్‌ మీ రాంగ్‌” అంటూ ‘జెర్సీ’ స్టైల్‌ లో డైలాగ్‌ చెప్పాడు. సినిమాల విషయానికి వస్తే ఈషాకు రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయని సమాచారం. త్వరలోనే వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here