కారు గ్యారేజీకెళ్తేనే తెలంగాణకు కదలిక

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): నాలుగేళ్ల కేసీఆర్‌ పాలన అవినీతిమయంగా మారిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. యువకులు, తెలంగాణ ప్రజలు తాము కన్న కలల్ని మర్చిపోయారన్నారు. హైదరాబాద్‌లోని తాజ్‌క ష్ణా హోటల్‌లో ఏర్పాటు చేసిన ప్రజా కూటమి నేతల సంయుక్త మీడియా సమావేశం లో రాహుల్‌ మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర రూపురే ఖలు మారుతాయని ప్రజలు భావించారని, కేసీఆర్‌ మాత్రం వారిని మోసం చేశారన్నారు. గొప్ప రాష్ట్రాన్ని తెరాస నాశనం చేసింది తెదేపా అధినేత చంద్రబాబు మాట్లాడుతూ తెలం గాణ ఎన్నికలు జాతీయ రాజకీయాలకు నాంది కాబోతున్నాయన్నారు. తెలంగాణలో ప్రజాకూట మి అధికారంలోకి వస్తుందనే విశ్వాసం తమకుందన్నారు. సంపదలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం అభివ ద్ధిలోనూ ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. గొప్ప రాష్ట్రాన్ని తెరాస నాశనం చేసిందన్నారు. తెరాస, భాజపా విభజన రాజకీయాలు చేస్తున్నాయని, తెలంగాణకు తామంతా అండగా ఉంటామన్నారు. ప్రజాకూట మిని గెలిపిస్తేనే తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు అన్నారు. ఎన్నికలలో అందరూ తప్పకుండా ఓటుహక్కును వినియోగిం చుకోవాలని ఆయన కోరారు. తెరాసను దించకపోతే రాష్ట్రం అభివ ద్ధి చెందదు : ఒక కుటుంబం తమ స్వప్రయోజనం కోసం ప్రభుత్వాన్ని నడిపిస్తే ఫలితాలు రావని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తెరాస ప్రభు త్వాన్ని గద్దె దించకుండా రాష్ట్రం అభివ ద్ధి చెందదనే విషయాన్ని ప్రజలకు చెప్పామన్నారు. తెలంగాణ వచ్చే వరకు రాష్ట్రం కోసం, ఆ తర్వాత రాష్ట్ర అభివ ద్ధి కొరకు పోరాడమని ప్రొఫెసర్‌ జయశంకర్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమికి మద్దతు తెలపాలని ప్రజలను కోదండరాం కోరారు. మోదీకి ఏజెంట్‌గా కేసీఆర్‌ : తెలంగాణలో అహంకారపూరిత పాలన కొనసాగుతోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పని చేస్తున్న ప్రభుత్వాన్ని గద్దెదించడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించాలని భావించి తామంతా ఒక్కటయ్యామని చెప్పారు. ప్రధాని మోదీకి ఏజెంట్‌గా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. మార్పు తెలంగాణ కూటమితోనే దేశ రాజకీయాల్లో మార్పుకు తెలంగాణ ఎన్నికలు ఆరంభం అవుతాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ,టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడులు మీడియాతో మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజా కూటమికి ఓటు వేయాలని చంద్రబాబునాయుడు కోరారు. తెలంగాణ రాష్ట్రం అత్యంత ధనిక రాష్ట్రమన్నారు.కానీ, ఈ రాష్ట్రాన్ని సరైనదిశలో నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ ఓటేస్తేనే ప్రజాస్వామ్యం నిలబడుతోందన్నారు. అంతకుముందు మాట్లాడిన కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ మాట్లాడారు. తెలంగాణ ప్రజలు సాకారం అవుతాయని తాము భావించామన్నారు.కానీ తాము అనుకొన్నట్టుగా తెలంగాణ ప్రజల కలలు సాకారం కాలేదని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. టీజేఎస్‌ చీఫ్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ ప్రజల జీవితాలు బాగుపడతాయని భావించినా… ఆ దిశగా పాలన రాలేదన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. తెలంగాణలో అనుకొన్న ఫలితాలు రాలేదన్నారు.పోరాడితే మమ్మల్ని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here