Featuredరాజకీయ వార్తలు

తెలంగాణ పథకాలను.. దేశం ఆచరిస్తుంది

  • మనం ఆదర్శంగా నిలిచాం
  • మోడీతో సామాన్యునికి ఒరిగిందేమీలేదు
  • కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నారు
  • 16 ఎంపీ స్థానాలివ్వండి
  • పోటీ మా మధ్యే.. అదీ మెజార్టీ కోసమే
  • వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం చేసేదే రేపు దేశం ఆచరించేలా సీఎం కేసీఆర్‌ చేసారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సన్నాహక సమావేశంలో భాగంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… ప్రస్తుతం తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్‌ ఏం చేస్తే.. భారత్‌ అదే చేస్తుందనేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తే.. భారత్‌ అదే చేస్తుందని అంటున్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా సీఎం కేసీఆర్‌ నడిపిస్తున్నారన్నారు. కాళేశ్వరంకు జాతీయ ¬దా అడిగితే మోడీ ముసిముసి నవ్వులే సమాధానం అయ్యాయి. కేంద్రం జుట్టు మన చేతుల్లో ఉంటే నిధుల వరద పారుతుంది. నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసినా.. భగీరథ, కాకతీయలకు మోడీ నిధులివ్వలేదు. 16 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి ఢిల్లీకి పంపితే మన హక్కులను సాధించుకోవచ్చన్నారు. రైతులకు మేలు చేసే పథకాలను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేపట్టలేదు. తెలంగాణ రైతుబంధును ఇప్పుడు కేంద్రం, చాలా రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని కేటీఆర్‌ తెలిపారు.

మెదక్‌ : తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి దేశంమొత్తం నివ్వెరపోతుందని, మన సీఎం కేసీఆర్‌ పాలనను దేశంమొత్తం ఆచరిస్తుందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… ప్రస్తుతం తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్‌ ఏం చేస్తే.. భారత్‌ అదే చేస్తుందనేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తే.. భారత్‌ అదే చేస్తుందని అంటున్నారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా సీఎం కేసీఆర్‌ నడిపిస్తున్నారు అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రధాని మోడీతో సామాన్యునికి ఒరిగిందేమి లేదని కేటీఆర్‌ అన్నారు. మోడీ, కాంగ్రెస్‌ కూటముల పరిస్థితి బాగాలేదు, సర్వేలు ఇవే చెబుతున్నాయన్నారు. తెలంగాణ ప్రజల ఓట్లు కీలకం కాబోతున్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. గోల్కొండ కోట మనదే.. ఎర్రకోట విూద ఎవరు జెండా ఎగరేయాలో నిర్ణయించే శక్తి టీఆర్‌ఎస్‌కు ఉందని, 16ఎంపీ స్థానాలిచ్చి ఆ కార్యానికి ప్రజలు దన్నుగా ఉండాలని కేటీఆర్‌ కోరారు. గజ్వేల్‌ మిషన్‌ భగీరథ పథకం ప్రారంభోత్సవ సమయంలో ప్రధాని వచ్చినప్పుడు.. కాళేశ్వరంకు జాతీయ ¬దా కావాలని కేసీఆర్‌ అడిగారని, కానీ మోడీ ముసిముసి నవ్వులు నవ్వారు తప్ప జాతీయ ¬దా ఇవ్వలేదన్నారు. కేంద్రం జుట్టు మన చేతుల్లో ఉంటే నిధుల వరద పారుతుందని, అందుకు మనమంతా ఏకమై 16 స్థానాలతో కేంద్రంలో నిర్దేశకులుగా మారాలన్నారు. నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసినా.. భగీరథ, కాకతీయలకు మోడీ నిధులివ్వలేదని విమర్శించారు. 16 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి ఢిల్లీకి పంపితే మన హక్కులను సాధించుకోవచ్చన్నారు. రైతులకు మేలు చేసే పథకాలను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేపట్టలేదని, తెలంగాణ రైతుబంధును ఇప్పుడు కేంద్రం, చాలా రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని కేటీఆర్‌ తెలిపారు. విధిలేని పరిస్థితుల్లో చంద్రబాబు అన్నదాత సుఖీభవ అంటూ రైతుబందును కాపీ కొట్టాడని అన్నారు. రైతుబంధు ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించారని కేటీఆర్‌ తెలిపారు. రైతు కుటుంబాలకు కేసీఆర్‌ భరోసా ఇచ్చాడని, కేసీఆర్‌ మా పెద్ద కొడుకు అని ముసలి వారు దీవెనలిస్తున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి నమూనా దేశానికి పరిచయం చేసే సత్తా కేసీఆర్‌ కు ఉందన్నారు. కాంగ్రేస్‌ వారిని ఓటు అడిగే నైతిక హక్కు టీఆర్‌ఎస్‌ కు ఉందని, కాంగ్రెస్‌ కు ఎంపీ అభ్యర్థులు కరువయ్యారన్నారు. మోడీ, అమిత్‌ షాలు ఎన్ని విూటింగ్‌ లు పెట్టినా బీజేపికి ఇక్కడ స్థానం లేదని కేటీఆర్‌ అన్నారు.

పోటీ మా మధ్యే.. అదీ మెజార్టీ కోసమే..

తెలంగాణలో త్వరలో జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు ఏకపక్షమేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ పార్టీల మధ్య కాదని, తమ అభ్యర్థుల మధ్యే.. వారు సాధించే మెజార్టీ మధ్యేనని చెప్పారు. కేంద్రంలో ఏ ఒక్క పార్టీకీ పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు గెలిస్తే ఢిల్లీని శాసించొచ్చు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌ రావుకు  కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. మెదక్‌ పార్లమెంట్‌ కంటే కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో ఎక్కువ మెజార్టీ సాధిస్తామని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. మా కరీంనగర్‌ ఎంపి స్థానం కంటే ఎక్కువ మెజారిటీ సాధించండని సూచించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఏ పార్టీ పోటీ కాదని, ఇప్పుడు రాష్ట్రంలో అంతా ఏకపక్షమే అన్నారు. పోటీ ఉన్నదంతా ఒకరితో ఒకరు మెజార్టీలు సాధించే దానివిూదేనని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గం కన్నా మేమే ఒక ఓటు అయినా ఎక్కువ తెచ్చుకొని విూ కంటే ముందుంటామని అన్నారు. అయితే తన సవాల్‌ బావతో కాదన్న కేటీఆర్‌, తాను, బావ కలిసే ఉన్నామని, ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేశారు. కేటీఆర్‌ ఈ సందర్భంగా ఒంటేరు ప్రతాప్‌ రెడ్డితో సభకు ప్రత్యేకంగా అభివాదం చేయించారు.

యావత్‌ దేశం.. కేసీఆర్‌ను ఫాలో అవుతోంది

యావత్‌ దేశం మొత్తం సీఎం కేసీఆర్‌ పరిపాలనను ఫాలో అవుతుందని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. కొంపల్లిలో నిర్వహించిన మల్కాజ్‌గిరి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ స్థానం అంటే దేశంలోనే నంబర్‌వన్‌ పార్లమెంట్‌. ఇక్కడ భారీ మెజార్టీతో గులాబీ జెండా ఎగరబోతుందన్న విశ్వాసం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు తిరుగులేని సమాధానం చెప్పారు. గడిచిన ఐదు సంవత్సరాలుగా కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో పరిస్థితిలో లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు తెలంగాణపై కుట్రలు చేసినవారికి మల్కాజ్‌గిరి నియోజకవర్గం ప్రజలు బుద్ధి చెప్పారు. వ్యవసాయం దండుగన్న చంద్రబాబే.. ఇప్పుడు మన రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నాడు. చంద్రబాబు ఒక్కరే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా రైతుబంధును అమలు చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ కూడా రైతుబంధును కాపీ కొట్టి పీఎం-కిసాన్‌ అని పేరు పెట్టి రైతులకు డబ్బులు ఇస్తున్నాడు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. అభివృద్ధి రంగంలో కొత్త నమూనాను తెలంగాణ ఆవిష్కరించింది. అపురూపమైన పథకాలతో తెలంగాణ ప్రజలందరికీ మేలు జరిగేలా సీఎం కేసీఆర్‌ పాలన కొనసాగిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మంచినీటి సమస్యను పరిష్కరించుకున్నాం. భవిష్యత్‌లో తప్పకుండా ఆడబిడ్డలకు ఎలాంటి కష్టం లేకుండా ఇంటింటికీ మంచినీళ్లు ఇవ్వబోతున్నాం. యావత్‌ భారతదేశం మొత్తం కేసీఆర్‌ను ఫాలో అవుతుంది. ఇవాళ దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచింది. ఈ ఐదేళ్లలో సెకను కూడా కర్ఫ్యూ విధించలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగు అయ్యాయి. సీఎం కేసీఆర్‌ పరిపాలనను మెచ్చి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. కాంగ్రెస్‌, బీజేపీ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. ఓడిపోయిన నాయకులు ఆత్మవిమర్శ చేసుకోకుండా కొందరు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్‌కు ఏం సంబంధం అని బీజేపీ నాయకుడు కిషన్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికలు మోదీకి, రాహుల్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని అంటున్నారు. కానీ ఈ ఎన్నికలు తెలంగాణకు అత్యంత కీలకమైనవి. మోదీని కానీ, రాహుల్‌ కానీ గెలిపించాల్సిన ఖర్మ ఈ దేశ ప్రజలకు లేదు. అద్భుతమైన నాయకులు, అద్భుతమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలకే అందరూ జై కొడుతున్నారు. మనం 16 మంది ఎంపీలను గెలిపిస్తే మన హక్కులను సాధించుకోవచ్చు. నిధులను వరదలా తెచ్చుకోవచ్చు. ప్రధాని మోదీ ఈ ఐదేండ్లలో చేసిందేవిూ లేదు. మన హక్కుల కోసం కేంద్రాన్ని నిలదీసే నేతలనే గెలిపించాలి అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close