Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌!

25లోపు ఏ క్షణమైనా సమ్మెలోకి వెళ్తాం..

˜ టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి

˜ అప్రమత్తమైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగబోతుంది. కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ఎండీకి ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు నోటీసులు అందజేశారు. కాగా బుధవారం టిఎంయూ కూడా సమ్మె నోటీసులు ఇచ్చింది. ఏ క్షణంలోనైనా సరే సమ్మె సైరన్‌ మోగే అవకాశం ఉందని టీఎంయూ నేతలు ఆర్టీసీ ఎండీకి ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వారుఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. ఈ నెల 25 వ తేదీ తరువాత ఏ క్షణమైనా సమ్మెలోకి వెళ్తామని టీఎంయూ నేతలు చెబుతున్నారు. ఈ నెల 25 వరకు డెడ్‌ లైన్‌ గా విధించినట్లు తెలుస్తుంది. తమ డిమాండ్స్‌ ఈ నెల 25 వ తేదీలోగా నెరవేర్చకపోతే మాత్రం ఖచ్చితంగా సమ్మెకు వెళతారని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మూడు డిమాండ్లను నోటీసులో పెట్టినట్లు తెలుస్తుంది. ఇందులో ఒకటో తారీఖులోపు వేతనం ఇవ్వాలని, డ్రైవర్లకు ఉన్న సమస్యల పరిష్కారం మరియు నూతన బస్సుల కొనుగోలు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వేతన సవరణ చేయాలని కోరినట్లు తెలుస్తుంది. సమ్మెపై ప్రభుత్వం కనుక స్పందించకపోతే మాత్రం వెనక్కు తగ్గే పరిస్థితి లేదని ఆర్టీసీ కార్మికులు చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే రవాణా శాఖ మంత్రిని టీఎంయూ నేతలు కలిసి పరిస్థితిని వివరించారని సమాచారం. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంతో తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరినట్లు తెలుస్తుంది. ఆర్టీసీ పూర్తిగా నష్టాలలో ఉన్న కారణంతో సరైన సౌకర్యాలను అందించలేకపోతుందని అందువలన ప్రభుత్వమే ఆర్టీసీని విలీనం చేసుకొని ఆర్టీసీని ప్రక్షాళన చేయటంతో పాటు వేతన సమస్యను కూడా పరిష్కరించాలని కోరినట్లు తెలుస్తుంది. డ్రైవర్ల రిక్రూట్మెంట్‌ కూడా జరగాలని కోరినట్లు తెలుస్తుంది. మరి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇవీ డిమాండ్లు.. : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఐఆర్‌, డీఆర్‌ వెంటనే ప్రకటించాలని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని వివరించారు. రూ.5 వేల కోట్ల పైచిలుకు నష్టాలతో ఉందని తెలిపారు. నష్టాలను వెంటనే పూడ్చాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఆర్టీసీలో 7 వేల మంది కార్మికులు పదవీ విరమణ చేశారని గుర్తుచేశారు. కొత్తగా ఉద్యోగాలను నియమించడం లేదని .. దీంతో ఉన్నవారిపై పనిభారం పడుతుందన్నారు. కానీ కార్మికుల సమస్యలను కార్పొరేషన్‌ పట్టించుకోవడం లేదన్నారు.

పరిష్కారం కోసం.. :

ఆర్టీసీ సమ్మె నోటీసుతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ అప్రమత్తమయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులతో సమీక్షించారు. తర్వాత బస్‌ భవన్‌లో ఆర్టీసీ ఎండీతో కలిసి కార్మిక సంఘ నేతలను కలిశారు. కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. వీలైనంత త్వరగా సమస్యలను కృషి చేస్తామని పేర్కొన్నారు.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close