తెలంగాణలో ఎన్నికల నిర్వహణ సంతృప్తికరం

0

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి డా.రజత్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజక వర్గాలకు గురువారం జరిగిన ఎన్నికలలో దాదాపు 61% పోలింగ్ నమోదయిందనీ, హింస, దౌర్జన్యాలు, బూత్‌ల స్వాధీనం వంటి ఎటువంటి సంఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా, సంతృప్తికరంగా జరిగిందనీ, దీనికి సహకరించిన ఓటర్లకు, రాజకీయ పార్టీల వారికి, అభ్యర్థులకు, అలాగే ఎన్నికల నిర్వహణతో సంబంధమున్న పోలీసులు, అధికారులు, ఉద్యోగులు, సిఇఓ కార్యాలయం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలవారు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులలో ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా. రజత్ కుమార్ చెప్పారు.
హైదరాబాద్ లోని సచివాలయంలో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు పోటీ పడి, దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించిన నిజామాబాద్ నియోజకవర్గంలో కొత్త తరం ఇ.వి.ఎం యంత్రాలతో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే ఇది అపూర్వమయినందున గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేర్చాలని కోరుతూ వారికి లేఖ రాసామని ఆయన వెల్లడించారు. నిజామాబాద్‌లో మొత్తం 21456 బ్యాలట్ యూనిట్లను, 1788 కంట్రోల్ యూనిట్లను, 1788 వివిప్యాట్లను ఉపయోగించగా వాటిలో చిన్న చిన్న లోపాలతో కేవలం 163 బ్యాలట్ యూనిట్లను(0.76%), 39 కంట్రోల్ యూనిట్లను(2.18%), 87 వివిపాట్లను(1.73%) మాత్రమే మార్చడం జరిగిందని ఆయన వివరించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here