తెలంగాణలో తెరాస హత్యా రాజకీయాలు

0

బెదిరింపులతో భయం సృష్టించే యత్నాలు

బిజెపిపై దాడులను సహించేది లేదు

డోకూరు ఘటనపై సీరియస్‌గా స్పందించిన లక్ష్మణ్‌

బాధిత కుటుంబాలకు పరామర్శ

నాగర్‌కర్నూలు :

తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అధికార టీఆర్‌ఎస్‌ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై దాడులను సహించేది లేదని లక్ష్మణ్‌ హెచ్చరించారు. అధికార పార్టీ నేతలు అధికారమదంతో పెట్రేగుతున్నారని, వారికి గట్టి బుద్ది చెబుతామని అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య జరిగిన పరస్పర దాడిలో బీజేపీ కార్యకర్త వరలక్ష్మికి గాయాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌,మాజీఎంపి జితేందర్‌ రెడ్డి తదితరులు కలసి పరామర్శించారు. తెలంగాణలో రాచరిక, కుటుంబ పాలనకు టీఆర్‌ఎస్‌ తెరలేపుతోందన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులను సహించేది లేదని లక్ష్మణ్‌ హెచ్చరించారు.గెలిస్తే దాడులు.. ఓడిపోతే హత్యలు? అనేలా రాష్ట్రంలో రాజకీయాలకు టీఆర్‌ఎస్‌ కొత్త నిర్వచనం చెబుతోందన్నారు.ప్రజల నిర్ణయాన్ని కాలరాసి, హింసా రాజకీయాలకు పాల్పడుతూ, రాచరిక పాలనకు టీఆర్‌ఎస్‌ తెరలేపుతోందన్నారు. ఇలాంటి ఘటనలను నిలువరించకపోతే టీఆర్‌ఎస్‌ తగిన మూల్యం చెల్లించికోవల్సి వస్తుందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో చోటుచేసుకుంటున్న వరుస దాడులపై ఎస్పీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, రాజకీయ కక్షలతో దాడులకు పాల్పడటం సరికాదని లక్ష్మణ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా డోకూరులో తెరాస నేత కుమారుడి చేతిలో హత్యకుగురైన భాజపా కార్యకర్త ప్రేమ్‌కుమార్‌ కుటుంబాన్ని లక్ష్మణ్‌తో పాటు ఆ పార్టీ నేతలు పరామర్శించారు. అంతకు ముందు నాగర్‌ కర్నూలు జిల్లా మహదేవునిపేట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి వరలక్ష్మిని పరామర్శించారు. దాడులు జరిగిన తీరును అడిగి తెలుసుకున్న లక్ష్మణ్‌.. బాధితుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. దాడులతో రాజకీయాలు చేయడం మానాలన్నారు. తెలంగాణ కెసిఆర్‌ జాగీర్‌ కాదని గుర్తుంచు కోవాలన్నారు. దాడుకలు తామూ సమాధానం చెప్పగలమన్నారు. మోడీ మరోమారు ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చారని, ఇక్కడి కార్యకర్తలు నిస్వార్థంగా బిజెపికి మద్దతుగా నిలిస్తే దాడులుచేసి బెదరించారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here