Featuredఅంతర్జాతీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

తెలంగాణ కుంభమేళాకు ముహూర్తం ఖరారు..

తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా జరిపే గిరిజన జాతరకు మన దేశంలోనే కాకుండా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న సంగతి తెలిసిందే. ఒక ఏడాది తప్పించి మరో ఏడాది ఘనంగా జరుపుకునే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగునే ఉన్న మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌, ఒడిషా, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దట్టమైన అడవుల్లో, కొండ కోనల మధ్య జరిగే జాతర అది.. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవం అది.. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అది.. మొత్తంగా చెప్పాలంటే ‘తెలంగాణ కుంభమేళా’ అది.. గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టే ఆ పండుగే.. ”సమ్మక్క-సారలమ్మ జాతర”. మేడారంలో జరిగే ఈ మహా జాతరకు ముహూర్తం ఖరారయ్యింది. ఈ మేరకు మాఘశుద్ధ పౌర్ణమి గడియలను బట్టి తేదీలను మహా జాతర తేదీలను మేడారం జాతర పూజారులు సంఘము ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 21వ తేదీనే మేడారంలోని ఎండోమెంట్‌ కార్యాలయంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజుల పూజారులు సమావేశమై జాతర నిర్వహణ తేదీలను ఖరారు చేశారు. ఇప్పుడు ఆ తేదీలను ప్రకటించారు. ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలు కానున్న జాతర 8న వన ప్రవేశంతో ముగియనుంది.

మొదటిరోజు..

ఫిబ్రవరి 5న బుధవారం నాడు సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.

రెండోవరోజు..

ఫిబ్రవరి 6న గురువారం నాడు సమ్మక్క గద్దెకు చేరుతుంది.

మూడవరోజు..

ఫిబ్రవరి 7న శుక్రవారం నాడు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.

నాల్గువరోజు..

ఫిబ్రవరి 8న శనివారం దేవతల వన ప్రవేశం ఉంటుంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close