తెలంగాణ ముద్దు బిడ్డ కవిత

0

జగిత్యాల (ఆదాబ్‌ హైదరాబాద్‌): నేను కేసీఆర్‌ ముద్దుల తనయ నే కాదు…తెలంగాణ ప్రజలందరికీ ముద్దుల కూతురుని అని అన్నారు నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత. బుధవారం జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలం రేచపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్‌ జగిత్యాల అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ కు మద్దతుగా జరిగిన బహిరంగ సభలో ఎంపీ కవిత మాట్లాడారు. రూ.800 కోట్లు తెచ్చిన అని అమ్మ కేసీఆర్‌ ముద్దుల తనయ కవిత అన్నారు..ఎక్కడ నుండి తెచ్చారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జీవన్‌ రెడ్డి అన్నారు .. లెక్కలు చెప్తాను జీవన్‌ రెడ్డి గారు రాసుకోండి.. అంటూ రూ. 1244 కోట్ల పైచిలుకు నిధులను జగిత్యాల అభివ ద్ధి కోసం వ్యయం చేశామన్నారు. జగిత్యాల వాసుల దశాబ్దాల కల అయిన జిల్లా కేంద్రాన్ని టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే నెరవేర్చిన విషయం అందరికీ తెలుసునన్నారు. జిల్లా కేంద్రంలో మౌలిక సదుపాయాల కోసం రూ. 50 కోట్లను మంజూరు చేసింది టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నారు. రూ.295 కోట్లు తో నాలుగు వేల ఇండ్లను నిర్మాణానికి మంజూరు చేశామన్నారు. రోళ్లవాగు ప్రాజెక్ట్‌ కి రూ. 63 కోట్లు, బోర్న పల్లి బ్రిడ్జి కోసం రూ.70 కోట్లు, రాయికల్‌ మున్సిపాలిటీ కి రూ.రూ. 25 కోట్లతో కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి, 12 కోట్లతో సిసి రోడ్ల నిర్మాణం కోసం వ్యయం చేశామన్నారు. నిజం భగీరథ పథకం కింద 422 కోట్లు ఖర్చు చేసి ప్రస్తుతం ట్యాంక్‌ లో దాకా నీరందించామని త్వరలో ఇంటింటికి నీరు అందిస్తామని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్‌ కిట్లు, పెన్షన్లు వంటి పథకాలు నిధులు ఈ లెక్కలోకి తీసుకోలేదని ఎంపీ కవిత వివరించారు. నాలుగున్నరేళ్ల లో జగిత్యాలకు రూ.1244 కోట్లకు పైగా నిధులను వెచ్చించామని కవిత చెప్పారు. స్వతంత్రం వచ్చిన దగ్గర్నుంచి కాంగ్రెస్‌, టీడీపీలే పాలించాయని అభివ ద్ధి ఏ మాత్రం జరగలేదని అన్నారు. తెలంగాణ అభివ ద్ధికి కష్టపడ్డాం .. చెమటోడ్చినం, ప్రేమతో కుటుంబసభ్యుల మాదిరిగా అందరి అభివ ద్ధిని కాంక్షిస్తూ పనులు చేస్తున్నామని.. ఓట్లు అడిగే హక్కు మాకే ఉందన్నారు. తెలంగాణ వస్తే అభివ ద్ధి కుంటుపడుతుందని, గ్రామాలు అంధకారం అవుతాయని, నక్సలైట్లు విజ ంభిస్తారని రకరకాల విష ప్రచారం చేశారన్నారు. నాలుగున్నర ఏళ్లలో శాంతిభద్రతలకు పెద్దపీట వేసిన విషయం మీకందరికీ తెలుసు అన్నారు. చిన్న ఘటన కూడా జరగలేదన్నారు. కేసీఆర్‌ పాలనాదక్షత కు నిదర్శనం అన్నారు కేసీఆర్‌ తెలంగాణ సమగ్ర అభివ ద్ధికి బాటలు వేశారని, కేసీఆర్‌ కు మళ్లీ అవకాశం ఇచ్చి అభివ ద్ధి ఫలాలను అందుకునేలా చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివ ద్ధిని దేశమంతా చూస్తోందని తెలిపారు. పెన్షన్లను మొత్తాన్ని పెంచుతామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం చేసే ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఎకౌంటు లోకి జమ అవుతున్న విషయం అందరికీ తెలుసునన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. జగిత్యాల జిల్లా అభివ ద్ధికి డాక్టర్‌ సంజయ్‌ కష్టపడుతున్నారని ఆయనను భారీ మెజార్టీ తో గెలిపించుకోవాలన్నారు.

రెండేళ్ల కింద రేచపల్లి కి వచ్చానని, మన ఊరు- మన ఎంపీ కార్యక్రమంలో పాల్గొన్న విషయాన్ని చెబుతూ అప్పటినుండి ఇప్పటివరకు 13 కోట్ల రూపాయలను రేచపల్లి గ్రామ అభివ ద్ధికి ఖర్చు చేసినట్లు ఎంపీ కవిత వివరించారు. కూటమి కుట్రలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేస్తున్న ప్రయత్నాలకు బాసటగా నిలిచి తెలంగాణ అభివ ద్ధి కోసం కేసీఆర్‌ కు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు మొహంలో ను సంతోషం చూడాలని కేసీఆర్‌ కంటున్న కలల్ని నిజం చేద్దామని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్‌, కరీంనగర్‌ జడ్పీ చైర్పర్సన్‌ తుల ఉమ, టిఆర్‌ఎస్‌ జగిత్యాల అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, ఓరుగంటి రమణ రావు, డాక్టర్‌ శైలేందర్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ గౌడ్‌, రామచంద్ర రావు, పలువురు జడ్పీటీసీలు ఎంపిటిసిలు సర్పంచ్‌ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here