తెలంగాణలో నిరుద్యోగులకు తీపికబురు

0

బీసీ గురుకులాల్లో 1698 ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఇవే కీలక నినాదాలు. స్వ రాష్ట్రం సిద్ధించాక కీలక రంగాలకు నిధులు కేటాయిస్తున్నారు. ప్రాజెక్టుల పూర్తితో రాష్ట్రంలోని భూముల్లో బంగారం పండనుంది. ఇటు ఉద్యోగాల నియామకాల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అకాడమిక్‌ ఈయర్‌ క్యాలెండర్‌ ఏర్పాటుచేసి మరీ నియామకాలు చేపడుతుంది టీఎస్‌ పీఎస్సీ. తాజాగా గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది సర్కార్‌. కొలువుల జాతర .. రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌. బీసీ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీ చేపడుతామని ప్రభుత్వం ప్రకటించింది. 1698 ఉద్యోగాల భర్తీ చేపడుతామని పేర్కొంది. ఇందులో టీజీపీ పోస్టులు 1071 ఉండగా, పీఈటీ 119 కొలువులు ఉన్నాయి. వీటితోపాటు 36 ప్రిన్సిపల్‌ సహా ఇతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయా పోస్టులను గురుకుల విద్యాలసంస్థల నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. ఇందుకనుగుణంగా ఆర్థికశాఖ కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ చేపట్టనుండటంతో నిరుద్యోగుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here