బంగారు తెలంగాణ కెసిఆర్‌తోనే సాధ్యం

0

రెండోసారి సిఎం కావడంతో ప్రజల్లో పెరిగిన భరోసా

విపక్ష పార్టీలను ప్రజలు నమ్మలేదు

లోక్‌సభలోనూ 16 సీట్లు గెల్చుకోవాల్సి ఉంది

సనత్‌నగర్‌ కార్యకర్తల సమావేశంలో కెటిఆర్‌

హైదరాబాద్‌,జనవరి2(ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణను సాధించడంతో పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌.. రెండోసారి ప్రజల ఆశీర్వాదం పొందారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ అరుదైన నాయకుడు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ రెండోసారి సీఎం కావడం దేశచరిత్రలో రికార్డు అని, కేసీఆర్‌ రాష్ట్రానికి సరైన నాయకుడని ప్రజలు భావించారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధ్యక్షతన సనత్‌నగర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నేతల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్‌ మాట్లాడారు. చావునోట్లో తలపెట్టి కేసీఆర్‌ తెలంగాణ సాధించారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ ధన్యజీవి అని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రశంసించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు.ప్రధాని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసినా ప్రజలు పెడచెవిన పెట్టారు. 75శాతం సీట్లు కట్టబెట్టి అఖండమైన విజయాన్ని అందించారు. టీఆర్‌ఎస్‌పై ప్రజలకు చెక్కుచెదరని విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వంద సీట్లలో బిజెపి డిపాజిట్‌ కోల్పోతుందని ఆనాడు చెప్పామని, అన్నట్లే 103 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతు అయ్యాయన్నారు. పేదప్రజలు టీఆర్‌ఎస్‌పై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుందామని కేటీఆర్‌ కార్యకర్తలకు సూచించారు. ఓటర్‌ నమోదు కార్యక్రమంలో సనత్‌నగర్‌ నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని కోరారు. ఇదే సందర్బంలో గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 28లక్షల ఓట్లు గల్లంతయ్యాయయని,ఉద్యమ స్ఫూర్తితో ఓటర్‌ నమోదు కార్యక్రమం నిర్వహించాల్సి ఉందన్నారు. చంద్రబాబు, రాహుల్‌, మోదీ, అమిత్‌షా ఎంత ప్రచారం చేసినా… తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. గత నాలుగున్నరేళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకున్నారని, అందుకే ఈసారి టీఆర్‌ఎస్‌కు 47 శాతం ఓట్లు వచ్చాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. డివిజన్ల వారీగా ఇచ్చిన వాగ్దానాలకు ప్రణాళికాబద్దంగా అమలు చేస్తాం. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి నామినేటెడ్‌ పదవులు తప్పకుండా ఇస్తామని హావిూ ఇచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో 16స్థానాలు సాధించాల్సిన అవసరముంది. తెలంగాణలో టీడీపీ ఖాళీ అయ్యింది. దేశవ్యాప్తంగా బీజేపీ విశ్వాసాన్ని కోల్పోతుంది. టీఆర్‌ఎస్‌కు 16 మంది ఎంపీలుంటే ఢిల్లీలో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. దేశంలోని రైతులందరికీ లాభం జరిగే కార్యక్రమాలకు సీఎం కేసీఆర్‌ ఆలోచనే నాంది కావడం గర్వకారణం. ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేస్తానని కేటీఆర్‌ వివరించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఎన్టీఆర్‌, ఇందిరాగాంధీ ఓడారని…అయితే ఆత్మవిశ్వాసంతో ముందస్తుకు వెళ్ళి విజయం సాధించిన చరిత్ర కేసీఆర్‌ది అని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు ప్రచారం చేశారరని…కానీ కేటీఆర్‌ ఒక్కరే ప్రచారం చేసి మెజార్టీ సీట్లలో టీఆర్‌ఎస్‌ను గెలిపించారని చెప్పుకొచ్చారు. బీసీల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రతి

ఎమ్మెల్యే గెలుపులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భాగస్వామ్యముందని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో చంద్రబాబు, బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేస్తే కేటీఆర్‌ ఒక్కరే సవాల్‌ చేసి ఇన్ని సీట్లు గెలిపించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి ముందస్తు ఎన్నికలకు వెళ్లి చరిత్ర సృష్టించిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here