Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

కాపు కాస్తున్న తెలంగాణ

కాంగీలో పవనాలు ˜ ఇప్పటికే కార్డు తీసిన భాజపా

˜ ‘తమ్ముడూ’ నిన్ను నమ్మేది ఎట్లా..? ˜ 21న మాదిగల ఆవేదన దీక్ష

(అనంచిన్ని వెంకటేశ్వరరావు చౌదరి,

ఆదాబ్‌ హైదరాబాద్‌)

తెలంగాణరాష్ట్రంలో కులం రాజకీయాలు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటి దాకా అంటకాగిన కులాలను పక్కకు నెట్టి కొత్తగా ‘కాపు’ కులం కార్డుతో ముందుకుసాగాలని పార్టీలు భావిస్తున్నాయి. ఈ విషయంలో భాజపా బాణంలా దూసుకెళుతోంది. కాంగ్రెస్‌ పార్టీ తాజాగా తీయాలనుకున్న కాపు కార్డు భాజాపా ఎప్పుడో తీసింది. దింపుడు గల్లం ఆశల నుంచి మళ్ళీ పుంజుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. అందుకోసం కాంగ్రెస్‌ పార్టీ తన రెడ్ల ముద్రను వదిలి.. కాపు సైన్యంతో.. పవన్‌ నాయకత్వంలో కేసీయార్తో యుద్ధం చేయడానికి సన్నహాలు చేస్తునట్లు తెలిసింది. రాష్ట్రంలో క్రమేపీ నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి పవన్‌ కళ్యాణ్‌ అవసరం వచ్చింది. అందుకు తగ్గ ఏర్పాట్లు అంతర్గతంగా జరుగుతున్నాయి. మరోవైపు మాదిగలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత లేకపోవడంతో ఈనెల 15 నుంచి 21 వరకు అంచెలంచెలుగా నిరసనలు చేపట్టాలని వారు భావిస్తున్నారు.

నాటి పవన్‌ మాటలు..: ‘తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు నిద్రపోలేదు. తిండి తిన్లేదు’ అని పవన్‌ కళ్యాణ్‌ మాటలు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరవరు. అంతటి అత్యంతాతి తీవ్ర, భారీ తెలంగాణ సమర్థకుడి సాయం కాంగ్రెస్‌ పార్టీకి కావల్సి వచ్చింది.

గత ఎన్నికల్లో..: మొన్నటి ఎన్నికల్లో ఇదే పవన్‌ కల్యాణ్‌ తెలంగాణలో ఎందుకు పోటీచేయలేదు.? అదే లెఫ్ట్‌, తెలంగాణలో నీ ‘అంటూ సొంటూ’ మాకొద్దు ఫోవోయ్‌ అని ఎందుకు తిరస్కరించింది. అదే బీఎస్పీ తెలంగాణలో ఎందుకు కలిసి రాలేదు.? ఈ అత్యంత వీర, ధీర, శూర భయంకరుడు పవన్‌ తెలంగాణ ఎన్నికల్లో పోటీ ఎందుకు చేయలేదంటే..? కేసీయార్తో గోక్కోవడం ఇష్టం లేక..!

వీహెచ్‌ కాపు రాగం: వి.హన్మంతరావు (వీహెచ్‌) పవన్‌ పవన్‌ అంటూ స్తుతికీర్తనలు ఎందుకు పాడుతున్నాడు..? ఈ తాతగారు ఈ ‘లేట్‌’ వయస్సులో ఎందుకింత రెచ్చిపోతున్నారు..? అసలు వీహెచ్‌ తనంతట తనే వెళ్లి, పవన్‌ కల్యాణ్ను ‘బాబ్బాబూ, నువ్వే ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని రక్షించాలి.. పాహిమాం పాహిమాం… కేసీయార్‌ తో పోరాటానికి నువ్వే దిక్కు, ప్లీజు.. కరుణించు’ అంటూ ఎందుకు ప్రాధేయపడుతున్నాడు?? రా, కలిసిరా, యురేనియం సంగతేమిటో తేలుద్దాం అని ఎందుకు కాళ్లావేళ్లా బతిమిలాడుతున్నాడు. తెలంగాణ కాంగ్రెస్లో చేవ చచ్చిపోయిందా..? తనకు చేత కాదని చేతులు ఎత్తేసిందా..? ఉత్తమ్‌..? ఇదా నా పీసీసీ పెత్తనం తీరు..?

భాజపా కార్డు ఎప్పుడో తీసింది..: భాజపా కాపు కార్డును ఎప్పుడో తీసింది. ధర్మపురి అర్వింద్‌, బండి సంజయ్‌ కాపు. తెలంగాణలో మున్నూరు కాపు. బీజేపీ ఒకవైపు కాపు కార్డుతో దూసుకుపోతున్నది. రెండు ఎంపీ స్థానాలు గెలిచింది. అంతే కాకుండా కాపు నాయకులకు తెలుగు రాష్ట్రాలలో మంచి ప్రాధాన్యత ఇవ్వాలని భాజపా నిర్ణయించింది.

రెడ్డి వ్యతిరేకి వీహెచ్‌: అసలే వీహెచ్‌ కాపు, పైగా రెడ్డి వ్యతిరేకి. కాంగ్రెస్‌ అంటేనే రెడ్డి పార్టీ. ఇక కాంగ్రెస్కు కూడా అదే దిక్కు. మారిన రాజకీయాలతో రెడ్డీలను వదిలేసి, ‘పవన్‌ కల్యాణ్తో ర్యాలీ అవుదాం’ అనేది వీహెచ్‌ ఆలోచన. తను అంతకు మించి ఎదిగే చాన్స్‌ గతంలో లేదు.. ఇప్పుడు లేడదూ.. భవిష్యత్తులోనూ ఉండదు?.పాపం, తెలంగాణ కాంగ్రెస్‌? జాతీయ స్థాయిలోనే నాయకత్వం కొరవడిన స్థితిలో రాష్ట్రంలోనూ ఎవరికివారే, యమునా తీరే? ఓ పాలసీ లేదు, పట్టించుకునే వాడూ లేడు? అసలు వీహెచ్‌, పవన్‌ భేటీని ‘ఎండార్స్‌’ చేసింది ఎవరు..? ధర్మపురి అర్వింద్‌, బండి సంజయ్‌ గెలవటానికి కాపు ఫ్యాక్టర్‌ కొంత ఉపయోగపడి ఉండవచ్చు గాక, కేసీయార్‌ సైతం ఉలిక్కిపడి హడావుడిగా ఓ గంగుల కమలాకర్కు మంత్రి పదవి, దాస్యం వినయభాస్కర్కు చీఫ్‌ విప్పు దక్కింది ఈ కులం కార్డుతోనే. అయితే ఇక తెలంగాణలో కాంగ్రెస్కు కాపు లీడర్లే లేరా..? మళ్లీ ఆ పవన్‌ కల్యాణే కాంగ్రెస్‌ ఆందోళన కార్యక్రమాలకు మద్దతుగా నిలబడాలా..? మొత్తం కాపులు హస్తగతం చేసుకుంటే కాంగ్రెస్‌ రెడ్డీలు చూస్తూ ఊరుకుంటారా..? ఇవన్నీ ప్రశ్నలు. అసలు నానాటికీ పాతాళంలోకి పోతున్న తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీని కనీసం చక్కదిద్దుకునే సోయి కూడా ఏ లీడర్లలోనూ లేదా..? కాపులే కాదు, ఇతర బీసీ కులాలు, ఎస్సీ, ఎస్టీల్లోకి మళ్లీ బలంగా ఎందుకు పోలేకపోతున్నది..? బీజేపీ దూకుడుకు పవన్‌ కల్యాణ్‌ కౌంటర్‌ ఎలా అయ్యాడు..? మిస్టర్‌ ఉత్తమ్‌ పార్టీలో ఏం జరుగుతున్నదో గమనించే స్థితిలోనే ఉన్నారా..?

21న ఆవేదన దీక్ష: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో 12శాతం ఉన్న మాదిగలకు స్థానం కల్పిచకపోవడంతో ఈనెల 15 నుంచి 21 వరకు నిరసనలు వెల్లడించాలని భావిస్తున్నారు. తెలంగాణల ఏర్పడి, కేసీఆర్‌ పాలన ప్రారంభమయినప్పటి నుంచి మాదిగ, ఉప కులాలపై వివక్ష చూపుతున్నారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాదిగ ఉప కులాలపై నియంతలా వ్యవహరిస్తోందని ఆ నాయకులు భావిస్తున్నారు. తెలంగాణ జనాభాలో ఐదు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఆరు మంత్రి పదవులు కేటాయించడంపై కేసీఆర్‌ సమాధానం చెప్పాలని, తమది పేదల ప్రభుత్వం అని, దళితులకు ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పిన సీఎం రెండోసారి అధికారం చేపట్టాక కూడా దళితులను తొక్కేస్తున్నారని ఆ నాయకులు విమర్శిస్తున్నారు. కేసీఆర్‌ తీరుకి నిరసనగా ఈనెల15 వరకు తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయితీల ముందు, 16న తహశీల్దార్‌ కార్యాలయల ముందు నిరసన దీక్షలు చేపడతామన్నారు. 18న అన్ని నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున రాస్తారోకోలు నిర్వహిస్తామన్నారు. దీంతోపాటు 21న వరంగల్‌ జిల్లాలోని హన్మకొండ కేడీసీ మైదానంలో మాదిగలు, ఉప కులాలపై ప్రభుత్వం చూపించే వివక్షపై ఆవేదన వ్యక్తం చేసేందుకు ‘ఆవేదన దీక్ష’ చేస్తామన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close