తెలంగాణ హైకోర్టు శతాబ్ది ఉత్సవాలు

0

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు భవనం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శతాబ్ది ఉత్సవాల్లో సుప్రీకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రమణ, జస్టిస్‌ సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, ఉత్తరాఖండ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌, న్యాయమూర్తులు పాల్గొన్నారు.

హైకోర్టు నేపథ్యమిదీ!

హైదరాబాద్‌ ఏడో నిజాం విూర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1920 ఏప్రిల్‌ 20న హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం రూపొందించిన అనేక నిబంధనలు హైదరాబాద్‌లోకి ప్రవేశించాయి. 1893 నాటికి బ్రిటిష్‌ పాలిత భారతదేశంలో ఉన్న కోర్టుల తరహాలోనే హైదరాబాద్‌ హైకోర్టు తెరపైకి వచ్చింది. హైకోర్టు మొదట్లో పత్తర్‌గట్టిలో ఉండేది. 1909లో వచ్చిన మూసీ వరదల వల్ల దాన్ని లాల్‌బాగ్‌లో ఉండే అసమన్‌జా నవాబ్‌ నివాస గృహానికి మార్చారు. 1912లో హైదరాబాద్‌లో కలరా వ్యాధి ప్రబలటంతో అక్కడి నుంచి పబ్లిక్‌గార్డెన్స్‌ హాల్‌కు తరలించారు. నాలుగు నెలల తర్వాత చెత్తబజార్‌లోని సాలార్‌జంగ్‌ బహద్దూర్‌ నివాసానికి తరలించారు. అక్కడ స్థలం సరిపోక కొద్దిరోజుల్లోనే సైఫాబాద్‌లోని సర్తాజ్‌జంగ్‌ నవాబ్‌ ఇంటికి మార్చారు. ప్రస్తుత భవనం నిర్మించేంతవరకు హైకోర్టు అక్కడే కొనసాగింది. హైకోర్టు భవన నిర్మాణాన్ని 1915 ఏప్రిల్‌ 15న ప్రారంభించారు. దీని రూపకర్త జైపూర్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్క్‌ శంకర్‌లాల్‌. ఇంజినీర్‌ మెహర్‌అలీఫజల్‌ పనుల్ని పర్యవేక్షించారు. మూసి ఒడ్డున ఎరు పు తెలుపు రంగురాళ్లతో ఇండో ఇస్లామిక్‌ శైలి లో దీన్ని నిర్మించారు. 1919 మార్చి 31న ఈ భవనం నిర్మాణం పూర్తయింది. 1920 ఏప్రిల్‌ 20న ఏడో నిజాం విూర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ చేతుల విూదుగా ప్రారంభించారు. ప్రస్తుతం దీన్ని పురానీహవేలీ వద్ద గల మ్యూజియంలో చూడొచ్చు. తొమ్మిది ఎకరాల్లో నిర్మించిన ఈ భవనానికి అప్పట్లో 18,22,750 ఖర్చు చేశారు. నిజాం కాలంలో మొదటి ప్రధాన న్యాయమూర్తిగా నవాబ్‌ ఆలంయార్‌జంగ్‌ విధులు నిర్వర్తించారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావ సమయంలో 1956 నవంబర్‌ 5న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పడింది. 1958 తర్వాత మరిన్ని నిర్మాణాలు చేపట్టారు. తొమ్మిదిన్నర ఎకరాల ప్రభుత్వ మెటర్నిటీ దవాఖాన స్థలాన్ని హైకోర్టుకు నాటి ప్రభుత్వం కేటాయించింది. అక్కడ ప్రత్యే బ్లాకు నిర్మాణం చేపట్టారు. శంషాబాద్‌ వద్ద గగన్‌పహాడ్‌ ప్రాంతంలోని కొండలను తొలిచి తవ్విన రాళ్లతో కట్టారు. హైకోర్టు భవన నిర్మాణం 1919, మార్చి 31 నాటికే పూర్తయింది. కానీ 1920, ఏప్రిల్‌ 20న విూర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here