మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది

0

తాండూర్ (ఆదాబ్ హైదరాబాద్) మైనారిటీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి , తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు అన్నారు. సోమవారం ఈద్గా వద్ద బక్రీద్ వేడుకల్లో పాల్గొని షూర్ కుంభ సేవనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులు కోరిన విధంగా తాండూర్ లో కమ్యూనిటీ హాల్ , స్మశాన  వాటికల నిర్మాణంతో పాటు ఈద్గా అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ముస్లింల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. తాండూరు ప్రాంతంలో మైనారిటీ విద్యాభివృద్ధి కోసం గురుకులాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళలకు ప్రత్యేక ప్రార్థనల కోసం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. పేద ముస్లిం ఆడ పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, బీడీ కార్మికులకు ఒంటరి మహిళలకు పింఛన్లు, బోదకాలు వారికి పింఛన్లను అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు,ముస్లింల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ వేడుకలలో ఈద్గా కమిటీ అధ్యక్షుడు యూసుఫ్ ఖాన్ టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here