Featuredప్రాంతీయ వార్తలు

రైతుల సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం విఫలం

కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రమేష్ మహారాజ్


అన్నదాత సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా

 తాండూర్ (ఆదాబ్ హైదరాబాద్) అన్నదాత సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ మహారాజ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం ముందు రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా  చేపట్టి ఆర్ డి ఓ వేణు మాధవ్ రావు కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తాండూర్ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ మహారాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. రైతుబంధు, రైతురుణ మాఫీ అంటూ ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన సీఎం కేసీఆర్  రైైతు సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ ఎక్కడ అంటూ ప్రశ్నించారు.  తాండూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు కల్యాణ లక్ష్మి,  షాదీ ముబారక్ ,రైతుబంధు, రుణమాఫీ, పట్టా పాస్ బుక్ పంపిణీ వంటి తదితర సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయనిసమస్యల పట్ల నిర్లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. నూతనంగా ఏర్పడ్డ గిరిజన గ్రామ పంచాయతీలను రెవెన్యూ విలేజ్ గా గుర్తించాలంటూ డిమాండ్ చేశారు. పేద వర్గాల ప్రజలు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు దళితులకు మూడుఎకరాల భూమి,డబుల్ బెడ్ రూమ్, ఒంటరిమహిళలకు పింఛన్ పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వివరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, పెద్దేముల్ జెడ్పిటిసి దారాసింగ్,సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, యాలాల మండల్ అధ్యక్షులు భీమయ్య, తాండూరు మండల అధ్యక్షులు రాజ్ కుమార్, మాజీ కౌన్సిలర్ లింగదల్లి రవి కుమార్, అంజన్న తదితరులు పాల్గొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close