Featuredరాజకీయ వార్తలు

తెలంగాణ ద్రోహి కెసిఆర్‌

అతనికి సుధీర్ఘకాల రాజకీయ అనుభవం ఉంది. ముస్లిం పార్టీలు విసరని ‘వల’ లేదు. అనేక రాజకీయ కుట్రలు జరిగాయి. పార్టీ అధికారంలో లేకపోయినా… ఆ పార్టీతోనే ఉన్నాడు. స్థానిక సమస్యలను అవగాహనతో పరిష్కరి స్తాడు. సున్నిత మనస్కుడైన షబ్బీర్‌ అలీతో ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’

 

ప్రత్యేక ఇంటర్వ్యూ..

తెలుగుదేశంతో పొత్తు ఎలా సమర్థించుకుంటారు.?

ప్రజాస్వామ్య వ్యవస్థలను బతికించుకోవడం కోసం కలిశాం.

కేసీఆర్‌ బాబుపై చేస్తున్న ఆరోపణలపై..?

2009లో బాబుతో కేసీఆర్‌ పొత్తు పెట్టుకున్నప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెంందుకు.?

బాబు తెలంగాణ వ్యతిరేకని…?

చంద్రబాబు ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. రెండుసార్లు తెలంగాణ కోసం లెటర్స్‌ ఇచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్‌, రాజ్యసభలలో తెలంగాణను సమర్థించారు.

ఎంఐఎంపై మీ అభిప్రాయం ?

ఎంఐఎం తెలంగాణను వ్యతిరేకించింది. పార్లమెంటులో 42 సవరణల కోసం పట్టుబట్టింది. సోనియాగాంధీ చలువతో తెలంగాణ వచ్చింది. అదే ఎంఐఎంతో మీరు ప్రయాణం ఎలా సమర్థించుకుటారు..? ఎంఐఎం మాతో ఉన్నా కూడా వారు హిందూదేవుళ్ళను, మతాన్ని కించపరిస్తే 40 రోజులపాటు జైల్లో ఉన్నారు. అదీ మా నిబద్ధత.ఎంఐఎంతో కేసీఆర్‌ చెట్టాపట్టాలేసుకుని ఉంటున్నారు కదా..?ఆరోజు తెలంగాణను వ్యతిరేకించిన వారితో ఉంటున్నాడు. తెలంగాణ కోసం ఎంఐఎంను ఆరోజు ఎందుకు అడగలేకపోయాడు. కేసీఆర్‌ తెలంగాణ ద్రోహి.

మైనార్టీలకు కేసిఆర్‌ చాలా చేశారని చెపుతున్నారు.?

కాంగ్రెస్‌ పార్టీ పథకాలకు కేసీఆర్‌ పేరుమార్చి కాలం వెళ్ళదీశాడు. మైనారిటీ, దళిత, పేద, మధ్యతరగతి, వెనుకబడిన తరగతులకు కాంగ్రెస్‌ ఎంతో చేసింది. వారంతా మా వెన్నంటే ఉన్నారు.

ఎమ్మెల్యేల బహిష్కరణ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీయలేక పోయింది.? కనీసం బందుకు పిలుపు ఇవ్వలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి.?

బందుకు పిలుపునిస్తే.. ప్రజలకు అనేక ఇబ్బందులు ఉంటాయి. పార్టీ వెంటనే స్పందించింది. మూడురోజుల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

ఫోన్‌ ట్యాపింగ్‌ పై ఫిర్యాదులు ఎమయ్యాయి..?

ఫోన్‌ ట్యాపింగ్‌ పై గవర్నర్‌ కు, డిజిపికి పిర్యాదులు చేశాం. మా దగ్గర ఆధారులన్నాయి. ఎన్నికల కమిషన్‌ కు పిర్యాదు చేస్తాం.

మీ జిల్లాలో జరుగుతున్న ప్రాజెక్టు పనుల అవినీతి గురించి..?

గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ను ఆశ్రయించాం. 200లకు పైగా ధర్నాలు చేశాం. 2013 యాక్టు అమలు చేయాలని నిలదీశాం.

మీ పార్టీ నాయకుల అరెస్టుల గురించి..?

భాజపా, తెరాస లు కలసి చేస్తున్న రాజకీయ కుట్రలను తిప్పికొడతాం.

మీపై రాజకీయ కుట్ర జరిగిందని తెలిసింది.?

అవును అనేక రకాలుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అందులో రాజకీయ కుట్రలు ఓ భాగం.

దమ్ములేక నా గుమ్మందాకా రాలేకపోయారు.

తెరాసకు వంద సీట్లు వస్తాయని కేసీఆర్‌ చెబుతున్నారు.?

ఇప్పుడు వాళ్ళను ఊళ్ళలోకి రానీయడం లేదు. కూటమి గెలుపు గుమ్మం తొక్కుతుంది. సంపూర్ణ విజయం మాదే.

బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ చెపుతూ ఆదాబ్‌ హైదరాబాద్‌ సెలవు తీసుకుంది.

సహకారం: మహేష్‌, శ్రీకాంత్‌ రెడ్డి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close