రాజకీయ వార్తలు

కుటుంబ పాలనలో తెలంగాణ బందీ -మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ

(సంగారెడ్డి, ఆదాబ్ హైదరాబాద్):అమరుల బలిదానంతో సాధించుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీగా మారిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జర్నలిస్టుల దీక్షా శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నిరుపేదలకు చేరినప్పుడే తెలంగాణ సాధనకు సార్థకత కలుగుతుందని అన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులకు అనేక హామీలను ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసగించిందని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించటంతో పాటు బ్యాంకులో జర్నలిస్టుల సంక్షేమ సంఘం పేరిట కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. జర్నలిస్టులకు సంబంధించి ఎటువంటి అంశాలను మ్యానిఫెస్టోలో చేర్చబోతున్నామో త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close