Featuredప్రాంతీయ వార్తలు

ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి సమిష్టి కృషి

తలసేమియా పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి

ఆరోగ్యశ్రీ ఎంపానెల్‌మెంట్‌ లో చేర్చడంపై హర్షం

రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళ సై

వరంగల్‌లో గవర్నర్‌కు ఘనంగా స్వాగతం

వరంగల్‌

ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి సమిష్టిగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర్య రాజన్‌ పిలుపునిచ్చారు. సోమవారం ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ వరంగల్‌ అర్బన్‌ శాఖ వారి ఆధ్వర్యంలో జూనియర్‌, యూత్‌ రెడ్‌ క్రాస్‌ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశానికి గవర్నర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ జిల్లాలో తలసేమియా పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రెడ్‌ క్రాస్‌ సెంటర్లో డెంగ్యూ ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. క్లాస్‌ లో బ్లడ్‌ బ్యాంక్‌, తలసేమియా వ్యాధులకు మెరుగైన చికిత్స అందించడంతోపాటు తగినన్ని పరికరాలు, సౌకర్యాలు ఉండడం గొప్ప విషయమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తలసేమియా వ్యాధి ను ఆరోగ్యశ్రీ ఎంపానెల్‌మెంట్‌ లో చేర్చడంపై హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ఇన్సూరెన్స్‌ స్కీములు అయినా ఆరోగ్యశ్రీ. ఆయుష్మాన్భవ పథకాల ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అంది అందించవచ్చని , ఆ దిశగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ సొసైటీ లాభం నష్టం లేకుండా చారిటబుల్‌ గా నడిచే సంస్థ అని, ఈ సొసైటీ ద్వారా అందిస్తున్న మెరుగైన సేవల పట్ల గవర్నర్‌ సంతృప్తి

వ్యక్తం: చేసారు. అంకితభావాన్ని కొనసాగిస్తూ సేవలు అందించాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా తలసేమియా, బోన్‌ మ్యారో చికిత్సకు అవకాశముందని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. రోగులకు తక్కువ ధరకు మందులు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన ఔషధీ ఈరోజు ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 9 జన ఔషధీ మందుల షాపులు విజయవంతంగా నిర్వహించడంపై రెడ్‌ క్రాస్‌ సొసైటీ వారికి అభినందించారు.

రంగల్‌ అర్బన్‌ జిల్లా వ్యాప్తంగా నవంబర్‌ 1వ తేదీ వరకు పదివేల మంది జూనియర్‌, యూత్‌ రెడ్‌క్రాస్‌ సభ్యులు ఉండగా గవర్నర్‌ పిలుపు మేరకు నవంబర్‌ 1 నుండి ఇప్పటివరకు లక్ష 16 వేల 718 మంది సభ్యులుగా చేరడం అభినందనీయమని, రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది ఇప్పటి వరకు సభ్యులుగా చేరారని, ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి అధికంగా సభ్యులను నమోదు చేయాలన్నారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ ద్వారా అందించే సేవలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుటున్నాయని అన్నారు. సమాజంలో జూనియర్‌, యువ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు పిల్లలకు లీడర్లు అని కొనియాడారు. సమాజంలో రక్త సేకరణ ఆవశ్యకతను ప్రజలలో అవగాహన కల్పించి, రక్తం డొనేషన్‌ చేసేలా చైతన్యం కల్పించాలన్నారు.

జిల్లా కలెక్టర్‌ , ఇండియన్‌ రెడ్‌ క్లాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్‌ చొరవ వల్ల తలసేమియా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చడం, ఉత్తర్వులు జారీ చేయడం పట్ల గవర్నర్‌ కు ధన్యవాదాలు తెలిపారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందుతాయన్నారు. తలసేమియా వ్యాధి గ్రస్తులకు పెన్షన్‌ మంజూరు కొరకు చర్యలు తీసుకోవడం, పేద తలసేమియా పేషంట్స్‌ కు పెద్ద ఊరట అని అన్నారు. హైదరాబాదులో డెంగ్యూ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేయడం పట్ల గవర్నర్‌ కు కృతజ్ఞతలు తెలుపుతూ వరంగల్‌ లో కూడా తలసేమియా రీసెర్చ్‌ సెంటర్‌ మంజూరు చేయాలని కోరారు. ఐ ఆర్‌ సి ఏస్‌ సెంటర్‌ ద్వారా జిల్లాలోని 280 తలసేమియా పేషంట్స్‌ కు మెరుగైన చికిత్సలు నాలుగు సంవత్సరాలు అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 5013 బ్లడ్‌ క్లాస్‌ రిజల్స్‌ చేయడం జరిగిందన్నారు. గత సంవత్సరం 11858 యూనిట్ల రక్తం సేకరించి 11585 మంది రోగులకు స్థానాన్ని అందించడం జరిగిందన్నారు. క్రాస్‌ సొసైటీలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ యంత్రాన్ని చేసి తక్కువ ధరకు ఇట్లు చేయడం జరుగుతుందన్నారు.

చ్చే సంవత్సరం ఐ ఆర్‌ సి ఎస్‌ వరంగల్‌ బ్రాంచ్‌ ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని కలెక్టర్‌ ఈ సందర్భంగా హావిూ ఇచ్చారు. ్గ/డ్‌ క్రాస్‌ సొసైటీ వరంగల్‌ శాఖ చైర్మన్‌ విజయ్‌ చందర్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులు జూనియర్‌, యూత్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు కాగా, కేవలం వరంగల్‌ జిల్లా నుండే లక్ష 16 వేల పై చిలుకు మంది విద్యార్థులు సభ్యులుగా నమోదు చేయడం జరిగిందన్నారు. దీని గాను జిల్లా కలెక్టర్‌ గారి సూచనల మేరకు నవంబర్‌ 1వ తేదీ నుండి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, లలో కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను బ్లడ్‌ డొనేషన్‌ పట్ల అవగాహన కల్పించి సభ్యులుగా నమోదు చేయడం జరిగిందన్నారు. డిసెంబర్‌ మాసంలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి అత్యధికంగా సభ్యులుగా నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. వచ్చే సంవత్సరం జనవరి నుండి ప్రణాళికాబద్ధంగా రెడ్‌ క్రాస్‌ ద్వారా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సంస్థ ద్వారా నిర్వహించే రక్త సేకరణ, వాహనాల నిర్వహణ, పరికరాల కొనుగోలు మొదలగు వాటిపై జీఎస్టీ నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ను కోరారు.

ఈ కార్యక్రమాల్లో గవర్నర్‌ కార్యదర్శి, తిసఞబ వైస్‌ ప్రెసిడెంట్‌ సురేంద్రమోహన్‌, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి,

వరంగల్‌ నగర కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మను చౌదరి, తిసఞబ వరంగల్‌ బ్రాంచ్‌ జనరల్‌ సెక్రెటరీ ఈ వి శ్రీనివాసరావు, ఐ ఆర్‌ సి ఎస్‌ సభ్యులు, అసోసియేషన్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఐఆర్‌సిస్‌ వరంగల్‌ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ పతాకాన్ని గవర్నర్‌ ఆవిష్కరించారు. సికిల్‌ సెల్‌ను, జనరిక్‌ మందుల షాపును, బ్లడ్‌ బ్యాంకు ను పరిశీలించి రక్తదానం చేసిన దానం చేసిన వారికి వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. భవన అదనపు గదుల నిమిత్తం 3.7 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే పనులకు గవర్నర్‌, శంకుస్థాపన చేశారు. అనంతరం వెయ్యి స్తంభాల , భద్రకాళి దేవాలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు. తదుపరి ఖిలా వరంగల్‌ లో కాకతీయ కట్టడాలను సందర్శించారు. అంతకుముందు వరంగల్‌ చేరుకున్న తమిళ సైకి మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి, ఎంపి మసునూరి దయాకర్‌, కలెక్టర్‌, కమిషనర్‌లు ఘనంగా స్వాగతం పలికారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close