ఫ్రంట్‌పై తంటాలు..

0

  • ఎన్నికల ఫలితాలకు ముందే పక్కా ప్రణాళిక
  • పెఢరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై చురకుగా కేసీఆర్‌
  • తమిళనాడులో డిఎంకె చీఫ్‌ స్టాలిన్‌తో భేటీ
  • ఇరువురి మధ్య కీలక చర్చ..
  • దేశ రాజకీయాలపై పరస్పరం చర్చ చెన్నై : డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు విషయంలో ఇద్దరు నేతల మధ్య కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చురుకుగా అడుగులు వేస్తున్నారు. ఫెడరల్‌ఫ్రంట్‌ ఏర్పాటులో ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టేందుకు రాష్ట్రాల పర్యటనలు చేపడుతున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా కె.చంద్రశేఖర్‌ రావు సోమవారం డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌తో భేటీ అయ్యారు. తమిళనాడు పర్యటనలో ఉన్న కేసీఆర్‌ సాయంత్రం చెన్నైలోని అళ్వార్‌పేటలోని స్టాలిన్‌ నివాసానికి వెళ్లారు. స్టాలిన్‌ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను సాదరంగా స్వాగతం పలికి లోపలకు తీసుకువెళ్లారు. ఈ సమావేశంలో డీఎంకే సీనియర్‌ నాయకులు దురైమురుగన్‌, టీఆర్‌బాలు, టీఆర్‌ఎస్‌ నేతలు సంతోష్‌, వినోద్‌ పాల్గొన్నారు. కాగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా కేసీఆర్‌ ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన స్టాలిన్‌తో సమావేశం అయ్యారు. గతంలోనూ కరుణానిధితో కేసీఆర్‌ భేటీ అయ్యారు కూడా. ఇప్పటికే కేరళ సీఎం విజయన్‌, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కూడా కేసీఆర్‌ చర్చలు జరిపారు. ఈ క్రమంలో దక్షిణిదాలో కీలకంగా ఉన్న డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కేసీఆర్‌ సమావేశమయ్యారు. చెన్నై వెళ్లిన కేసీఆర్‌కు స్టాలిన్‌ శాలువా కప్పి సత్కరించారు. వారం వ్యవధిలో సీఎం కేసీఆర్‌ తమిళనాడుకు వెళ్లడం ఇది రెండోసారి. కాంగ్రెస్‌, బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసిన కేసీఆర్‌ ఇటీవల కేరళ, తమిళనాడులో పర్యటించారు. గత సోమవారం దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు బయలుదేరేముందే స్టాలిన్‌ ను కలవాలని అనుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన స్టాలిన్‌ 13న చెన్నైకి రావాలంటూ ఆహ్వానించారు. దీంతో కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లి స్టాలిన్‌ను కలిశారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు దగ్గరపడుతుండటంతో రాష్ట్రాల బాటపట్టిన కేసీఆర్‌ పార్టీల అధినేతలు, సీఎంలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఒక దఫా దాదాపు తనకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలన్నీ తిరిగొచ్చిన కేసీఆర్‌ రెండోసారి మళ్లీ ఫెడరల్‌ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవలే కేరళ వెళ్లిన కేసీఆర్‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తో భేటీ అయ్యి కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీ మెజార్టీ సీట్లు దక్కించుకుని గెలిచే అవకాశాల్లేవని ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని నిశితంగా వివరించారు. ఈ నెల 23 తరువాత కేంద్రంలో ఏర్పాటుకాబోయే ప్రభుత్వంలో ప్రాంతీయపార్టీలు కీలకపాత్ర పోషించాలని.. ప్రాంతీయపార్టీల వద్దకే జాతీయపార్టీలు వచ్చేలా అందరం కలిసి ముందుకువెళ్దామని ఈ సందర్భంగా కేసీఆర్‌ డీఎంకే అధినేతకు వివరించనున్నారు. కేంద్రం లో ఏ జాతీయపార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాదని, ప్రాంతీయపార్టీలు సాధించే స్థానాలే కీలకం కానున్నాయని తెలిపారు. ప్రాంతీయపార్టీలతో ఏర్పాటయ్యే కూటమి ద్వారా కేందప్రభుత్వంలో కీలకపాత్ర పోషించి.. రాష్ట్రాలకు అధికారాల బదలాయింపు, అధికార వికేంద్రీకరణ సాధించాలని కెసిఆర్‌ కోరుకుంటున్నారు. జాతీయస్థాయి సమస్యలను పరిష్కరించుకుందామని వివరిస్తారు. సీఎం కేసీఆర్‌ గతంలోనూ అప్పటి డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో ఫెడరల్‌ఫ్రంట్‌పై చర్చించారు. త్వరలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో మరోసారి సమావేశమయ్యారు. ఫెడరల్‌ ఫ్రంట్‌పై కలిసి రావడానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ, ఒడిశాకు చెందిన బీజేడీ, పశ్చిమబెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ, ఎస్పీ నేత అఖిలేశ్‌యాదవ్‌సహా పలుపార్టీలకు చెందిన నేతలు సంసిద్ధత వ్యక్తంచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here