సినిమా వార్తలు

జనవరి 6 న తానా ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన

గాంధీ ఉప్పు సత్యాగ్రహం అంత గొప్పది ”అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన” కార్యక్రమం : ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): తెలుగు కనుమరుగవుతున్న తరుణంలో తెలుగు యొక్క గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తముగా చాటి చెప్పేలా ”జనవరి 6న లక్షలాది మంది విద్యార్థులతో ‘అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన” అనే వినూతన కార్యక్రమాన్ని చేపట్టారు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు శత శతకకవి శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్‌, తానా అధ్యక్షులు శ్రీ తాళ్లూరు శేఖర్‌. ఈ సందర్భం గా ‘అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన” పోస్టర్‌ ని ఈ రోజు ప్రముఖ దర్శకులు కె. విశ్వనాధ్‌ చేతుల మీదుగా లాంచ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో కె .విశ్వ నాథ్‌ మాట్లాడుతూ ”శత శతక కవి చిగురుమళ్ల శ్రీనివాస్‌ గారు కొన్ని పద్యాలూ పాడి వినిపించారు. ఎంతో అర్ధవంతం గా, వేమన పద్యాలూ గుర్తు చేసేలా ఉన్నాయి. వారికి తెలుగు మీద ఎంత అవగాహన, అమ్మ నాన్న , గురువు ల పై ఎంత భక్తి ఉందో పద్యాలు విన్నాక తెలుస్తుంది. ఇవి భావి తరాలకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ కార్య క్రమముతో పిల్లలను తీర్చిదిద్దా లని కంకణము కట్టుకున్నారు వీరు. లక్ష మంది పిల్లలు పాడుతు న్నారంటే నిజంగా ఇదొక చారిత్రాత్మకమైన సంఘటనగా చెప్పొచ్చు. గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసి ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో, అలా భాషాభిమానముతో ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని హితోధికముగా చేస్తోన్న తాళ్లూరు శేఖర్‌, చిగురుమళ్ళ శ్రీనివాస్‌ ని అభినందిస్తున్నాను”అన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు శత శతకకవి శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్‌ నిర్వహణలో ”అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన” జనవరి 6న జరుగుతుందని, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన బోతు న్నారని తానా అధ్యక్షులు శ్రీ తాళ్లూరు రాజశేఖర్‌ గారు తెలియ జేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలియ జేస్తూ ”భద్రాద్రి కవి శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్‌ రచించిన అమ్మ శతకం, నాన్నశతకం, గురువు శతకాల లోని పద్యాలను విద్యార్థులచే కంఠస్థం చేయించి ఎవరి పాఠశాలలో వారు సమావేశమై సామూహిక గానం చేసే బ హత్‌ యజ్ఞం ఇది” అన్నారు. అమ్మానాన్న గురువుల పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం కలిగించడం, తెలుగు భాషా సంస్క తులను పరిరక్షిం చటం, విలువలను భావితరాలకు అందించటం, వంటి సదుద్దేశా లతో తానా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక దేశ విదేశాలలో ఈ పద్యార్చన జరగబో తుందని, ఈ కార్యక్రమంలో లక్షలాదిగా విద్యార్థులు పాల్గొనాలని ఆయన తెలియజేశారు. ”అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన” కు ప్రముఖ సాహితీ వేత్తలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్‌, నటుడు తనికెళ్ళ భరణి సపోర్ట్‌ చేస్తున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close