Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

తమిళనాడే టార్గెట్‌

ఆఫ్గన్‌ ఉగ్రవాదుల చొరబాటు!

  • శ్రీలంక విూదుగా దేశంలోకి..
  • నిఘా వర్గాల హెచ్చరికతో హైఅలర్ట్‌
  • కశ్మీర్‌, ఢిల్లీలో దాడులకు పాక్‌ కుట్ర

న్యూఢిల్లీ

కశ్మీర్‌ విషయంలో ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని గోబెల్స్‌ ప్రచారం చేస్తోన్న దాయాది పాకిస్థాన్‌.. మరోసారి భారీ ఉగ్రదాడికి వ్యూహరచన చేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈసారి కశ్మీర్‌లో పెద్దఎత్తున మారణ¬మం సృష్టించేందుకు కుట్రపన్నినట్టు ఐబీ తెలిపింది. ఆప్గన్‌ ఉగ్రవాదులను కశ్మీర్‌లోకి పంపి దాడులకు ప్రయత్నిస్తున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో కల్లోలానికి కుట్రలు పన్నుతోన్న పాపిస్థాన్‌.. ఉగ్రవాదుల చొరబాట్లకు సిద్ధం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాల వద్ద ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నట్టు నిఘా సంస్థలు పేర్కొన్నాయి. కశ్మీర్‌తోపాటు దేశ రాజధానిలో ఉగ్రదాడులకు చాలా మంది ఆప్గన్‌ ఉగ్రవాదులును సిద్ధంచేసినట్టు ఐబీ వర్గాలు తెలిపారు. అంతేకాదు, కశ్మీర్‌లో భద్రతా బలగాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్టు పేర్కొన్నాయి. కశ్మీర్‌లో రాజకీయ నేతలను సైతం టార్గెట్‌ చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. జమ్మూ కశ్మీర్‌లోని భద్రత సిబ్బందిపై దాడులకు పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ ఇప్పటికే వ్యూహరచన చేసినట్టు రిసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌ (రా) నివేదిక హెచ్చరించింది. రా నివేదిక ప్రకారం… ఆగస్టు 19న పాకిస్థాన్‌ బహ్వాల్పూర్‌లోని మర్కజ్‌ ఉస్మాన్‌ ఓ అలీలో జైషే ఉగ్రవాద సంస్థ ఓ ప్రత్యేకంగా సమావేశమైనట్టు తెలిసింది. జేషే అధినేత మసూద్‌ అజార్‌ సోదరుడు, ఆ సంస్థ ఆర్మ్‌డ్‌ వింగ్‌ కమాండర్‌ రౌఫ్‌ అస్ఘర్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అలాగే పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు కశ్మీర్‌లోని పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, అధికారులు, జమ్మూ కశ్మీర్‌ పోలీసులను టార్గెట్‌ చేసినట్టు మరో సమాచారం నిఘా వర్గాలకు అందింది. కశ్మీర్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడతుండగా, ఉగ్రదాడుల హెచ్చరికలతో జనం మరింత ఆందోళన చెందుతున్నారు. ఉగ్రమూకలు ఎప్పుడు విరుచుకుపడతాయోనని భయపడుతున్నారు. ఆర్టికల్‌ 370 రద్దుకు ముందే కశ్మీర్‌కు భారీగా బలగాలను తరలించిన కేంద్రం.. అక్కడ కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. కానీ, సరిహద్దుల్లోని భారత సైనిక స్థావరాలపై పాకిస్థాన్‌ దాడులకు పాల్పడి ఉగ్రవాదులను కశ్మీర్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తోంది.

తమిళనాడు వ్యాప్తంగా హై అలర్ట్‌..

భారత్‌లోకి చొరబడిన ముష్కరుల్లో ఒకరు పాకిస్థానీ కాగా.. ఐదుగురు శ్రీలంక తమిళ ముస్లింలుగా తెలుస్తోంది. హిందువులుగా దేశంలోకి చొరబడి ఉగ్ర చర్యలకు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాలు సమాచారమిచ్చాయి. రద్దీ ప్రదేశాలు, ప్రముఖ రాజకీయ నాయకులు, విదేశీ రాయబార కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని వీరు దాడులకు పాల్పడే ప్రమాదముందని పేర్కొన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను ముమ్మరం చేశారు. కొయంబత్తూర్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. నగరంలోని అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. అటు చెన్నైలో బలగాలను పెంచారు. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్‌, బస్‌స్టాండ్‌, ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తీర ప్రాంత జిల్లాలన్నింటికీ హెచ్చరికలు 

జారీ చేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close