Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలు

నిండుకుండలా పులిచింతల

హుజూర్‌నగర్ (ఆదాబ్ హైదరాబాద్ ):సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల జలాశయం నిండుకుండలా దర్శనమిస్తోంది.  జలాశయంలో నీటి నిల్వ 44.181 టీఎంసీలకు చేరింది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి కేవలం 1.5 టీఎంసీలే తక్కువ. ఈ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం కూడా 175 అడుగులు. ప్రస్తుతం నీటిమట్టం 173.98 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో కేవలం వెయ్యి క్యూసెక్కులే ఉండగా.. రేడియల్‌ గేట్ల ద్వారా అవుట్‌ ఫ్లోను నిలిపేశారు. స్లూయిస్‌, గేట్ల లీకేజీ ద్వారా కేవలం వెయ్యి క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. విద్యుదుత్పాదన కూడా రెండ్రోజులుగా చేయడం లేదు. జల విద్యుత్కేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తడానికి తోడు.. ఏపీ ప్రభుత్వం కూడా జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిల్వ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఇక్కడ విద్యుదుత్పాదనకు అవకాశం లేకుండా పోయింది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close