తండ్రికి బదులుగా తనయుడి ప్రచారం
– సనత్‌నగర్ నియోజక వర్గంలో తగ్గిన కారుజోరు
– ప్రచారానికి దూరంగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్
– టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్న సెకండ్ క్యాడర్
– కొడుకు ప్రచారంతో టీఆర్ఎస్ శ్రేణులలో తగ్గిన జోరు
సికింద్రాబాద్ (అదాబ్ హైదారాబాద్): సనత్‌న గర్ నియోజక వర్గంలో రోజు రోజుకు రాజకీయాల సమీకరణాలు మారుతున్నాయి. కారు జో రు తగ్గుతుందన్నా వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతినిధ్యం వహి స్తున్న నియోజక వర్గం కావడంతో నగరం లోని అందరి చూపు సనత్నరగ్ నియోజక వర్గం పై ఉంది దానితో ఇప్పటి వరకు శ్రీనివాస్ యాద వ్ ప్రచారం చేపట్టకపోవడంతో అయన గెలుపు కష్టమన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. 2014లో సనత్‌నగర్ టికెట్ కూన వెంకటేష్‌గౌడ్‌కు రాకుం డా అడ్డుకొని టిడిపి తరుపున పొటి చేసి గెలిచి పార్టీకి, నియోజక ప్రజలకు మంత్రి పదవికోసం వెన్నుపోటు పోడిచి టిఅర్ఎస్ పార్టీలో చేరాడని అనేక విమర్శలు వినిపించాయి. అయిన నియోజక వర్గంలో పట్టు సాదించుకొవడం కోసం తలసాని అనేక తిప్పలుపడారు. కానీ సనత్‌నగర్ నియోజక వర్గంలో చాల మంది అంధ్రప్రాంతకు చెందిన వారు. అయితే ఇటివల టిఅర్ఎస్ పార్టీ అదిస్ధానం, శ్రీనివాస్‌యాదవ్‌లు కలసి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడంతో ఇక్కడి ప్రాంత వాసులు టిఅర్ఎస్ పార్టీపై తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై తీవ్ర అగ్రహంతో ఉన్నట్లు సమాచారం. విరామ సమయం దోరికినప్పడల్ల తలసాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఇష్టారాజ్యంగా దుషించడంతో సనత్‌నగర్ వాసులు దానిని మనుసులో ఉంచుకున్న చాల మంది ఇపుడు టిఅర్ఎస్కు సరైన గుణపాఠం చెబుతారని టిడిపి నాయకులు అరోపిస్తున్నారు. దానితో శ్రీనివాస్ యాదవ్ ప్రత్యక్షంగా ప్రచారం చేయలేకపోతున్నారని అందుకోసం తన తనయుడితో ప్రచారం చేయిస్తున్నారని ప్రచారం సాగుతుంది. టిడిపికి వెన్నుపోటు పోడిచినందుకు నియోజక వర్గ ప్రజలను ఎలా ఓట్లు అడగాలో ఎంత మంది వ్వతిరేకిస్ధారో అర్ధంకాని పరిస్థితి నెలకోన్నది. రాష్ట్ర మంత్రిగా ఉండి కూడ నియోజక వర్గ అభివృద్ది అశించినంత చేయలేదన్నవిమర్శలు ఉన్నాయి. సనత్‌నగర్ నియోజక వర్గంలో రెండో తరహ నాయకులు లేకుండా ఎవరిని ఎదుగకుండా తలసాని చేసారని టిఅర్ఎస్ నాయులు సైతం అగ్రహంతో ఉన్నారు. ఉద్యమం నుండి ఉన్న వారికి కనీస ప్రోత్సహం ఇవ్వలేదని ఉద్యమ కారులను కావాలనే తలసాని అణచి వేసారన్న అరోపణలు ఉన్నాయి. డబ్బు ఖర్చు చేసి అద్దె కార్యకర్తలతో ఎంత జోరుగా ప్రచారం చేసిన టిఅర్ఎస్ క్యాడర్లో ఎంత మంది ఓట్లు వేస్తారన్నాది ప్రశ్నిర్ధకంగా మారింది. టిఅర్ఎస్లో సెకండ్ క్యాడర్ లేకుండా కెవలం మహిళ నాయకురాళ్లతో అద్దెకార్యకర్తలతో ఎలా ప్రచారం చేసి ఓట్లు సాదించి గెలుపొందుతారో వెచిచూడాలి.