Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలు

కమలంతో తలైవా…?

  • దోస్తీకి రెడీ అవుతున్న రజనీ
  • కమల్‌ తో ”ఢీ”?

రెండు దశాబ్దాలకు పైగానే నలుగుతున్న రజనీ రాజకీయ రంగప్రవేశంపై ఎట్టకేలకు గత ఏడాది రజనీ తెరదించారు. రాజకీయాల్లోకి వస్తున్నానని బహిరంగంగా ప్రకటించారు. అంతే కాదు అందుకు తన అభిమానులను సన్నద్ధం చేశారు. దీంతో గత పార్లమెంట్‌ ఎన్నికల్లో రజనీకాంత్‌ పార్టీ పోటీ చేస్తుందని చాలా మంది భావించారు. అయితే శాసన సభ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకున్న రజనీ పార్లమెంట్‌ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దీంతో ఆయన అభిమానుల్లో రజనీకాంత్‌ రాజకీయరంగప్రవేశంపై మరోసారి సందేహం తలెత్తింది. అందుకు కారణం ఆయన వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లడం కూడా. అయితే మరోపక్క రజనీకాంత్‌ మొదటి నుంచి బీజేపీకి, మోడీకి మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు. రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలకనుగుణంగానే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగ్రించింది. సొంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్రమోడికి రజనీకాంత్‌ శుభాకాంక్షలు తెలిపారు.పార్లమెంట్‌ ఎన్నికల ముందు వరకూ బీజేపీ గెలు స్తుందా? కాంగ్రేస్‌ కూటమి గెలుస్తుందా? అన్న చిన్న సందేహంతో ఉన్న రజనీకాంత్‌ ఎన్నికలనంతరం ఫలితాలతో పూర్తిగా బీజీపీ మద్దతుదారుడిగా మారినట్లు తెలుస్తోంది. ఇక సోమవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర¬ంమంత్రి అమిత్‌షాతో పాటు రజనీ కాంత్‌ పాల్గొని మోడీ,అమిత్‌షాలను కృష్ణార్జులుగా పేర్కొంటూ ప్రశంసల వర్షం కురించారు. ఆర్టికల్‌ 370రద్దు చేస్తూ మోడీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. జమ్మూకశ్మీర్‌ పునర్‌ విభజన బిల్లుపై చర్చ సమయంలో అంతేకాకుండా పార్లమెంట్‌ లో అమిత్‌ షా ఇచ్చిన స్పీచ్‌ సూపర్‌ అంటూ ప్రశంసించారు. ఇవన్నీ చూస్తున్న రాజకీయ కోవిదులు,సాధారణ ప్రజలు కూడా రజనీ చూపు బీజేపీ వైపు పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలతో కూటమిగా పోటీ చేయాలన్నది తలైవా వ్యూహంలా కనిపిస్తోందని ప్రచారం జోరందుకుంది. బీజేపీకి కూడా తమిళనాడులో కాలు మోపాలనే ఆకాంక్ష చాలా కాలంగా బలనీయంగా ఉంది. అయితే ఇక్కడ ఒంటరిగా పోటీ చేసే పరిస్ధితి లేదు. అంతే కాదు గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పాలకప్రభుత్వం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నా ఒక్క లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. డీఎంకే క్లీస్‌ స్వీప్‌ చేసింది. దీంతో రానున్న శాసనసభ ఎన్నికల్లోనైనా అన్నాడీఎంకే,రజనీకాంత్‌లతో పొత్తు పెట్టుకుని గెలవాలని బీజేపీ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు శాసనసభ ఎన్నికల్లో ఆయన చిరకాల మిత్రుడు కమలహాసన్‌తో రజనీకాంత్‌ డీ కొనక తప్పాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకుంటే మక్కళ్‌నీదిమయ్యం పార్టీ చీఫ్‌ కమలహాసన్‌ మొదటి నుంచి అన్నాడీఎంకే,బీజీపీ పార్టీలకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు.ఇక జమ్మూకశ్మీర్‌ వ్యవహారంలోనూ బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టారు. అయితే రజనీకాంత్‌తో కూటమికి సిద్ధం అనే సంకేతాలు చాలా సార్లు పంపారు. అలాంటిది ఇప్పుడు ర జనీకాంత్‌ బీజేపీ,అన్నాడీఎంకే పార్టీలతో పోత్తు పెట్టుకుంటే కమలహాసన్‌ ఆయనతో డీ కొనక తప్పదు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close