Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

ఇవిగో కన్నీళ్ళు దోసిళ్ళు పట్టండి

ప్రధాని ఓదార్పు వెనుక

? ముఖ్యమంత్రి ఉద్వేగం

? భారతీయుల సున్నిత మనస్తత్వం

(రమ్యాచౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌)

చంద్రయానం రెండడుగుల దూరంలో నిలిచిపోవచ్చు. తెలంగాణలో రాజకీయాలే నియంత్రణగా ఉండవచ్చు. ఉద్వేగాల విషయంలో మాత్రం మనం భారతీయులమనే భావన ఇచ్చిన సంఘటనలు కాకతాళీయం కావచ్చు కానీ.. ఓటిమి సందర్భంలో ఓదార్పు, వీడ్కోలు సందర్భంలో ఆత్మీయ స్పర్శ… ఏంతో భిన్నం. విభిన్నం. అదే ప్రపంచానికి ఆదర్శమైన భారతీయత. రెండు సందర్బాలు వేర్వేరు. అయినా ఆగని కన్నీళ్ళు. మానవత్వం కనుమరుగు అవుతున్న సమాజంలో…ఎలాంటి స్వార్థం లేకుండా ఉబికి వచ్చిన నీటిధారాలు భారతీయ ఆత్మీయతకు నిదర్శనం. ఇవిగో కన్నీళ్ళు దోసిళ్ళు పట్టండి.

ఆ కన్నీళ్ళు ఎందుకు వచ్చాయ్‌…

? బీదల బతుకు నుంచి

? ఒడిదుడుకులు పయనం

? 125 కోట్ల ఆశల పల్లకి

గొప్పోళ్ళకు అంత త్వరగా కన్నీళ్లు రావు. పేదోడికి మాత్రం

ఓ పేదోడి పెద్ద కల తాత్కాలికంగా ఆగింది. తమిళనాడులో ఎక్కడో కన్యాకుమారి జిల్లాలోని ఓ మారుమూల పల్లెలో ఓ దిగువ మధ్యతరగతి రైతుకుటుంబంలో పుట్టాడు. అవునూ, ఇప్పుడు ఆయన గురించి చెప్పుకోవడం ఎందుకంటారా..? చంద్రయాన్‌-2 ప్రాజెక్టు అనుకున్నట్టుగా జరగకపోవడంతో బరస్ట్‌ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రధాని మోడీ హత్తుకుని ఊరడించాడు. దేశం మొత్తం ఇటీవల కాలంలో ఎప్పుడూ, ఎవరికీ సపోర్ట్‌ చేయనట్టుగా శివన్‌ వెంట నిలిచింది. ఓదార్చింది. ఎనిమిదవ తరగతి పిల్లాడి నుంచి ప్రధాని దాకా తన బాధను షేర్‌ చేసుకున్న తీరు ఇటీవలకాలంలో ఇదే ప్రథమం. అప్పట్లో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ సంఘటన సమయంలో ‘దేశభక్తి మరీ మత్తడి దూకిన’ కొంతమంది వ్యతిరేకించారు, పిచ్చి కామెంట్స్‌ చేశారు కానీ?శివన్‌ వెనుక జాతి మొత్తం నిలబడింది. అపూర్వం. కానీ తను అంత సీనియర్‌ పొజిషన్లో ఉండి ఎందుకలా బరస్టయ్యాడు..? ఎందుకంటే..? తన మూలాలు? ఎక్కడి నుంచో ఎదిగాడు, ఓ ప్రాజెక్టు సక్సెస్‌ తన హాయంలో జరగాలని కలగన్నాడు. అందుకే ఆ బాధ? నిజానికి అది అక్కడున్న అందరు శాస్త్రవేత్తల్లోనూ ఉంది? కానీ అందరికీ పెద్ద కదా? ఆ బాధ తీవ్రత ఎక్కువ ఉంటుంది.

ఆమధ్య జీఎస్‌ఎల్వీ ప్రయోగం వాయిదా?:

అప్పట్లో చంద్రయాన్‌-1 పెద్దగా అనుకున్నంతగా సక్సెస్‌ కాలేదు. ఈ చంద్రయాన్‌-2 అనుకున్నట్టు నడవకపోతే రాబోయే ప్రాజెక్టులపై దాని ప్రభావం ఏమిటో తనకు తెలుసు. ఇస్రో చీఫ్గా ఈ విపరిణామాలూ తెలుసు? అందుకే ఆ బాధ? అందుకే ప్రధాని ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నాడు? ఇంతకీ తను ఎవరు..?

కిందస్థాయి నుంచి..:

నాగర్కోయిల్‌ దగ్గర సరక్కవిలైలో పుట్టాడు. పక్కా తమిళ విూడియం, ప్రభుత్వ బడి అసలు తను ప్రికాలేజీ చదువులో చేరేదాకా కనీసం రెండు జతల బట్టలు కూడా లేవు తనకు? చెప్పుల్లేవు. బహుశా మెజారిటీ పల్లెల్లో విద్యార్థుల పరిస్థితి అప్పట్లో అదే కదా.! సెలవులొస్తే చాలు, తండ్రి మామిడి తోటకు వెళ్లాలి, తను వచ్చాడు కాబట్టి ఆరోజుకు ఓ కూలీ కట్‌?అలా బతికాడు? ప్లస్‌ టూ అయిపోయాక ఇంజనీరింగులో చేరాలనేది తన ఆలోచన? కానీ తన తండ్రికి అంత సీన్‌ లేదు? వద్దన్నాడు? వారం రోజులు ఉపవాసం ఉన్నాడు తన చదువు కోసం. తండ్రిపై ఒత్తిడి కోసం? ఇంజనీరింగు చదివించడం నా వల్ల కాదు గానీ, ఇంకేమైనా చదువుకో అని దిగివచ్చాడు నాన్న? బీఎస్సీ మాథమెటిక్స్‌ అయిపోయింది? తరువాత ఏమిటి..?

ఇక చదువుకో…:

తండ్రి అప్పుడు చెప్పాడు? మన కుటుంబాల్లో డిగ్రీ చదివినవాడివి నువ్వే? అవసరమైతే కొంత భూమి అమ్మేస్తాను, నీ ఇష్టమొచ్చిన కోర్సు చదువుకో అన్నాడు? అలా ఇంజనీరింగులో చేరాడు? ప్లస్టూ వరకూ తనకు ప్యాంట్లు లేవు? ధోతీ కట్టేవాడు? చెప్పుల్లేని పాదాలతోనే వెళ్లేవాడు చదువులకు..! ఎలాగైతేనేం ఇంజనీరింగు పూర్తయ్యింది? తను చదివిందేమో ఏరోనాటికల్‌ ఇంజనీరింగు? కొలువులేవీ..?

హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌), లేదంటే నేషనల్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌(ఎన్‌ఏఎల్‌), కొలువు దొరకలేదు. దాంతో ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ లో చేరాడు. జీవితం తను అనుకున్నట్టు సాగదనీ, విధిని బట్టి నడవాల్సిందేనని అర్థమైంది. తను శాటిలైట్‌ సెంటర్‌ కోరుకున్నాడు, కానీ విక్రమ్‌ సారాభాయ్‌ సెంటర్‌ దొరికింది. అక్కడ కూడా ఏరోడైనమిక్స్‌ గ్రూపు కావాలని అనుకున్నాడు, కానీ పీఎస్‌ఎల్వీ ప్రాజెక్టులో చేరాల్సి వచ్చింది. కావల్సింది దొరక్కపోతేనేం, దొరికినదాంట్లోనే దున్నేయాలి. క్రయోజనిక్‌ ఇంజన్ల తయారీలో తనదీ ఓ కీలకపాత్రే.

అలా.. అలా.. ఇస్రో చైర్మైన్‌:

తరువాత మెల్లమెల్లగా ఎదుగుదల? ఇప్పుడు ఏకంగా ఇస్రో చీఫ్‌? కానీ ఎప్పుడూ తన మూలాల్ని మరిచిపోలేదు? డౌన్‌ టు ఎర్త్‌? పని, పని, పని? అదే జీవితం? కొన్ని చిరస్మరణీయమైన విజయాల్ని తన హయాంలో సాధిస్తే ఉప్పొంగాలని ఎవరికి ఉండదు..? అందుకే ఈ చంద్రయాన్‌-2 విూద బాగా ఆశలు పెట్టుకున్నాడు. కానీ రోవర్‌ ల్యాండింగ్‌ ఎంత క్లిష్టమో, ఎంత కష్టమో తనకు తెలుసు. ఆ చివరి 15 నిమిషాలు నరాలు తెగే ఉత్కంఠ ఉంటుందని చెప్పుకున్నాడు ప్చ్‌, పాపం? తను అనుమానించినట్టే ల్యాండింగ్‌ ఇక్కట్లు? ఓ ప్రధాని ఎదుట తలవంచుకున్నాడు…కన్నీళ్లు పెట్టుకున్నాడు? ఇదీ శివన్‌ కన్నీళ్ల వెనుక కథ?

చివరిగా..:

ఓ అద్భుత ఘట్టం వెనుక వేలాదిమంది కృషి. కోట్లాదిమంది భారతీయులు పన్నుల రూపంలో కట్టిన 900 కోట్లు… కేవలం.. కొన్ని అడుగుల దూరంలో నిలిచిపోవడం ప్రతి ఒక్కరి గుండె బరువెక్కించ్చింది. ప్రధాని ఒక్క శివన్‌ ని హత్తుకోలేదు… యావత్‌ దేశం ఆ శాస్త్రవేత్తల హృదయాలను హద్దుకుంది. అది అండగా ఉన్నట్లు చెప్పినట్లు. ప్రధానమంత్రి మోడీ ఓదార్పు దేశవ్యాప్తంగా ఇచ్చిన ఆత్మీయ సందేశం. ఇదే నేటి సమాజానికి కావల్సింది. మరికొద్ది రోజుల్లో తప్పకుండా చంద ‘మేనమామ’ను ప్రేమతో భారతీయుడు ముద్దు ఇచ్చి వాటేసు కుంటాడు. మేరా భారత్‌ మహాన్‌. జైహింద్‌.

ఃూచీ:

ఆమె ఉద్వేగం వెనుక..:

? కేసీఆర్‌ లో మానవీకోణం

? అందరికీ పంచేది ఎప్పుడు..?

కొన్ని తర్కానికి అందవు ప్రొటోకాల్స్‌, అధికారిక మర్యాదలు, గౌరవాలు అనే చట్రంలో ఇమడవు. అవి ఎమోషనల్‌? గవర్నర్‌ నరసింహన్కు కేసీయార్‌ వీడ్కోలు సమయంలో నరసింహన్‌ కాదు, ఆయన భార్య కూడా భావోద్వేగాలకు గురైంది. చాలాసేపు కేసీయార్‌ చేతులు పట్టుకుని, ఉద్వేగంతో ఏవిూ మాట రాకుండా ఉండిపోయింది. నిజానికి ఆమె భర్త చాటు భార్య, కాదు? కాదు? భర్త వెంట భార్య? అనేక కార్యక్రమాలకు ఆయనతోపాటు వెళ్లేది. ప్రత్యేకించి గుళ్ల దర్శనాల్లో ఆ దంపతులు కలిసే వేళ్లేవాళ్లు. ¬ళీ వంటి సందర్భాల్లో ఇద్దరూ కలిసి నాయకులు, అధికారులు, రాజభవన్‌ సిబ్బందితో ఆనందాన్ని పంచుకునేవాళ్లు. రాష్ట్ర విభజనవేళ గవర్నర్గా పంపబడిన ఓ ఐపీఎస్‌ కేడర్‌ అధికారిపై కేసీయార్‌ కు మొదట్లో ఎక్కడో అపనమ్మకం. అసలే కాంగ్రెస్‌ ను నమ్మలేం. కాంగ్రెస్‌ ను ప్రభావితం చేసే కోటరీని అస్సలు నమ్మలేం. పైగా విభజన చట్టంలో సెక్షన్‌ 8 అనే కత్తి తెలంగాణ తొలి ప్రభుత్వంపై వేలాడే ఓ పదునైన కత్తి. ఆ స్థితిలో గవర్నర్తో ‘మంచి సంబంధాలు’ అనేది కేసీయార్‌ అవసరమే కావచ్చు. కానీ తను ఆ పరిధులు దాటేసి, నరసింహన్‌ తో ఓ ఆత్మీయ బంధాన్ని ఏర్పరుచుకున్నాడు.

కృత్రిమ వీడ్కోలు కాదు..:

నిజానికి ఓ గవర్నర్‌ వెళ్లిపోతున్నాడు. ఒక సీఎం వీడ్కోలు పలికాడు. అంతేనా..? ఆ రొటీన్‌, ఆ సెరిమోనియల్‌, ఆ మర్యాద మాత్రమే కనిపించడం లేదు. గవర్నర్‌ సతీమణి భావోద్వేగానికి ఎందుకు గురైంది..? అందుకే చెప్పింది కొన్ని తర్కానికి అతీతం అని..! నిజానికి తన ప్రసంగంలో గవర్నరే చెప్పాడు? తనతో కేసీయార్కు ఓ ‘సాన్నిహిత్య సంబంధం’ ఎందుకు కుదిరిందో.!

అండగా ఉండాల్సిన సమయంలో..:

మనిషికి ఓ అండ ఎప్పుడు కావాలి..? విషాదం చుట్టుముట్టినప్పుడు కావాలి. సుఖంలో ఎవడైనా వచ్చి కలుస్తాడు. దుఖంలో ‘వెన్నుతట్టి ధైర్యం చెప్పి, అన్నీ విూద వేసుకుని, నేనున్నాను’ అనే ఓదార్పు ఇచ్చే ఓ మనిషి కావాలి. కేసీయార్‌ అంతే? తనకు కోపమొచ్చినా ఎక్స్ట్రీమ్‌, ప్రేమ కలిగినా ఎక్స్ట్రీమే? గవర్నర్‌ అమ్మ చనిపోయినప్పుడు?. కేసీయార్‌ 15 నిమిషాల్లో తన దగ్గరకు వెళ్లాడు. అన్నీ నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పాడు. అస్థికలు కలపటానికి హెలికాప్టర్‌ పంపించాడు. గుళ్ల వద్ద ఏర్పాట్లు చూపాడు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఆ కుటుంబసభ్యుడిగా పనులన్నీ తన భుజాన వేసుకున్నాడు. బహుశా ‘గవర్నర్‌ అమ్మ చనిపోతే ఈ సిస్టం తన కోసం పనిచేయదా..? తనకేం తక్కువ’ అనే డౌటనుమానం రావొచ్చు. కానీ ఆ సమయంలో అన్నీ తానై వ్యవహరించే ఓ భుజం గొప్పది? కేసీయార్‌ చేసిందీ అదే? ఓ ప్రభుత్వాధినేతగానే కాదు, ఇన్నేళ్లూ తనకు ఏ చిక్కులూ కలిగించకుండా వ్యవహరించిన గవర్నర్‌ పట్ల కతృజ్ఞతాభావమే కావచ్చు? కానీ ఇట్‌ కౌంట్స్‌?

అందుకే ఆమెలో ఉద్విగ్నం:

ఇందులో నిజానికి చెప్పుకోవటానికి ఏముందీ అనిపిస్తుంది పైపైన చదివితే..! కానీ అలాంటి సందర్భాల్లో ఒక వ్యక్తి తమ వెంట ఎలా నిలిచాడు అనేది శోకగ్రస్తుల మెదళ్లలో అలా నిలిచిపోతుంది? సరిగ్గా అదే విమలా నరసింహన్‌ ఉద్వేగానికి కారణం? అందుకే, అన్నా, ఇక వెళ్లొస్తాం అన్నది? చేతులు పట్టుకుని, ఇంకెలా థాంక్స్‌ చెప్పగలను బ్రదర్‌ అన్నట్టుగా అలా కాసేపు మాటల్లేక నిలిచిపోయింది. కొన్ని రొటీన్‌ వార్తల ప్రమాణాల్లో, లెక్కల్లో ఇమడవు. ఇమడలేవు. ఈ కథనం కూడా అంతే? అర్థం చేసుకోగలిగిన వారికి చేసుకున్నంత? అంతే..!!

ముఖ్యమంత్రికి చిక్కు ప్రశ్న:

తనలో ఆ మానవీకోణం ఉందని చెప్పే కేసీయార్‌ పిల్లల ఆత్మహత్యలు, డెంగీ మరణాలు, ప్రమాదాల మృతులు, రైతుల కష్టాలపై ఇదే మానవత్వాన్ని ఎందుకు ప్రదర్శించడు?? తనకు ఈ కిరీటం పెట్టిన తెలంగాణ సమాజంపై ఈ ప్రేమ ఎందుకు కనిపించదు..? తనలోని ‘హ్యుమానిటీ ఆంగిల్‌’ ఎందుకు ఆవిష్కరిపంబడదు..? ఇది ఓ చిక్కు ప్రశ్న? కేసీయార్‌ ఎవరికీ అర్థం కాడు అనేది మాత్రమే దీనికి జవాబు..!. కానీ.. మారాలి అదే ప్రేమ ఆందరికీ అందించాలి.

చివరిగా..:

విమర్శించటం అంటే వ్యతిరేకించడం కాదు.లోపాలను సవరించుకోవాలని సుత్తిమెత్తగా సృశిస్తూ చెప్పటమే పాత్రికేయ విధి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close