Thursday, October 24, 2024
spot_img

Aaj ki bath

ఆజ్ కి బాత్

సర్కార్‌ సంక్షేమ పథకం కోసంసాహో అనని ..రాజకీయ నాయకుడు ఇచ్చేచిల్లర పైకం కోసం చిందులు వేయని..నేతల ఇంటి ముందు కాపల కాయని..నోటుకి అమ్ముడు పోయిఓటు వేయని…కమిషన్‌ ల కోసం కక్కుర్తి పడని..అమ్ముడు పోని.. ఆశలేని ఓటర్లు ఎందరు..?దుర్భిణి పెట్టి వెతికినా కనిపిస్తారా..?కష్టమే సుమా..- సుమన్‌ గౌడ్‌

ఆజ్ కి బాత్

జమీలి ఎన్నికలతో ఎవరికి లాభం…బీజీపీ వ్యూహం ఏమిటి..?అర్థమయ్యేలా జనాలకు చెప్పాలి కదా..చంద్రునిపై అడుగెట్టాం..సూర్యుని వైపు దృష్టి పెట్టాం..టెక్నాలజీ పెరుగుతోంది ..రాజకీయ వ్యూహాలు మాత్రం ప్రజలను రాచి రంపాన పెడుతూనే వున్నాయి…మీరెలాగైనా చావండి..మీకు ఓటేస్తున్న మమ్మల్ని బ్రతక నివ్వండి…ఒకరు దేశాన్ని ఉద్దరిస్తా అంటాడు…ఒకామె తెలంగాణను రక్షించాలని అంటుంది…మీరెన్ని చెప్పినా అవి గప్పాలే అని ప్రజలు గమనిస్తున్నారు...

ఆజ్ కి బాత్

ఒకప్పుడు మంచిగా చదువుకున్న డాక్టరో,లాయరో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేసేవాళ్లు..ఈ రోజుల్లో రాజకీయాల్లోకి రావాలంటే,కావాల్సిన క్వాలిఫికేషన్ ఎమ్మెల్యేకైతే 100 కోట్లు..కార్పొరేటర్ కైతే ఐదు కోట్లు..అభ్యర్థి ఎలా ఉన్నా, ఎవరైనా పర్వాలేదు..ఇదే నేటి రాజకీయాల్లో నడుస్తున్న ట్రెండ్..డబ్బుంటే అభ్యర్థి ఏది మాట్లాడినా కరెక్టే, ఏది చేసినా కరెక్టే..పది ఖర్చు పెట్టు 100 పట్టు,కార్పొరేట్ స్టైల్ కు...

ఆజ్ కి బాత్

బీసీలు విద్యా, ఉద్యోగ, చట్ట సభల్లో..ఆర్థిక రంగంలో తమ న్యాయమైనవాటా పొందినప్పుడే‘బీ.పీ. మండల్‌’ కి మనమిచ్చేసరైన నివాళి..తను నమ్మిన విలువల కోసంమాత్రమే జీవించిన ఆ మహనీయుడిత్యాగాలను గుర్తుకు తెచ్చుకోండి..బానిసలుగా కాదు రారాజులుగాబ్రతకండి.. మీ సత్తా చాటండి..అత్యధిక శాతం ఉన్నమీరుకీలెరిగి వాత పెట్టండి.. బీపీ మండల్‌మహాశయుడి ఆశలనుసజీవంగా ఉంచండి..

ఆజ్ కి బాత్

జర్నలిస్ట్ మిత్రులారా ఇప్పటికైనాకళ్ళు తెరవండి.. కేసీఆర్ మనసులోదాగిఉన్న కుళ్ళును గ్రహించండి..మిమ్మల్ని విషసర్పాలతో పోల్చినదురహంకారాన్ని తరిమికొట్టండి..కుయుక్తులపై మీ మీ కలాలుసాధించండి.. మీరు బానిసలు కాదు..జ్వలించే అక్షర యోధులని తెలుసుకోండి..సమాజంకోసం పరితపించే మహోన్నతులనితెలియజెప్పండి..కేసీఆర్ పొసే పాలు కాదు..పరిపాలనలో లోపాలను ప్రజలకు తెలియజెప్పండి..కలం బలం చూపించండి.. మీరేంటో తెలియజెప్పండి.

ఆజ్ కి బాత్

అమాయక ప్రజలను దోచుకోవడానికిఅవకాశం మాకియండి.. మాకియండి..అంటూ ఈ రాజకీయ రక్కసులువిచ్చలవిడిగా రెచ్చిపోతుంటే..ఓ చదువుకున్న అజ్ఞానులారా..మెడడు నిండా జ్ఞానం ఉండి..ముందుచూపు మరుస్తున్నమేదావుల్లారా.. ఎందుకీ ఈ మౌనం?ఇంకా అలాగే చూస్తూనే వుండండి..రేపటి రోజు మనమేసుకునే గుడ్డలమీద కూడా రాజకీయం చేస్తారు..లే నిద్రలే.. ఉద్యమించి రాజ్యం తెచ్చుకున్ననువ్వేనా ఇదంతా చూస్తూ ఊరుకుంటున్నది..? ముస్త్యాల పరుశురాం…

ఆజ్ కి బాత్

మహిళలకు ఆత్మగౌరవం లేదు..రైతులకు భరోసా లేదు..విద్యార్థులకు భవితవ్యం లేదు..ఉద్యోగస్తులకు నమ్మకం లేదు..కార్మికులకు ఉపాధి లేదు..కానీ.. కేసీఆర్‌ ఆత్మగౌరవం కోసంబలవ్వడానికి తెలంగాణ ఉంది..రాష్ట్ర ప్రజానీకం ఉందిఆత్మగౌరవానికి అర్ధం మార్చినఅధికార పార్టీ నేతలారా…మీకు జోహార్లు..మీ పాలనకు వేనవేల నమస్కారాలు…- నవత..

ఆజ్ కి బాత్

ఓట్ల కోసం నోట్లు కుమ్మరిస్తారు..ఓటు వేసిన వాళ్ళను విస్మరిస్తారు..ఎన్నికలకు ముందు ఓటరుకు వున్న విలువఎన్నికల తరువాత మాయమవుతుంది..నమ్మిన నాయకుడు తమనిఆదుకోవడం లేదని బాధపడతారు..కానీ మీరు అమ్మిన ఓటుమిమ్మల్ని దహిస్తోందని తెలుసుకోలేరు..అదే మీరు చేస్తున్న తప్పు..ఇప్పటికైనా గ్రహించండి..

ఆజ్ కి బాత్

అమ్మగా, అక్కగా, ఆలిగా..పుట్టినప్పుటి నుంచి గిట్టేవరకూజీవితాంతం ఓ ఆడది కావాలి.కోరికొచ్చినా.. కోపమొచ్చినా..ప్రేమొచ్చినా.. ద్వేశమొచ్చినా..మన ఇంట్లో తప్ప.. ఏ ఇంట్లో ఆడది కనిపించినా.. తప్పుడు దృష్టితోనే చూస్తం.. వారికి ఆపద వస్తే.. కళ్లారా చూస్తూ సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తామే తప్ప.. చింతించడానికి, కాపాడటానికి మనసు కూడా రాదు.ఛీ ఛీ ఇదేం సమాజం..?` నవత

ఆజ్ కి బాత్

మన దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసంహింసో, అహింసో, తిరుగుబాటో..ఆ పోరాటాల్లో ఆగిపోయిన ఊపిరులెన్నో..ఉరితాళ్ళను ముద్దాడిన ప్రాణాలెన్నో..కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, ఆస్తులు,సుఖాలు వదులుకున్న నిస్వార్థ త్యాగాలువెలకట్ట లేనివి.. వాటి ముందు మీరెంత! మీరెక్కడ?ప్రజాసేవని వచ్చి స్వార్థ దోపిడికి మరిగి..బాధ్యత బరువు అనుకుంటే?ప్రజల సంగతి మనకెందుకనుకుంటే?పాలకులారా.. ఎన్నికలు వస్తున్నాయిమళ్ళీ సేవకులవుతారో!సెలవు తీసుకుంటారో మీ ఇష్టం.. మేదాజీ
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -