Wednesday, October 23, 2024
spot_img

Aaj ki bath

ఆజ్ కి బాత్

ముదిరాజులంతా మర్లపడితే..గౌడన్నలంతా గొడవకు దిగితే..యాదవులంతా ఎగసి పడితే..చాకల్లన్నలు చేయి ఎత్తితే..మంగళన్నలు మార్పు కోరుకుంటే..తెలగోళ్లంతా తెగువజూపితే..మాదిగ, మాలన్నలు ముందుకొస్తే..లంబాడిలు లాడాయి షురూ జెస్తే..ఆదివాసీలు ఆయుధాలై ఎక్కుబెడితే..పెఱిక అన్నలు పేరుకపోతే..ఎవడ్రా మమ్మల్ని ఆపే మొనగాడు..దొరా నీకు చిప్పకూడే ఇక దిక్కు..

ఆజ్ కి బాత్

ఓ రాజకీయనాయకుల్లారా ఓట్ల పండుగొస్తేనేమా ఇండ్లజాడలు గుర్తొస్తయి కదా..మా ఇంటి గాడుపాడులో కూసోనే మూల్గుతున్నముసలవ్వనైన ముద్దాడిపోతిరి కదావగలమారి ప్రేమనొలకబోసి..గెలిచినక్క ఎన్నిసార్లు మీ కొంపలకు వచ్చిపోయామోఒక్కసారైన మీ ఇంటిగడపలను అడిగితివారా…ఇప్పుడున్న ఇగిలిచ్చే మాటలుగెలిచినక్క కూడా ఉండాలే.నాయకుడికీ ఒక్కటేకాదురా నక్కజిత్తులుమా సబ్బండ జాతులు తెలివర్లు అయ్యినారుఇకనైనా తెలుసుకోరా జెరబుర్రబెట్టి. కనకమామిడి సన్నీ

ఆజ్ కి బాత్

బ్రతుకులు మారుతాయని..బజార్లకు వచ్చి పోరాడితిమి1200ల మంది అమరుల త్యాగాలతోధనిక రాష్ట్రం సంపాదించుకుంటిమిఉంటామో, పోతామో తెలియకుండాఉమ్మడి రాష్ట్రంలో ప్రాణాలను,ఉద్యోగాలను పణంగా పెట్టి బాంఛన్‌బ్రతుకులు మాకొద్దు..మా రాష్ట్రం మాకే అని నినాదించి..లాఠీ దెబ్బలతో వీపులు విమానాలు చేసుకుంటిమికానీ నాటి రోజులే నయ్యం కదా దొరనీ బంగారు, ఇత్తడి పరిపాలన కంటే..ఉన్నది లేనిది చెప్పి ఊరిస్తూ..నాలుగున్నర కోట్ల ప్రజల...

ఆజ్ కి బాత్

మన దేశంలోనూ.. రాష్ట్రాల్లోనూ..అప్పులు పెరుగుతున్నయి..ప్రభుత్వ ఆస్తులు అప్పనంగా అమ్ముతాండ్లు..దేశం సుసంపన్నమే ప్రజలే నిరుపేదలు..దేశ సంపద గుప్పెడు మంది జేబుల్లో..ఆర్థిక, రాజకీయ, సామాజికఅసమానతల అగాధం పెరిగిపోతోంది..ఈ వివక్ష ఇంకెన్నాళ్లు?ఎన్నికల వేళ అన్నిరంగాల్లోసమానత సాధించేమ్యానిఫెస్టోలతో రావాలి..తాయిలాలతో తలరాతలు మారవు!పేదల తలసరి ఆదాయం పెంచాలి..సమానత్వ సాధనకు ప్రజలు ప్రశ్నించాలి?ప్రశ్నించడం రాజ్యాంగంప్రజలకు కల్పించిన హక్కు..- మేదాజీ..

ఆజ్ కి బాత్

కేసీఆర్‌కు ఆరు వందల వాహనాలతోకాన్వాయ్‌.. అస్వస్థతకు గురైన బాలికలనుఅంబులెన్స్‌ లేక లారీలో ఆసుపత్రికి తరలింపు…నాగర్‌ కర్నూల్‌, మన్ననూర్‌ బాలికల హాస్టల్‌లోఫుడ్‌ పాయిజనింగ్‌.. నలుగురి పరిస్థితివిషమం.. స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ దాక్కున్నాడు..పరిస్థితిని సమీక్షించాలనే సోయి లేదా..?ఓహో వారికి ఓట్లు లేవనేగా ఈ నిర్లక్ష్యం..మీ దుంపలు తెగ.. ఫుడ్‌ పాయిజనింగ్‌హాస్టల్లోనే జరుగుతాయెందుకు.. ? ఒక్కసారిమీరొచ్చి తినండి.. మిమ్మల్ని...

ఆజ్ కి బాత్

సమ్మెల తెలంగాణ సావు కోరే తెలంగాణ..పసి పిల్లల ఆలనా పాలనా చూసుకునేఅంగన్వాడీల గోస.. అడగనివి అన్నీ అమలుచేయడం.. అవసరమైనవి అటకెక్కించడం..సమ్మె బాటపట్టి ప్రాణ త్యాగంచేయాల్సిందేనా..? కోట్లు పెట్టి గుళ్లు గోపురాలుకట్టడమేనా సంక్షేమ తెలంగాణ..? 5వేలబడులు మూసి 5వేల బార్లు తెరవడమేనా బంగారుతెలంగాణ..? బాధలు తీర్చే బంగారుతెలంగాణ కావాలి సారూ.. బాధలు పెట్టి ప్రాణంతీసే తెలంగాణ...

ఆజ్ కి బాత్

నువ్వు సమాజ మార్పు కోసంఅడుగు బయట పెట్టినప్పుడు..మొదట నిన్ను చూసి నవ్వుతారు..తర్వాత నిన్ను చూసి సవాల్‌ చేస్తారు..ఆ తర్వాత నిన్ను మెచ్చుకుంటారు..గుర్తు పెట్టుకోండి.. మీరు సమాజాన్నిమేల్కొలిపే పనిలో అనేక ఆటంకాలు,అపహాస్యలు, అవరోధాలు, కేసులు,నిర్బంధాలు వస్తున్నాయి అంటే మీరుప్రజలకు దగ్గర అవుతున్నారు..విజయానికి చేరువలో ఉన్నట్టే….నీ పై నువ్వు నమ్మకాన్ని విడువకు,ఆత్మస్థైర్యంతో కృషి చేస్తే…విజయతీరాలను ముద్దాడుతావు..జనం జేజేలు...

ఆజ్ కి బాత్

అనాగరికతను నాగరికతగా కల్లిబొల్లి కథలల్లి..మత ప్రచారకులను మేధావులుగా కీర్తిస్తూ..మూఢనమ్మకాలను పాడుశకునాలనుపాటించమంటూ అశాస్త్రీయ వాదాలకు గోడకాడుతున్నారు..విజ్ఞాన భావాలను బొందలగడ్డలో సమాధిచేసిమతాల మలినాలను పుస్తకాలలో అచ్చేసి..రేపటి తరాలపై బురదజల్లుతున్నారు..బాబాలను, పాస్టర్లను, పూజర్లను నమ్ముతూ..సన్యాసులకు రాజపీఠాల పట్టంకడుతున్నారు..రాతియుగ కాలపు ఆలోచనలకు గోతులుతవ్వుతున్నారు…ఇక నా దేశం వెనక్కి వెళ్లక ముందుకెట్లా నడుస్తుంది..? సన్నీ

ఆజ్ కి బాత్

కళంలో సిరా ఇంకిపోయిందా?జరుగుతున్న అన్యాయాలపై పోరు సల్పేవారేరి..?యువతలో దిక్కారదొరణి ఏమాయే!జవసత్వాలు ఉడిగిపోయాయా..?చేతగాని తనంతో అణగారిపోయారా?రాయితీలు అందుకున్నారా?మాకేమని ఊరుకుంటున్నారా?ఓటుకు నోటు ఇస్తే చాలనుకుంటున్నరా?తల్లిలాంటి ఓటును అమ్ముకుంటున్నారా? పోరండ్ల సుధాకర్‌

ఆజ్ కి బాత్

పరేడ్ గ్రౌండ్ కాకపోతే మరోచోట..ఇందులో మునిగిపోయేదేముంది..?పొలిటికల్ మైలేజీ కోసం తప్ప..ప్రజలకు ఒరిగేదేముంది..?ఇరు జాతీయ పార్టీల వ్యవహారం సిల్లీగాఅనిపించడం లేదూ..?ఓ పక్క ఇండియా పేరును రూపుమాపే కుట్ర..మరో వైపు ప్రత్యేక పార్లమెంట్ సెసెన్స్..ఏమిటీ న్యూసెన్స్..?మీ ప్రాపకాండల కోసం మమ్మల్ని ఎందుకుపిచ్చోళ్లను చేస్తున్నారు..?ప్రజాగ్రహం పెల్లుభికితే మీ చిరునామాలుచిరిగిపోవడం ఖాయం.. బీవీఆర్ రావు..
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -