Friday, October 25, 2024
spot_img

Aadab Hyderabad

ఆజ్ కి బాత్..

సూడు సూడరో మన తెలంగాణబంగారు తెలంగాణ అయిందంట..రైతుల సావులు లేవంట…సర్పంచ్ ల సావులు లేవంట..నిరుద్యోగుల సావులు లేవంట..ఉద్యోగుల భాదలు లేవంట..మన ముఖ్యమంత్రి కుటుంబంగదే బై బంగారు కుటుంబం..పదే పదే చెప్తున్న పుకట్ మాటలంట…ఈ సారి ప్రజలు మాత్రం ఇనరంట..తెలంగాణల మార్పు సాధ్యం అంట..ఇది ప్రజలంతా అనుకుంటున్న మాట.. నరేష్ యాదవ్..

ఆజ్ కి బాత్..

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నఇంకా రాజ్యాధికారం అగ్రవర్ణాల వారి చేతుల్లోనేతిరుగుతున్నది. 55 శాతం మెజార్టీ ప్రజలైనబిసిలు బిచ్చగాళ్లు కాదు.ఓట్లు వేసే యంత్రాలు కాదు..పల్లకీలు మోసే బోయిలు కాదు..జిందాబాద్ లు కొట్టే కార్యకర్తలు కాదు..రాజకీయ బానిసలు కాదు..రాజ్యాధికారంలో భాగస్వాములు బిసిలు..ఓ బీసీ మేలుకో నీ రాజ్యాన్ని నువ్వే ఎలుకో.. కోట్ల వాసుదేవ్..

ఆజ్ కి బాత్..

జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికిఏమున్నాయని ఎవరైనా ప్రశ్నిస్తే..నేను నమ్మిన వాళ్ళు నన్నునిట్ట నిలువునా ముంచి మోసం చేసినా..నన్ను నమ్ముకున్న వాళ్ళను నేనెప్పుడూమోసం చేయలేదని గర్వంగా చెప్పుకోగలగాలి..అదే నిజమైన వ్యక్తిత్వం అంటే..కానీ బ్రదరూ.. ఈనాటి మేటిరాజకీయ నాయకులు..వారూ వీరూ అని లేకుండా అందరినీమోసం చేస్తున్నారు.. వీరేమని గర్వంగాచెప్పుకుంటారు..? అసలు వీరికి ఆత్మగౌరవంఅనేది ఉంటే కదా చెప్పుకోవడానికి..సిగ్గూ ఎగ్గూ...

ఆజ్ కి బాత్..

ఈ ఆకస్మిక మరణాలకు మూలం ఏంటి..?కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి..ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడాలి..?ఈ వైపరీత్యాన్ని ప్రభుత్వాలుపట్టించుకోవడంలేదు..అసలీ ఈ ఆకస్మిక మరణాలకుమూలాన్ని కనుక్కోండి..మరిన్ని మరణాలు జరగకుండారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలుతీసుకోవాలి మహాప్రభో.. వత్తుల భాస్కర్..

ఆజ్ కి బాత్..

ఐదేళ్లు గడిస్తేగాని జనాలుగుర్తురాని ఆధునిక గజినీలు..ఆచరణకు వీలుకాని హామీలనోములు నోచే హేమాహేమీలు..చెవుల్లో పూలమొక్కల విత్తులనుమొలిపించే ప్రభుద్దులు..పెదాలమీదే పిండివంటలు వండేనవయుగ నలభీములు..రేవు దాటేసాక తెప్ప తగలేసేమహామహులు.. ఎన్నాళ్ళో కృత్రిమ శ్వాసతోమూలిగిన నల్లధనం..ఇన్నాళ్ళకి స్వేచ్చావాయువు పీల్చుకునేచక్కని తరుణం.. అల్లి ప్రవీణ్

ఆజ్ కి బాత్..

వస్తున్నాయి వస్తున్నాయి ఎన్నికలు..తెస్తున్నాయి ఎన్నో సౌకర్యాలు..ఇస్తున్నారు చాలా వాగ్దానాలు..గెలవడానికి చేస్తున్నారు ఎన్నో ప్రయత్నాలు..నమ్మకం పెట్టుకుంటారు ఎంతో మంది ప్రజలు..గెలిచాక పట్టించుకోరు ఏ రాజకీయ నాయకులు..మా వీధికి లేవు మంచినీటి సరఫరాలు..మా ఇంటి పక్కన ఉన్నాయి డ్రైనేజీలు..అది ఎప్పుడు అవుతుందో తెలియదు లీకేజీలు..ప్రజలందరూ పడతారు చాలా కష్టాలు..ఇవే మా సామాన్యుల బ్రతుకులు.. ప్రవీణ్ అల్లి..

ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ బదిలీ..

ఆదాబ్ ఎఫెక్ట్… తెలంగాణ ఉన్నత విద్యాశాఖ కమీషనర్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల దుమారం.. నవీన్ మిట్టల్ పై హైకోర్టు లో వందలాది కేసులు వేసిన బాధిత ఉద్యోగులు హైకోర్టులో 33 కోర్టు ధిక్కరణ కేసులు నమోదైన విషయాన్ని బయట పెట్టిన "ఆదాబ్" స్పందించిన ప్రభుత్వం.. నవీన్ మిట్టల్ ను తప్పించి,. వాకాటి కరుణ నియామకం నవీన్ మిట్టల్ బదిలీపై బాధిత ఉద్యోగుల...

ఆజ్ కి బాత్..

అట్లుంటది మరి..ఎకరానికి 5వేల రూపాయలరైతుబంధు ఇచ్చిరుణ మాఫీ ఎగ్గొట్టాడు..ఉచిత ఎరువులు ఎగ్గొట్టాడు..పంట నష్ట పరిహారం ఎగ్గొట్టాడు..పంటల మద్దతు ధర ఎగ్గొట్టాడు..సబ్సిడీలు ఎగ్గొట్టాడు..అయినా కూడా రైతులు కేసీఆర్ప్రభుత్వాన్నే కోరుకునేలా చేస్తాడు…అట్లుంటది మరి మన దొరతోని.. అరుణ్ రెడ్డి పన్నాల

ఆజ్ కి బాత్..

ప్రకృతి ప్రేమతో పురుడుపోసుకుని..శ్రమ జీవుల చెమట చుక్కలతోపుట్టిన సాహిత్యం..అణచబడిన హక్కుల కోసం అరచిన కవిత్వంఎప్పుడూ దొరలకు దండం బెట్టదు..కప్పే శాలువాకి సహో అనదు సాహిత్యం..ప్రశంస పత్రం కోసం పాకులాడదు పాట..జ్ఞానం ఇచ్చే జ్ఞాపిక కోసం.. గడిలో బంది అవదు..చింత చెట్టంత అక్షరానికి చిగురంత శాలువాకంటికి కనబడదు.. ఆలోచన అక్షరంఆకలితో అరుస్తున్న ఆవేదనల వైపే.. ...

ఆజ్ కి బాత్..

నా తెలంగాణ కోటి రతనాల వీణనే..కాని ఇప్పుడు నాలుగు లక్షల కోట్ల అప్పులో ఉంది..నా తెలంగాణ స్వఛ్చమైనదే కాని ఇప్పుడుకచరా పాలనలో కల్తీ అయింది..నా తెలంగాణ ప్రజలు ప్రస్తుతంబానిసత్వంలో ఉన్నరు…కానీ, కలియుగ కల్తీ పాలన అంతం అయ్యే రోజులుబహు దగ్గరలోనే ఉన్నవి.పైస మదంతో పదవి అహంకారంతోప్రజల రక్తాన్ని రాక్షసునిలాగా త్రాగుతున్నరాజకీయ ముష్కరులారా మారండి.. నరేష్ యాదవ్..
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -