మిస్టరీలతో సహజీవనం నోస్ట్రాడామస్‌ కాలజ్ఞానం-2

0
  • విద్వేషాల గురించి
  • ఊహజనితాలకే తావు
  • జనన, మరణాల మిస్టరీ
  • భయపడే మనస్తత్వం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

భవిష్యత్‌ ఎలా ఉంటుందనేది ఎవరికైనా ఆసక్తికరమైన విషయమే. అది సహజసిద్ధంగా లభించే విషయమూ కాదు. వరంగా లభించే అవకాశమూ లేదు. మరి సాంకేతిక ప్రపంచంలో ఒకరిద్దరికి మాత్రమే లభించిన అపూర్వమైన, అరుదైన, అధ్భుతమైన సంఘటన. మన దేశంలో ‘కాలజ్ఞానం’ ‘భవిష్యత్‌ వాణి’ గురించి పురాణ, ఇతిహాసాలలో చెప్పబడింది. యుగాలు మారాయి కాబట్టి ప్రతి విషయానికి, నమ్మకాలకు, భక్తి భావాలకు సైన్స్‌ పేరుతో ఆధారాలు వెతకడం మొదలైంది. ఈ సమయంలో అనగా 15వ శతాబ్దంలో ఫ్రాన్స్‌ లో నోస్ట్రాడామస్‌ పలు అంశాలను తెరపైకి తెచ్చారు. అయితే అవి మన శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారిలా నేరుగా కాకుండా పొడుపు కథలలాగా డొంక తిరుగుడుగా ఉండటంతో నోస్ట్రాడామస్‌ జీవితంలో ఆయన నిజం చెప్పినా నమ్మే అవకాశం లేకుండా పోయింది.

జనన, మరణాల మిస్టరీ: అందరి భవిష్యత్తు చెప్పగలిగే నోస్ట్రాడామస్‌ జనన, మరణ తేదీలపై సరైన సమాచారం లేదు. మిస్సెల్‌.డి.నోస్ట్రేడెమ్‌ 1503, డిసెంబరు 14, లేదా 21న ఆయన జన్మించారు. 1566 జులై1 లేదా 2న మరణించినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. నోస్ట్రాడామస్‌ యూదు కుటుంబం నోస్ట్రాడామస్‌ జన్మించడానికి ముందు ఆయన తల్లిదండ్రులు కాథలిక్కులుగా మారారు. అతను యూనివర్శిటీ ఆఫ్‌ ఆవిగ్నాన్‌ లో చదువుకున్నాడు. ప్లేగు వ్యాధి సంభవించిన కారణంగా ఈ విశ్వవిద్యాలయం ఒక సంవత్సరంలో మూతబడింది. 1531 లో తొలి వివాహం చేసుకున్నాడు. కానీ అతని భార్య, ఇద్దరు పిల్లలు 1534లో ప్లేగు వ్యాధితో మరణించారు. అప్పటికి నోస్ట్రాడామస్‌ ఓ సామాన్య వ్యక్తి. 1550లో ఒక జాతకాలకు సంబంధించిన ‘అల్మానాక్‌’ అనే పుస్తకాన్ని ఆయన రాశాడు. ఇది ప్రజాదరణ పొందింది. దీంతో సంపన్నులకు ఆయన జ్యోతిష్కుడిగా పనిచేశారు. ఇదే పునాదిగా భవిష్యత్‌ సంవత్సరాలు వాటిని రాయడం కొనసాగించాడు. కేథరీన్‌ డి ‘మెడిసి అతని మొట్టమొదటి మద్దతుదారులలో ఒకరు అయ్యాడు. 1555లో ప్రచురించబడిన అతని ‘లెస్‌ ప్రొఫెటియస్‌’ చారిత్రక, సాహిత్య ఆయన అభిప్రాయాలు వెల్లడించారు.ప్రారంభంలో మిశ్రమ స్పందన పొందింది. చివరికి అతని జీవితం చివరలో తీవ్ర కీళ్లవాతంతో బాధపడ్డాడు. ఈ కారణంతోనే 2 జూలై 1566న మరణించాడు. అయితే అందరి జాతకాలు చెప్పిన నోస్ట్రాడామస్‌ తన భార్య, పిల్లల విషయంలోనూ, తన విషయంలోనూ క్లారిటీగా లేక పోవడం గమనార్హం. ఇదే శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ప్రతి విషయంలో స్పష్టతతో చెప్పారు.

ఎన్నో అనుమానాలు: నోస్ట్రాడామస్‌ రాసిన ‘లెస్‌ ప్రొఫెటియస్‌’ ప్రచురించబడిన కొన్ని సంవత్సరాలపాటు చాలామందిని ఖట్టిపడేసింది. ఇందులో ప్రపంచంలో జరగనున్న విద్వేషాల గురించి చర్చ జరిగింది. అయితే ఉపమానాల రూపంలో అతని డొల్లతనం వెల్లడైంది. నోస్ట్రాడామస్‌ ఏ వాస్తవమైన, మానవాతీత భవిష్య సామర్ధ్యాలు కలిగి లేరని కొందరు గ్రహించారు.

విద్యావేత్తలు నోస్ట్రాడమస్‌ యొక్క అంచనాలు లక్షణాత్మకంగా అస్పష్టంగా ఉన్నాయని వాదించారు.

చిలువలు.. పలువలు: తన నాలుగవ శతాబ్దం యొక్క ఫ్రెంచ్‌ రచయితలు తయారు చేసిన వ్రాతప్రతులపై ఆధారపడిన కొందరు నోస్ట్రాడామస్‌ గురించి గొప్పలు చెప్పటం ప్రారంభించారు. నోస్ట్రాడామస్‌ ఫ్రాన్స్‌ కథనాలను ఆంగ్ల అనువాదాలు తక్కువ నాణ్యత కలిగి ఉన్నాయి. అయితే ఉద్దేశపూర్వకంగా తప్పుగా అనువదించబడిందనే వాదనలున్నాయి.

942 సంఘటనలు: స్వతహాగా భయస్తుడైన నోస్ట్రాడామస్‌ ఫ్రెంచ్‌ జ్యోతిష్కుడు, వైద్యుడు. అతను రచించిన పుస్తకం ‘లెస్‌ ప్రొఫెటియస్‌’లో 942 భవిష్యత్‌ సంఘటనలన గురించి రాశారు. ఈ పుస్తకం మొట్టమొదటిసారిగా 1555లో ప్రచురించబడింది. అందులో కెనడీ హత్య, ‘హిరోషిమా-నాగసాకి’లపై బాంబుదాడులు,అమెరికన్‌ టవర్ల పేల్చివేత, 27 ఏళ్ళు బిన్‌ లాడెన్‌ వ్యవహారాల గురించి పరోక్షంగా చెప్పారు.

ఇవీ అబద్దాలు: మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని మాత్రమే చెప్పారు. కానీ అది ఎప్పుడు..? ఎందుకు..? వస్తుందో మాత్రం చెప్పలేదు. 2012 కల్లా ప్రపంచం అంతం అవుతుందని చెప్పాడు. ఈ అంశం హాలీవుడ్‌ లో ఏకంగా డజనుకు పైగా సినిమాలు తీయడానికి మాత్రమే పనికొచ్చింది.హిట్లర్‌ నియంత వల్ల యుద్ధం ముంచు కొస్తుందని తన పుస్తకంలో జోస్యం చెప్పాడు. అయితే హిట్లర్‌ మరణం గురించి ప్రస్థావన లేదు.

ఇదీ ఒక ప్రచారమే… : 2012లో ఏం జరగలేదు దాంతో 3097వ సంవత్సరంలో మహాప్రళయం తప్పదనీ, ఆ సమయంలో ఒక బలమైన శక్తి భూమిని ఢీకొని భూగ్రహం అంతమవుతుందని మరోసారి నోస్ట్రాడామస్‌ చెప్పాడు.

భూమి అంతం అవడానికి ముందు పలు పెను ఉపద్రవాలు సంభవిస్తాయని, మానవాళి తమకు తామే అంతం చేసుకునేందుకు ఆయుధాలను ఉపయోగించుకుంటుందని జోస్యం చెప్పాడు. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసి ప్రపంచంలోని దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు అణుబాంబులను వర్షించుకుంటారని చెప్పటం జరిగింది. అణుబాంబుల విస్పోటనం జరిగితే ఏ దేశం ఉండదు. అలాంటిది ఏదేశం మృత్యుమొఖం చూడదు. అందుకే నోస్ట్రాడామస్‌ ను నాటి క్రైస్తవులు ఓ 'దయ్యం'(సైతాను)గా వ్యవహరించేవారు.

దయనీయంగా చివరి రోజులు..: 1566 నాటికి నోస్ట్రాడామస్‌ ఆర్థిక, ఆరోగ్య స్థితిగతులు తారుమారయ్యాయి. కదల్లేని పరిస్థితిల్లో దయనీయంగా ఉన్నాడు. 1556, జూన్‌ చివరలో తన ఆస్తికి 3,444 కిరీటాలు (సుమారు 300,000 అమెరికా డాలర్లు), కొన్ని అప్పులు, తన రెండవ భార్యకు అనారోగ్యం, పెళ్ళికాని కుమార్తెలు ఉన్నారు. 1556, జూలై 1 సాయంత్రం, తన కార్యదర్శి జీన్‌.డి. చావిననితో ”సూర్యోదయ సమయంలో నన్ను సజీవంగా చూడలేరు” అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం అతని మంచంపై నుంచి నేల విూద పడి చనిపోయాడు. అనంతరం అక్కడే సమాధి చేశారు. ఫ్రెంచ్‌ విప్లవం అనంతరం

సాలన్లోని స్థానిక ఫ్రాన్సిస్కాన్‌ చాపెల్లో (ఇప్పుడు భాగం లా లా బ్రోచెరీలో చేర్చబడింది) కాల్గరీ సెయింట్‌-లారెంట్లో తిరిగి నోస్ట్రాడామస్‌ భౌతికకాయాన్ని ఖననం చేశారు. అక్కడ అతని సమాధి ఈనాటికీ ఉంది. జాతకాలు, భవిష్యవాణి చెప్పిన నోస్ట్రాడామస్‌ జీవితం యావత్తూ ఆయనకు తెలియకుండానే మిస్టరీగా నడిచింది. ఇవేవీ ఆయన గుర్తించకపోవడం కొసమెరుపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here