Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

స్వాములూ… రాజకీయ స్వారీ

? ఆర్థిక ఆద్యాత్మిక ‘పీఠాలు’

? దశాబ్దానికి ఒకరు

? పుట్టబాబాతో మొదలు

? కాళ్ళు పట్టుకునే దౌర్భాగ్యం

? ముందే చెప్పిన ఆదాబ్‌ హైదరాబాద్‌

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ప్రవచనాలు చెప్పాల్సిన ఆధ్యాత్మిక వేత్తలు.. అట్టహాస ఘీంకరాలతో రాజకీయ కదనరంగంలోకి కత్తులు దూసి మరీ దూకుతున్నారు. ఉత్తర భారతంలో రాజకీయ స్వావిూజీల ప్రాబల్యం అధికం. రాజకీయ నేతల, అధికార అండదండలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్నాయి. పుట్టపర్తిలో హత్యలు ఒకనాడు సంచలనం. తమిళనాడు హత్యకేసులో పీఠాధిపతుల అరెస్టులతో ఆధ్యాత్మిక ప్రపంచం ఒక కుదుపుకు లోనైంది. ఆద్యాత్మిక ముసుగులో ఉన్న స్వాములకు ‘పవర్‌’ పాలిటిక్స్‌ అంటే ఏమిటో బాగా వంటబట్టింది. కాళ్ళు పట్టుకునే వారు అవసరార్దం కటకటాలకు ఎలా పంపగలరో బాగా తెలిసింది. ముఖ్యమంత్రుల ‘శారదాపీఠం’లో చుంబనాలు, కౌగలింతలతో తెలుగు రాష్ట్రాలకు రాజకీయ స్వావిూజీలు లేని లోటు పూర్తిగా తీరింది. ఈ విషయాన్నీ చెప్పిన ఆదాబ్‌ హైదరాబాద్‌ సెప్టెంబర్‌11, 2018న చెప్పింది.

ఒకరిద్దరి అధికార పీఠాల కోసం ఈ పీఠాల తపస్సులా..?!:

అధికార పీఠాల కోసం ఆద్యాత్మిక పీఠాలు తపస్సు చేయడం ఏమిటి..? స్వాములంటే ఎవరు..? పీఠాలంటే ఏమిటి..? అసలు సన్యసించడం అంటే ఏమిటి..? విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి ప్రవర్తన హిందూ సమాజంలో ఈ ప్రశ్నలను రేకెత్తిస్తుంది. ఆ స్వరూపుడు ఎవరి స్వరూపుడు..? ఏ స్వరూపుడు..? ఆ ముఖ్యమంత్రులను కాసేపు వదిలేయండి. వాళ్లు పక్కా ఫుల్‌ టైం రాజకీయనాయకులు. నిన్న చిన జియ్యర్‌ స్వామిని నమ్మవచ్చు. ఈరోజు స్వరూపుడిని నమ్మవచ్చు. రేపు మరో స్వామి తెరపైకి రావచ్చు. వస్తాడు. అయన్నీ వాళ్ళు నమ్మ వచ్చు. అది వారి వ్యక్తిగతం. కానీ ఒక స్వామిగా ప్రకటించుకున్న వ్యక్తి రాజకీయ నాయకులకు ఈ ముద్దులివ్వడం ఏమిటి..? ఆలింగనాలేమిటి..? అసలు ఒక సామాన్యుడు దగ్గరకొస్తే కాళ్లు మొక్కటానికి కూడా తాకనివ్వని స్వామి… తనే ఈ చుంబనాలకు, కౌగిళ్లకు దిగడం ఏమిటి..? ముఖ్యమంత్రులు అసామాన్యులా..? పైగా ఒక ఆశ్రమంలో అంతర్గతంగా జరిపించుకోవాల్సిన ఓ పవిత్ర సన్యాసాశ్రమ దీక్షను, ఉత్తరాధికారి నియామకాన్ని ఓ రాష్ట్ర రాజధానిలో అట్టహాసంగా, ఆడంబరంగా నిర్వహించడం ఏ ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం..? పైగా ఒక ఉత్తరాధికారికి ఓ కిరీట ధారణ..? అదీ ముఖ్యమంత్రులు చేతుల విూదుగా? ఇదీ రాష్ట్రాలవ్యాప్తంగా ఆధ్యాత్మికతను నమ్మి, ప్రచారం చేసేవాళ్లలో బాగా చర్చనీయాంశం అయ్యింది. ఇలా ఏ ఆద్యాత్మిక పీఠంలో ఇంత వరకు జరగలేదు.

మనోగతాలు వెనుక..:

విశాఖ శారదాపీఠం పేరుతో స్వరూపానందేంద్ర స్వామి చేసే రాజకీయ ప్రకటనలు అన్నీ ఇన్నీ కావు. ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఓ రకంగా ఆస్థాన స్వామిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై పదే పదే విమర్శలు చేసేవారు. ఇక కొద్ది రోజుల కిందట? తిరుమల తిరుపతి దేవస్థానానికి సుధాకర్‌ యాదవ్ను చైర్మన్గా నియమించగానే ఏదో పీఠం పేరు పెట్టుకుని శివస్వామి అనే స్వామి తెరపైకి వచ్చారు. ఈయన ఇంకా వివాదాస్పద స్వామి. భద్రాచలం రాములవారి గర్భగుడిలోనే ధర్నా చేశారు. దానికి కూడా.. ఆధ్యాత్మిక కారణాలే చెప్పారు. ఇక శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి ఇటీవలి కాలంలో హిందూ బేస్గా రాజకీయాలు చేశారు. ప్రత్యేకంగా చానల్‌ పెట్టి హిందూత్వ పరిరక్షణ అంటూ ఉద్యమాలు చేస్తున్నారు.

మార్కెట్‌ ధర రూ.12 కోట్ల పై మాటే..:

గండిపేట మండలం కోకాపేట గ్రామం పరిధిలోని సర్వే నంబరు 240లో 316.04 ఎకరాల పోరంబోకు స్థలం ఉంది. ప్రస్తుతం ఇది హైదరాబాద్‌ పురపాలక అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఆధీనంలో ఉంది. ఇదే లేఅవుట్లో ఖాళీగా ఉన్న 2.34 ఎకరాల స్థలంలో రెండెకరాలను పీఠానికి కేటాయించేందుకు ప్రభుత్వం హెచ్‌ఎండీఏ నుంచి వెనక్కు తీసుకుంది. ఇక్కడ ఎకరా స్థలం మార్కెట్‌ విలువ రూ.12 కోట్లు పలుకుతోంది. ఈ స్థలాన్ని రూపాయికి ఎకరా చొప్పున భూమిని కేటాయిస్తూ శనివారం జీవో ఎంఎస్‌ నెం.71 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది.

మరణాంతరం అంతా మట్టే…:

‘మానవసేవే మాధవసేవ’ అంటూ చెప్పే స్వాములు ఆద్యాత్మిక రూపంలో ఎన్నో వేల కోట్లు వెనకేసుకున్నా… చివరకు ఆ డబ్బంతా రాజకీయ రాబందుల పాలేనని చరిత్ర చెపుతుంది. ముమ్మిడి వరం బాలయోగి, దిగంబర జిల్లేళ్ళమ్మ, పుట్టపర్తి సాయిబాబా, కాళేశ్వరం బాబా, బుల్లి బాలసాయిబాబా… వీళ్ళంతా కోట్లాది రూపాయలు కలిగినోళ్ళే. చివరకు ఏ డబ్బూ తన వెంట తీసుకెళ్ళలేదు కానీ… వీరి జీవితకాలంలో సంపాదించిన సొమ్మంతా రాజకీయ రాబందుల పాలైంది. హతోస్మి.

ూఖఒ. ఃూచీ

సన్యాసి నోట ఈ మాటలు, చేష్టలు ఏల..?:

హిందూ మతం కాదు. లేదు. హిందూదర్మంలో సన్యాస ఆశ్రమానాకి ఓ పెద్దపీట ఉంది. అది అద్వితీయం. స్వరూపానంద స్వామి నోట ఈ మాటలేల.

పెద్ద పెద్ద విషయాల దాకా దేనికి..? ఇవి కొన్ని చూద్దాం. స్వరూపానంద పలుకు లకు ఆదాబ్‌ చురకలు చూడండి.

? స్వరూపానంద పలుకు:

”కేసీయార్‌ అపర రాజకీయ మేధావి. అందుకే నెగ్గుకొస్తున్నాడు.”

? ఆదాబ్‌ చురక:

అందులో స్వామి స్వరూపుడి సర్టిఫికెట్టు అస్సలే అవసరం లేదు. కేసీయార్‌ ప్రత్యర్థులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు.

? స్వరూపానంద పలుకు:

”ఆయన నాకు ప్రాణసమానం.”

? ఆదాబ్‌ చురక:

అదెలా..? ఆ ఒక్కడే దేనికి..? ఒక సన్యాసికి, తనదీ ఓ పీఠమేనని చెప్పుకునే ఓ స్వామికి, ‘మనుషులంతా దైవసమానులే’ అని నమ్మే వ్యక్తికి కేవలం ముఖ్యమంత్రి మాత్రమే ప్రాణసమానం ఎలా అవుతాడు..? అలాంటప్పుడు ఆ సన్యాసానికి ఉన్న రాగద్వేషరాహిత్యం సార్థకత ఎంత..? అందులో నిజం ఎంత..?

? స్వరూపానంద పలుకు:

”అగ్నిసాక్షిగా చెబుతున్నా, జగన్‌ నా ఆత్మ. కేసీయార్‌ ప్రాణసమానం”

? ఆదాబ్‌ చురక:

జగన్‌ ఆత్మ అట? ఓహ్‌, సన్యాసుల జీవాత్మ ఆ పరమాత్మ భజన వీడి మరో జీవాత్మను భజించడమేనా సన్యాసం..?

? స్వరూపానంద పలుకు:

”తను (జగన్‌) సీఎం కావాలని ఐదేళ్లు తపస్సు చేశా?”

? ఆదాబ్‌ చురక:

ఒక సన్యాసో, ఓ పీఠాధిపతో ‘సర్వేజనా సుఖినోభవంతు’ అని కోరితే అర్థముంది. కాటకాల్లేని కాలం గురించి తపస్సు చేస్తే దానికో లెక్కుంది. కానీ ఒక వ్యక్తికి ముఖ్యమంత్రి కుర్చీ కోసం తపస్సు చేయడం, అదీ ఘనంగా ప్రకటించడం. ఇదేనా ఒక ఆధ్యాత్మిక పీఠం లక్ష్యం..? అసలు అది పీఠమేనా..? డీమ్డ్‌ యూనివర్శిటీల్లాగా ఎవరికి వా?ళ్లు డీమ్డ్‌ మఠాలు, స్వయం ప్రకటిత పీఠాలు పెట్టేసుకుని, ఇలా ‘సొంత దుకాణాలు’ స్థాపించుకుని, ఇలాంటి ‘సంకుచిత ఎజెండా’తో తపస్సులు చేస్తే? వీళ్లను స్వాములు అనాలా..?

? స్వరూపానంద పలుకు:

”ఫలితాలకు ముందే సీఎం జగన్‌ అని చెప్పా?”

? ఆదాబ్‌ చురక:

అది స్వరూపానంద స్వావిూ అది విూ కోరిక. అంతే తప్ప అది జ్యోతిష్యం కాదు.

? స్వరూపానంద పలుకు:

”భవిష్యత్తును చెప్పేది శారదా పీఠమే?”

? ఆదాబ్‌ చురక: చూశారా, ఈ ఇద్దరు సీఎంలను? ఎలా పడేశానో? ‘మిగతావాళ్లూ రండి, శారదాపీఠం ముందు క్యూ లైన్‌ కట్టండి’ అని ప్రచారం చేసుకున్నట్టుంది ఇది.

? స్వరూపానంద పలుకు:

”మరో 15 ఏళ్లు వీరిద్దరి పాలన సాగాలి? అందుకు తపస్సు చేస్తా”

? ఆదాబ్‌ చురక: సంకల్పానికి దరిద్రం దేనికి..? 15 ఏళ్లు మాత్రమే దేనికి..? దానికీ ఏదైనా ఓ ‘రాజశ్యామల’ లెక్క ఉందా..? తమరి తపస్సులు, తమస్సులు అన్నీ వ్యక్తుల ఆశలు, అధికారాల చుట్టూ కేంద్రీకృతమై సాగే ఒక ఎజెండా బేస్డ్‌ తూతూమంత్రాలా..?

? స్వరూపానంద పలుకు:

శారదా పీఠానికి హైదరాబాదులో 2 ఎకరాలు?

? ఆదాబ్‌ చురక:

ఓహ్‌, అదా..? కానీ మరీ రెండెకరాలే ఎందుకు స్వావిూ..? మరీ చీపుగా? ఆఫ్టరాల్‌ 25 కోట్లేనట, విూకు ఇవ్వబోయే భూమి విలువ? పదీ… కాదు..పదిహేను… కాదు..కాదూ.. ఓ పాతిక ఎకరాలు తీసుకోకపోయారా…? హైదరాబాదు భూములే కదా, అవి ఎప్పుడూ పాలకులు పంచే పప్పూబెల్లాలే కదా?! ఇంకా 15 ఏళ్లు తపస్సు చేయాలంటే ఈ ‘పరిమిత భూమి’ ఎలా సరిపోతుంది..? ఇప్పటికే రెండు రూపాయలకే రెండెకరాలు… ఔరా…! తెలంగాణ అమరవీరులకు ఇలాంటి సౌకర్యం ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందో..! స్వాములోరూ వారి కుటుంబాల కోసం ఓ తపస్సు చేయరూ…! ఇది రాయటమే తప్పు అయితే మంత్రాలతో శపించకండి. నిర్భయంగా రాసే మా పాత్రికేయుల ఉన్నతి కోసం ఓ తపస్సు చేయగరు. దీర్ఘాయుష్మాన్‌ భవ..!

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close