Featuredప్రాంతీయ వార్తలు

బాలల హక్కుల సాధనకు *సుస్థిర అభివృద్ధి*

వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్.వికారాబాద్ ఆదాబ్ హైదరాబాద్.బాలల హక్కుల సాధనకు సుస్థిర అభివృద్ధి  లక్ష్యాలను చేరుకునేలా ప్రజాప్రతినిధులు చట్టసభల్లో కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ను విద్యార్థులు కోరారు. ఈ సందర్భంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.  ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పంచాలని, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలని అధిక ప్రధాన్యం ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గం లో ప్రభుత్వ విద్యా సంస్థలకు మిషన్ భగీరథ ద్వారా తాగు నీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు విడతల వారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ వి ఎఫ్ ప్రతినిధులు నర్సింలు వెంకటయ్య ఆశాలత ఉమాదేవి రామేశ్వర్ అరుణ తదితరులు పాల్గొన్నారు

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close