సుప్రీం తీర్పు మారాలి , రివ్యూపిటిషన్‌ గెలావాలి – గురుస్వామి వెంకటేశ్‌ శర్మ ఆకాంక్ష

0

హైదరాబాద్‌: శబరిమల కొండకు అయ్యప్ప స్వామి అధినాయకుడు. స్వామి చెప్పినట్టు వంటి నియమావళి ఇన్నాళ్లు కొనసాగుతూ వచ్చింది భక్తులు పాటించారు, పాటిస్తున్నారు కూడా. అవి అలా కొనసాగడమే న్యాయం అని తిరుపతి చంద్రమౌళి గురుస్వామి కుమారుడైన వెంకటేశ్‌ శర్మ గురుస్వామి హితవు పలికారు. సికింద్రాబాద్‌ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరిగిన అయ్యప్ప భక్తుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అనుగ్రహభాషణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజ్ఞాభారతి ప్రెసిడెంట్‌ గోసాల శ్రీనివాస్‌ కళ్యాణ్‌ , లీగల్‌ అడ్వయిజరీ నుండి సోమయాజులు పాల్గొన్నారు. వెంకటేశ్‌ శర్మ గురుస్వామి మాట్లాడుతూ ధర్మశాస్తా వారు ఈ అయ్యప్ప అవతారంలో ఎంచుకున్నది నైష్టిక బ్రహ్మచర్యం. కనుక దానికి సంబధించిన నియమాలు అక్కడ అమలులో ఉన్నాయి. స్వామివారిని దర్శించుకునే మహిళలలో కొన్ని వయసుల వారినే అనుమతించేది ఆడవారి విషయంలో వివక్ష ఉండడం వల్ల కాదు. స్వామిని నిజంగా కొలిచే భక్తుల్లో ఎవరు కూడా శబరిమల స్త్రీకి వ్యతిరేకం అని అనుకోవడం లేదు అని అన్నారు.

ఆలయ మర్యాదను సరిగా అర్థం చేసుకోలేక దీన్ని లింగవివక్షగా న్యాయస్థానాలు చూస్తున్నాయి. అన్ని వయసుల వారిని ఆలయంలోకి అనుమతించాలని తీర్పులు చెప్పాయి. ఈ తీర్పు అభ్యంతరకరమైనది కావడంతో స్త్రీశక్తి కేరళ రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేసింది. వారి మనోభావాలను అర్థంచేసుకుని మిగతా రాష్ట్రాల్లో కూడా స్త్రీలు సంప్రదాయానికే విలువ ఇవ్వాలనడం సంతోషించదగ్గ విషయం

మన చట్టాలని అందరికంటే ఎక్కువ గౌరవించేది మన అయ్యప్పస్వామి భక్తులే కనుక ఈ ఆధ్యాత్మిక నిరసన ప్రతి ఇంటి నుండి రావలసిన అవసరం ఉన్నదని అన్నారు. శబరిమలకు సంబంధించినంత వరకు మనము ముఖ్యంగా చేతులెత్తి పాదాభివందనం చేయాల్సింది పందళ రాజ వంశానికి. అక్కడ ఉన్న శబరిమాత ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మనం చూస్తున్నట్టు వంటి ఆధ్యాత్మిక నిరసన జరుగుతోంది. ఆ శబరిమాత పిలుపుకు మొదట ఐదు వేల స్త్రీలతో ప్రారంభమైన ఈ నిరసన దాదాపు రెండు లక్షల స్త్రీలకు చేరింది.

ఆధ్యాత్మిక విషయాల్లో కొన్ని అపశ్రుతులు జరుగుతున్నప్పుడు మనము మన భావం వ్యక్తం చేయకుండా మౌనంగా ఉండటం వల్లనే ఇలాంటి ఆచారాన్ని భగ్నంచేసే పరిస్థితులు నెలకొంటాయి.

నా ఇంటి నుండి నా సతీమణి శబరిమలకు యాభై సంవత్సరాలు దాటిన తర్వాతనే వస్తాను అని ఒక డిస్ప్లే బోర్డు పట్టుకుని ఫోటో దిగి సోషల్‌ విూడియాలో పెట్టాను. ఒక గురుస్వామి గా ఇది నా బాధ్యత అని భావిస్తున్నాను . అలాగే ప్రతి పురుషుడు వారివారి మంజు మాతలను సంప్రదించి వారు సరైన సమయంలోనే శబరిమల యాత్ర చేస్తాము అని తెలియచేసే ఒక ఆధ్యాత్మిక నిరసన చేపట్టాలి అని గురుస్వామి పిలుపునిచ్చారు.

ఇప్పటికే మనం చాలా కోల్పోయాం, ఇకనైనా కాపాడుకుందాం. సంకల్పం బలంగా పెట్టుకుని మన ధర్మాలను కాపాడుకుందాం

ఒక జల్లికట్టుపై కోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా అందరూ ఏకం అయ్యారు . మరి ఈ శబరిమల పై కోర్టు ఇచ్చిన తీర్పుకు ఎంత మంది గురుస్వాములు ఏకం అవుతున్నారో వారికి వారే ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి అన్నారు.

శబరిమలకు రాలేని స్త్రీల కోసం శ్రీ స్వామి అయ్యప్పనే వివిధ ప్రాంతాల్లో వెలిశారు . శ్రీ స్వామి ప్రతిష్ఠ ఎన్నో గుడులలో మేము చేశాము . శబరిమలకు రాలేని మంజు మాత ల కోసం వెలసిన పుణ్యక్షేత్రాలే ఈ రోజు మనం చేస్తున్నటువంటి బొల్లారం మెట్టుగుడా లాంటి ఆలయాలు. కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయాలి..పందల అమ్మ (శబరిమాత ) విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆ విజయం మన సంస్కృతిని కాపాడుతుందని వెంకటేష్‌ గురుస్వామి ఆశాభావం వ్యక్తంచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here