హైదరాబాద్‌లో సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌…

0

-కూకట్‌పల్లిలో తొలి శాఖ ప్రారంభం
హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులలో ఒకటైన సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ తమ బ్యాంకింగ్‌ కార్యకలాపాలను హైదరాబాద్‌లో తొలి శాఖను ప్రారంభించింది. ఈ శాఖను ఎన్‌ఎండీసీ జనరల్‌ మేనేజర్‌ పైనాన్స్‌ ఏ కె పాడీ ప్రారంభించారు. ఆనంతరం ఎండి అండ్‌ సిఇవో భాస్కర్‌ బసు మాట్లాడుతూ సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ప్రధానంగా బ్యాంకు సదుపాయాలు అందుబాటులో లేని మరియు అన్ని బ్యాంకింగ్‌ సదుపాయాలు లేని వర్గాలకు సృజనాత్మక బ్యాంకింగ్‌ విధానాల ద్వారా వినియోగదారులకు సేవలు అందించడాన్ని లక్ష్యంగా చేసుకున్నామన్నారు. తెలంగాణలో మా బ్యాంకింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామని, మా వినియోగదారులకు అత్యంత సరసమైన వడ్డీరేట్లను మేము అందిస్తున్నామన్నారు. మా విస్తృతస్థాయి వ్యాపార నమూనా మరియు అతి తక్కువ నిర్వహణ ఖర్చులు కారణంగానే ఇది సాధ్యమవుతుందన్నారు. ఎస్‌ఎస్‌ఎఫ్‌బీ ఇటీవలనే రెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయల మూలధనం సమీకరించిందని తమ వ్యాపార ప్రణాళికలు అమలు చేసేందుకు ఇవి బలీయమైన తోడ్పాటునందిస్తాయన్నారు. మా బ్యాంకులో పదహారు వందల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని గ్రాస్‌ లోన్‌ పోర్ట్‌పోలియో దాదాపు మూడువేల కోట్ల రూపాయలు కలిగియున్నాయని తెలిపారు. షెడ్యూల్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ తమ బ్యాంకింగ్‌ కార్యక్రమాలను జనవరి 2017లో ప్రారంభించిందన్నారు. పది రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలలో 380 శాఖలు, డోర్‌ స్టెప్‌ కేంద్రాల ద్వారా నిర్వహిస్తుందన్నారు. మూడు వేల కోట్ల రూపాయల పోర్ట్‌పోలియో కలిగి ఉందన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here