నేటి నుంచి వేసవి సెలవులు

0
  • 13 ఎప్రిల్‌ నుంచి 31 మే వరకు
  • ఎవరైనా స్కూళ్లు నడిపిస్తే కఠిన చర్యలు
  • ప్రకటించిన విద్యాశాఖ

హైదరాబాద్‌ : ఎండా కాలం..ఎండలు మండే కాలం.. ఎండల్లో కాలం సెలవుల్ని కూడా తెచ్చేసింది. తెలంగాణ విద్యాశాఖ వేసవి సెలవులను శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకూ శనివారం నుంచి మే 31 వరకూ సెలవులు ఇస్తూ ప్రకటనను విడుదల చేసింది. ఈ 50 రోజులూ అన్ని స్కూళ్లనూ విధిగా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంటర్‌ లోకి ప్రవేశిస్తున్న విద్యార్థులకు స్పెషల్‌ క్లాసుల పేరిట ఎవరైనా స్కూళ్లు నడిపిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే, పలు ప్రముఖ విద్యా సంస్థలు ఇంటర్‌ ప్రవేశం కోరుతున్న విద్యార్థులకు ముందుగానే క్లాసులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. ఇందులో ప్రైవేట్‌ స్కూళ్లు కూడా ఉన్నాయి. వేసవిలో స్కూళ్లు నడిపితే కూడా చర్యలు తప్పవని హెచ్చరించింది. 2017 విద్యాసంవత్సరం వరకు పాఠశాలలు ఏప్రిల్‌ 24వ తేదీ వరకు జరిగేవి. ఏటా ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులుండేవి. జూన్‌ 12న పాఠశాలలు పున:ప్రారంభమయ్యేవి. విద్యాసంవత్సరం కూడా జూన్‌ 12న ప్రారంభమయేది. రాష్ట్ర ప్రభుత్వం ఆ విధానానికి రెండేళ్లుగా స్వస్తి పలికింది. దీంతో వచ్చే విద్యాసంవత్సరం ముందస్తుగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రెండోసారి జూన్‌ 1న విద్యాసంవత్సరం కావడం విశేషం. ఇంకోవైపు జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లోకి తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, భౌగోళిక అంశాలను విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here