Featuredస్టేట్ న్యూస్

కంట్రీ క్లబ్‌ బాధితులకు ఊరట అండగా నిలిచిన సిఐడి ఎస్పీ సుమతి

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): బేగంపేట్‌ లోని కంట్రీ క్లబ్‌ అమాయకులకు, ప్రజలకు మాయ మాటలు చెప్పి తన మోసాలను కొనసా గిస్తున్నది. ప్రజలకు ఫోన్‌ చేసి వారి వివరాలు లక్కీ డ్రాల్లో వచ్చాయని విజేతలు వారే అని బేగంపేట్‌ ఆఫీసుకి రప్పించుకుని మాయమా టలు చెప్పి ఏదో ఒక రకమైన స్కీంలో ఇరికించి తర్వాత స్కాంలో వారిని బాధితులను చేయడం బేగంపేట్‌ కంట్రీ క్లబ్‌ యొక్క నైజం. ఈ క్రమంలోనే బి హెచ్‌ కష్ణ అనే కస్టమర్‌ కి ఫోన్‌ చేసి ఆఫీసుకి రప్పించుకుని దాదాపు లక్షన్నర పైగా కొట్టేశారు. వారి నెంబర్‌ లక్కీ డ్రాలో వచ్చిందని వారికి ఫలానా ఏరియాలో స్థలం ఇప్పిస్తామని చెప్పి పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. ఆ తర్వాత అడ్వాన్స్‌ కోసం కొంత డబ్బు కట్టాలని ఇది మూడు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తారని చెప్పేసి బలవంతంగా తన చేతిలోంచి క్రెడిట్‌ కార్డు తీసుకుని డ్రా చేశారు. ఈ తతంగం జరిగి దాదాపు రెండు సంవత్స రాలు జరిగింది. అప్పట్లో క్రెడిట్‌ కార్డ్‌ డ్రా చేయడానికి పాస్వర్డ్‌ టైప్‌ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అందువలన క ష్ణ అనే కస్టమర్‌ తన సొమ్మును కంట్రి క్లబ్‌ వారి నుండి రక్షించుకోలేక పోయారు. వెంటనే తేరుకున్న అతను ఇదేమిటని ప్రశ్నించగా వారు పొరపా టున జరిగింది అని చెప్పేసి తన డబ్బు మూడు రోజుల్లో ఇచ్చేస్తామని చెప్పి పంపించడం జరిగింది. డబ్బు తిరిగి ఇవ్వకపోవడం కాకుండా వారి ప్రవర్తన తీరులో కూడా విపరీతమైన మార్పు కస్టమర్లకు ఎదురైంది. సరేలే వీరు ఎలాగో డబ్బు ఇవ్వడం లేదు కదా కనీసం ఆ స్థలం ఏదైతే ఇప్పిస్తామన్నారు అదైనా చూయిం చండి అని కస్టమర్‌ కష్ణ వారిని అడగడం జరిగింది. పూర్తి దొంగలెక్కలతో వ్యాపారం చేసే ఆ క్లబ్బు వారు ఎటువంటి స్థలము చూపిం చకపోవడమే కాకుండా కనీసం పేపర్లో సర్వే నెంబర్‌ కూడా చెప్పలేకపోయారు. ఇటు తన క్రెడిట్‌ కార్డు నుండి డబ్బులు పోవడం ద్వారా బ్యాంకు వాళ్ళ నుండి విపరీతమైన ఒత్తిడి కస్టమర్‌ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకానొక సందర్భంలో తన బంధువును ఆస్పత్రిలో చేర్పించాల్సి ఉండగా సరైన సమయంలో క్రెడిట్‌ కార్డులో డబ్బులు లేకపోవడం వల్ల ఆస్పత్రి వాళ్లు పేషెంట్‌ ను చేర్చుకోలేదు. దురదష్టవశాత్తు ఆ బంధువు సరైన సమయంలో వైద్యం అందకపోవడం వల్ల ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది. ఒకవేళ కంట్రి క్లబ్‌ వాళ్లు డబ్బులు డ్రా చేసి ఉండకపోతే అదే కార్డు ద్వారా ఆస్పత్రి వాళ్లకు సరైన సమయంలో డబ్బులు కట్టి బంధువును ఆస్పత్రిలో చేర్పించే వాడినని బాధితులు చెప్పారు.

ఇంతటి హీనంగా మానవత్వం లేకుండా వ్యాపారం చేస్తున్నట్టు వంటి కంట్రి క్లబ్‌ వారి నుండి డబ్బులు ఇప్పించమని మంత్రి పద్మారావును ఆశ్రయించారు. తన ద్వారా బాధితులకు నలభై వేల రూపాల వరకు రావడం జరిగింది. తరువాత మిగతా దాదాపు లక్ష రూపాయల వరకు ఇవ్వడానికి వారు ససేమిరా అన్నారు. అందుకు వారు మంత్రి పద్మారావు లెటర్‌ ని సైతం పట్టించుకోలేదు. తర్వాత బాధితుల కుటుంబం అప్పటి నార్త్‌ జోన్‌ డిసిపి అయినటువంటి సుమతి సహాయం కోసం వెళ్లారు. విషయం పూర్తిగా తెలుసుకున్న డిసిపి సుమతి వెంటనే కంట్రీ క్లబ్‌ పరిధిలోకి వచ్చే పంజాగుట్ట ఇన్స్పెక్టర్‌ కి ఫోన్‌ చేసి బాధితులకు తక్షణమే సహాయం వచ్చేలా చూడమని ఆదేశాలు జారీ చేసింది. ఆ వెంటనే పంజాగుట్ట అప్పటి ఇన్స్పెక్టర్‌ రవీందర్‌ కంట్రి క్లబ్‌ వాళ్లకు ఫోన్‌ చేసి సమస్యను త్వరగా పరిష్కరించమని లేకపోతే చట్టపరమైన చర్యలను వారు ఎదుర్కోవాల్సివస్తుందని చెప్పారు. వెంటనే స్పందించిన కంట్రి క్లబ్‌ మేనేజర్‌ శ్రీధర్‌ పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌ ఇచ్చి బాధితులను తిరిగి పంపించేశారు. కాగా అకౌంట్లో ఎటువంటి డబ్బు లేకపోవడం వల్ల తను ఇచ్చిన చెక్‌ బౌన్స్‌ అయింది. ఇదేమిటని బాధితులు వెళ్లి అడగగా దానికి తాము ఏమీ చేయలేమని శ్రీధర్‌ చేతులెత్తేశారు. ఇక వారు బాధితులను ఇబ్బంది పెట్టడం షరా మామూలే అయిపోయింది. పరిస్థితి చేజారి పోయింది కాబట్టి మరలా వారు సుమతి సహాయం కోరడం జరిగింది. సిఐడి వుమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ లో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నట్టు వంటి సుమతి ఆదేశాల మేరకు పంజాగుట్ట ప్రస్తుత ఇన్స్పెక్టర్‌ మోహన్‌ కుమార్‌ బాధితులకు అండగా నిలబడటం కారణం చేత కంట్రీ క్లబ్‌ వారు తోక ముడిచి రావలసిన మిగతా దాదాపు లక్ష రూపాయల వరకు బాధితులకు డిడి అందచేశారు. పోతూ పోతూ వాత అన్నట్టు ఇరవై వేల రూపాయల వరకు జీఎస్టీ వడ్డించి మరో షాట్‌ ఇచ్చారు.

జీఎస్టీ అనేటిది ఏదైనా సర్వీస్‌ లేదా ప్రాడెక్ట్‌ తీసుకుంటే విధించాల్సిందని కానీ ఈ విషయంలో మేము కంట్రి క్లబ్‌ నుండి ఎటువంటి సర్వీస్‌ తీసుకోలేదని, కేవలం కట్టిన డబ్బు మాత్రమే వాపసు ఇవ్వాల్సిందని కోరామని మరి అటువంటి దానికి అది కూడా జీఎస్టీ అమలులోకి రానటువంటి రెండు సంవత్సరాల ముందు జరిగిన ఈ ట్రాన్సాక్షన్లపై జీఎస్టీ ఎలా వేస్తారు అని బాధితులు బి హెచ్‌ క ష్ణ కంట్రీక్లబ్‌ మేనేజర్‌ శ్రీధర్‌ ని నిలదీశారు.

దీనికి అతను నీళ్లు నములుతూ ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఫోన్లు స్విచాఫ్‌ చేయడం ప్రారంభించారు. ఏదైనా ఉంటే కంట్రి క్లబ్‌ యజమాని రాజారెడ్డితో మాట్లాడుకోమని దుర్భాషలాడారు. ఇలాంటి మోసగాళ్ల వలలో పడకుండా ప్రజలు స్వీయ అవగాహనతో ఉండాలని పంజాగుట్ట ఇన్స్పెక్టర్‌ మోహన్‌ కుమార్‌ ప్రజలను కోరారు

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close