సిరిసిల్ల (ఆదాబ్ హైదరాబాద్): సిరిసిల్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ పోటీ చేస్తున్న చేనేతల ఆత్మహత్యలు,పీడీఎస్‌యూ నేత కిడ్నాప్‌తో పాటు సాక్షాత్తు మంత్రి కేటీఆర్ సభలోనే నేరెళ్ల బాదితుల ఆత్మహత్యలు తదితర సంఘటనలతో సిరిసిల్ల పట్టణ ప్రజలు భయబ్రాంతు లకు గురవుతున్నారు. మంత్రి కేటీఆర్ పోటీ చేస్తున్న జిల్లా కావడంతో సిరిసిల్ల ప్రాంతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాం శమవుతుండగా అందులో జరుగుతున్న వరుస సంఘటనలు సైతం రాష్ట్ర ప్రజలలో తెరాస పాలనకు నియంతృత్వానికి నిదర్శనంగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చేనేతల కోసం అనేక సంక్షేమ చర్యలు చేపట్టామని ప్రభుత్వం గొప్పలకు పోతున్న ఎన్నికల సమీపంలో ఓ చేనేత ఆత్మహత్య చేసుకోవడం వారి బతుకుని తేట తెల్లం చేస్తుందనడంలో సందేహం లేదు. ఈవ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కుటుంబాలని కలవర పరిచేందిగా మిగిలింది. బంగారు తెలంగాణలు, బతుకమ్మ చీరలు వారి పాలిట ఉరితాళ్ళగా మిగిలిపోవడం చేనేతలు భరించలేకపోతున్నారు. అదేవిధంగా నేరెళ్ళ బాధితుల అంశం సైతం రాష్ట్రంలోని దళితులని తొలచివేస్తుంది. సంఘటన జరిగి ఏడాదైనా చార్జిషీటు నమోదు చేయకపోవడాన్ని తప్పుపడుతూ తెరాస ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెడుతున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ సభలో నేరెళ్ళ భాదితుడొకరు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడటాన్ని దళితులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీని ప్రభా వం రాష్ట్ర వ్యాప్తంగా ఉందనడంలో సందేహంలేదని దళితు లు తెరాస ప్రభుత్వానికి దూరమనారనడానికి నేరెళ్ళ సంఘ టనని వారు ఉదాహరిస్తున్నారు. మరో పక్క శనివారం పీడీ ఎస్‌యూ రాష్ట్ర కోశాధికారి అజయ్ గౌడ్‌ను సివిల్‌లో వచ్చిన పోలీసులు అక్రమంగా పట్టుకుపోయారని రాజన్న సిరిసిల్ల జిల్లాలో పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి విష్ణు విలేక రుల సమావేశంలో వెల్లడించారు. అజయ్
గౌడ్‌ను పట్టుకెళ్ళిన పోలీసుల ఇప్పటివరకు ఎలాంటి సమాచారం తెలుపడంలేదని, అజయ్‌కు ఎలాంటి హని జరిగినా ప్రభుత్వమే భాద్యత వహించాలని ఆయన డిమాండ్ చేయడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జరిగిన సంఘటనను ఓయూ జేఏసీ నేతలు,విద్యార్థి సంఘాలతోపాటు వివిధ వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండించారు. కాగా సిరిసిల్లలో వరుసగా జరుగుతున్న సంఘటనలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.