విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం

0

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలయ్యామని.. తక్కువ మార్కులొచ్చాయని ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విద్యార్థుల ఆత్మహత్యలు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. ఈ ఘటనపై బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్‌, ఢిల్లీ బీజేపీ సమన్వయ కర్త నూనె బాల్‌ రాజ్‌, కామరాసు బాల సుబ్రహ్మణ్యం తీవ్రంగా స్పందించారు. ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెలువడిన తరువాత విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమని అన్నారు. బోర్డు చేసిన తప్పిదాల వల్ల విద్యార్ధులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఇంటర్‌ విద్యార్థుల బాధలు కేసీఆర్‌ పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు వద్ద గత రెండు రోజుల నుండి ఉద్రికత్త పరిస్థితి నెలకొన్న ఆ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించకపోవడం బాధాకరం, వెంటనే విద్యాశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి నైతికబాధ్యత తీసుకొని రాజీనామా చేయాలని విద్యార్థి లోకం డిమాండ్‌ చేస్తున్నప్పటికిని ప్రభుత్వం స్పందించకపోవడం, గ్లోబరినకు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నా సంబంధంపై పలు అనుమానాలు ఉన్నాయి.. వాటిని వెంటనే నివృత్తి చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు ఆశిస్తున్న మార్కులకు వచ్చిన మార్కులకు పొంతనలేదని ఆరోపించారు. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ విద్యార్థుల పట్ల మాట్లాడిన తీరు అభ్యంతరంగా ఉందని అన్నారు. బోర్డు చేసిన తప్పిదాల దృష్ట్యా విద్యార్థులకు ఉచితంగా జవాబు పత్రాలను అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఈఘటనలపై ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకపోతే ఇంటర్‌ బోర్డు ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని తెలిపారు. చనిపోయిన విద్యార్ధుల తల్లిదండ్రులకు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించాలని అన్నారు. ఇప్పటి వరకు సీఎం, విద్యాశాఖ మంత్రి స్పందించకపోవడం దారుణమని అన్నారు. వెనుకబడిన తరగతుల రాజకీయ భవిష్యత్‌ని అంధకారంలోకి నెట్టేలా, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం బ్రిటిష్‌ పాలన కొనసాగిస్తుందని, నైజం పాలకుల అణిచివేత లక్షణాలను పునికిప్పుచ్చుకొని పరిపాలిస్తున్నారు మండిపడ్డారు. ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ అధికార పక్షం మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలను తీసుకొచ్చరన్నారు. దేశవ్యాప్తంగా మోడీ అనుకూల పవనాలు వీస్తున్నాయి. తెలంగాణలో 2023 ఎన్నికల్లో ప్రభాలమైన శక్తిగా బీజేపీ నిలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here