సభలు పుల్లు-ఫలితం నిల్లు

0

(అనంచిన్ని వెంకటేశ్వరరావు)

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) :’చాట్ల తవుడు పోసి, కుక్కల కొట్లాట పెట్టడం !’ అన్న చందాన ముందస్తు పేరుతో కేసీఆర్‌ ఎన్నికల ఈలతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎవరి ఎత్తుగడలు వారివి. ఎక్కడ చూసినా రాజకీయ వాతావర్ణం, చర్చలు కొనసాగుతున్నాయి.

సహజంగా..: ఎన్నకలలో బరిలోకి నిలిచే అభ్యర్థులను ప్రాకటిస్తారు. అనంతరం మ్యానిఫె స్టోలు ప్రకటిస్తారు. రాష్ట్రస్థాయి నాయకులతో, అనుబంధ సినీ తారలతో ప్రచారం జోరుగా సాగిస్తారు. చివరిగా కొసమెరుపులా జాతీయ నాయకుల బహిరంగ సభలు జరుగుతాయి. ఈసారి అందుకు విరుద్ధంగా ప్రచార పర్వానికి తెరలేచింది.

జాతీయ నాయకుల పర్యటనలు: జాబితాలు ఖరారు చేయలేదు. అభ్యర్థులు లేకుండా.. పాక్షిక మ్యానిఫెస్టో హామీలతో జాతీయ పార్టీలు ప్రచా రం మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా భాజ పా తరఫున ఆపార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా, కాంగ్రెసుపార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ రెండుసార్లు బహిరంగ సభలు నిర్వహిం చారు. ఎక్కడా కూడా ఆ పార్టీ అభ్యర్థులు ఎవరుంటారనే విషయం చెప్పకుండా సభలు కానిచ్చారు.

ఆకర్ష..ఆకర్ష..: ఏ పార్టీ నుంచి ఎవరు ఎప్పుడు’జంప్‌’ అవుతారో తెలియని పరిస్థితిలో అన్ని పార్టీలు ఉన్నాయి. తరలి పోవలసిన వారంతా పోయారు కాబట్టి ఎర్ర పార్టీలు మాత్రం నిశ్చింతగా ఉన్నాయి. కారు నిండింది: గులాబీ కండువ కప్పుకున్న వారితో కారు కిక్కిరిసి పోయింది. అయితే అసంత ప్తి వాదులతో అంతర్గతంగా క్షణం తీరిక లేకుండా ‘గులాబీ నేత’ చర్చలు చేస్తున్నారు. నేత ప్రకటించిన 105 మందిలో కనీసం 20 మంది అభ్యర్థులు ప్రచారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల గులాబీ కండువ కప్పుకున్న దానం నాగేందర్‌, మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డి లకు ఎక్కడ చోటు ఉంటుందో తెలియని స్థితి. గులాబీ నేత కూడా నాలుగు సభలు నిర్వహించి కార్యకర్తలను ఉత్తేజపరచడానికి శాయశక్తులా క షి చేస్తున్నారు.

తెజస గుర్తు..

ఉదయించే సూర్యుడు.!.. కోదండరాం నేత త్వంలోని తెలంగాణ జన సమితి కి ‘ఉదయించే సూర్యుడు’ గుర్తు లభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు ఆపార్టీ అగ్గిపెట్టె గుర్తు కూడా అందుబాటులో పెట్టుకుని ఎన్నికల సంఘానికి వివరాలు పంపింది. అయితే ఎక్కువమంది సభ్యులు ‘ఉదయించే సూర్యుడు’ గుర్తుకు ఆమోదం తెలిపారు. ఈ గుర్తు గతంలో మావోయిస్టు సానుభూతి పరులు, వామపక్ష భావజాలం కలిగిన అభ్యర్థులు నామినేషన్‌ సమయంలో ఎన్నికల సంఘాన్ని కోరేవారు. పార్టీ గుర్తింపు లేక ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా రంగంలోకి దిగే వారికి ఎన్నికల సంఘం కూడా ఈ గుర్తు కేటాయించడం జరిగేది. ఈ గుర్తు బ్యాలట్‌ పేపరుపై అక్కడక్కడా కనిపించేది. మారిన రాజకీయ పరిస్థితులలో తెజస ఈ గుర్తు లభించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here