వెన్నుపోటు పొడవడంలో

0

బాబు సీనియర్‌

పార్టీలు ఫిరాయింపులు చేయడంలో సీనియర్లన్నారు. కొత్త కొత్త కూటములను కట్టగట్టడంలో కూడ సీనియర్లు.. ఇవాళ ఎవరిని తిడుతారో…ఆ తర్వాత వారి ఒడిలో కూర్చోవడంలో కూడ మీరే సీనియర్‌.. ప్రతి ఎన్నికల్లో ఓటమి పాలు కావడం కూడ మీరే సీనియర్‌… మామను వెన్నుపోటు పొడవడంలో కూడ మీరే సీనియర్‌ అంటూ బాబుపై విమర్శలు గుప్పించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ…

గుంటూరు: చమురు సహజవనరులకు సంబంధించిన మూడు ప్రాజెక్టులను ప్రధానమంత్రి మోడీ జాతికి అంకితం చేశారు. ఆదివారం నాడు గంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో బీపీసీఎల్‌ కోస్టల్‌ ఇన్‌స్టలేషన్‌ ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మోడీతో పాటు కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు, రాష్ట్ర గవర్నర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏపీ రాష్ట్రానికి మోడీ పర్యటనను పురస్కరించుకొని నిరసనలు చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.దీంతో మోడీ టూర్‌కు ఏపీ సర్కార్‌ దూరంగా ఉంది. బాబు కేబినెట్‌ నుండి ఏ ఒక్క మంత్రి కూడ మోడీ కార్యక్రమానికి హాజరుకాలేదు. తొలుత ఎయిరిండియాకు చెందిన ప్రత్యేక విమానంలో మోడీ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొన్నారు. అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో గుంటూరుకు చేరుకొన్నారు. ఓఎన్‌జీసీకి చెందిన మూడు సంస్థలను మోడీ ప్రారంభించారు. ఆ తర్వాత గుంటూరులో బీజేపీ నిర్వహించిన ప్రజా చైతన్య వేదిక సభలో ప్రధానమంత్రి మోడీ ఆదివారం నాడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహా కూటమి అపవిత్ర కలయిక అంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. ఏపీ ప్రజల అభివృద్ధిని వదిలేసి తన కొడుకు అభివృద్ధి కోసం చంద్రబాబు పాటుపడుతున్నారన్నారు. మామను వెన్నుపోటు పొడవడంలో బాబు సీనియర్‌ అంటూ మోడీ ఎద్దేవా చేశారు. గుంటూరు వేదికగా బాబుపై మోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓటమి పాలు కానుందని మోడీ జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తెలుగులో శుభాకాంక్షలను చెప్పారు మోడీ. గుంటూరు జిల్లాలో పుట్టిన గుర్రం జాషువా, తిక్కన్న, వావిలాల గోపాలకృష్ణయ్యలను మోడీ తన ప్రసంగంలో గుర్తు చేసుకొన్నారు. మోడీ తన ప్రసంగంలో వావిలాలకు వందనాలు చెప్పారు. ఎంతో మంది ప్రముఖులను ఈ గుంటూరు జిల్లా నుండి వచ్చినవారేనని ఆయన గుర్తు చేశారు.అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్‌ ఆక్స్‌ఫర్డ్‌గా వర్ణిస్తారని ఆయన చెప్పారు. గుంటూరుకు సవిూపంలోని అమరావతికి ఎంతో చరిత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. అమరావతిని హెరిటేజ్‌ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

ఎన్టీఆర్‌ రాజకీయ వారసులిగా వచ్చిన విూరు.... ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నారా.... ఎన్టీఆర్‌కు గౌరవం ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు రాష్ట్రాభివృద్ధిని వదిలి పెట్టి నన్ను తిట్టడమే పనిగా పెట్టుకొన్నారని చెప్పారు. విూరు సీనియర్‌ నేత.... కానీ, విూకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఏనాడూ విస్మరించలేదన్నారు. బాబు నాకంటే సీనియర్‌... ఇందులో వివాదం లేదని మోడీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు చంద్రబాబునాయుడు తన స్టిక్కర్లు వేసుకొంటున్నారని మోడీ విమర్శించారు. ఏపీ ప్రజల కలలను ధ్వంసం చేయడంలో కూడ సీనియర్‌ అన్నాడన్నారు. ఎన్టీఆర్‌ కలలను కూడ బాబు ధ్వంసం చేశాడన్నారు. కూలిపోయిన తన పార్టీని నిర్మించుకోవడంలో చంద్రబాబునాయుడు బిజీగా ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.కేంద్రం నుండి ఎన్ని నిధులు ఇచ్చామో చెప్పమంటే బాబు లెక్కలు చెప్పడం లేదన్నారు.

ఢిల్లీలో దీక్ష పేరుతో ఫోటోలు తీయించుకొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీకి వస్తున్నారని చెప్పారు. ఈ దీక్షకు నిధులు ఎక్కడివో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. గతాన్ని మర్చిపోయి చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నారని మోడీ చెప్పారు. ఎన్టీఆర్‌తో పాటు రాష్ట్రానికి చెందిన నేతలను కాంగ్రెస్‌ పార్టీ అవమానించిందన్నారు. ఎన్టీఆర్‌ను అవమానించిన కాంగ్రెస్‌తో విూరు ఎలా అంటకాగారో చెప్పాలన్నారు. ఎన్టీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని దుష్ట కాంగ్రెస్‌ పార్టీ అంటే... చంద్రబాబునాయుడు ఆ పార్టీతో దోస్తీ కట్టారని మోడీ గుర్తు చేశారు. 55 నెలల్లో ఏపీ రాష్ట్రానికి నష్టం చేయలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తే అసెంబ్లీలో అభినందిస్తూ తీర్మానం చేసిన విషయాన్ని కూడ ఆయన గుర్తు చేశారు. 2016 సెప్టెంబర్‌ మాసంలో దీన్ని అమలు చేస్తే దీన్ని సరిగా చంద్రబాబునాయుడు ఉపయోగించుకోలేకపోయారన్నారు. రూ. 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ నిధులను రాష్ట్రానికి ఇచ్చినట్టు మోడీ వివరించారు.

విభజన చట్టంలోని అంశాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మోడీ చెప్పారు. ఏపీ ప్రజలకు న్యాయం జరిగేలా పని చేస్తామన్నారు. ఏపీ ప్రజలు సంస్కారవంతులని దేశ ప్రజలకు తెలుసునని చెప్పారు. డిక్షనరీలోని తిట్లన్నీ కూడ తనను తిట్టేందుకు బాబు ఉపయోగిస్తున్నారని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఓటమి పాలు కానుందన్నారు. ప్రజలు ఏపీ సర్కార్‌కు వ్యతిరేకంగా తీర్పును ఇవ్వనున్నారని మోడీ అభిప్రాయపడ్డారు. ఏపీలోని తండ్రీ కొడుకుల పాలన అంతం కానుందన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తోందన్నారు. అందుకే తమను గో బ్యాక్‌ అంటున్నారని మోడీ చమత్కరించారు. తన పర్యటన సందర్భంగా నల్ల బెలూన్లను ఎగురవేయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ... ఏదైనా కొత్త కార్యక్రమం ప్రారంభించే సమయంలో దిష్టి తీయడం సంప్రదాయమన్నారు. విూ నల్ల బెలూన్లతో నా కార్యక్రమానికి దిష్టి తీశారని భావిస్తున్నట్టు మోడీ చెప్పారు. వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులకు కొద్ది సేపటి క్రితమే తాను శంకుస్థాపన చేసినట్టు ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల దేశానికి కూడ ఉపయోగం కలుగుతోందన్నారు. పెట్రోలియం రంగంలో కొరత ఏర్పడకుండా చమురు నిల్వల కోసం ఈ రకమైన పథకాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీ రాష్ట్రంలోని విశాఖలో కూడ ఇలానే ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కొత్త ప్రాజెక్టుల వల్ల నిరుద్యోగులకు ఉపాధి లభించనుందని మోడీ చెప్పారు. నిన్న అస్సాంలో నార్త్‌ఈస్టన్‌ గ్యాస్‌ గ్రిడ్‌ను ప్రారంభించినట్టు చెప్పారు.కొత్త భారత నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నట్టు మోడీ చెప్పారు. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టిన జిల్లాకు చెందిన ప్రజల జీవనంలో చాలా మార్పులు రానున్నాయని మోడీ అభిప్రాయపడ్డారు. కొన్ని రోజుల్లో దేశంలోని అన్ని పట్టణాల్లో కూడ ఇదే రకమైన మార్పులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వంపై, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోడీ చెప్పారు. 

ఏపీలో వేల కోట్లతో పథకాలు, ప్రాజెక్టులు ప్రారంభించాను

ప్రత్యేక ¬దాతో వచ్చే నిధుల కంటే ఎక్కువే ఏపీకి ఇచ్చామని, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మోదీ చెప్పారు. అమరావతికి కేంద్ర పథకం ‘హృదయ్‌’లో చోటిచ్చి వారసత్వ నగరంగా గుర్తించి అభివృద్ధి చేస్తున్నామని, వేల కోట్ల రూపాయల విలువైన పథకాలు, ప్రాజెక్టులు ప్రారంభించామని పేర్కొన్నారు. ”ఏపీలో రూ.వేల కోట్లతో పథకాలు, ప్రాజెక్టులను ప్రారంభించాను. ఈ ప్రాజెక్టుల వల్ల చమురు రంగంలో ఏపీకి దేశంలోనే అగ్ర ప్రాధాన్యం లభిస్తుంది. పెట్రోలియం నిల్వల్లో ఇబ్బందులు రాకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. గ్యాస్‌ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి జరుగుతుంది. దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలను పెట్రోలియం హబ్‌గా తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాం” అని ఆయన చెప్పారు.

సన్‌ రైజ్‌ స్టేట్‌అంటే లోకేశ్‌ అభివృద్ధి కోసం పనిచేయడమే

చంద్రబాబు మహాకూటమి పేరుతో మహామోసానికి పాల్పడుతున్నారని మోదీ ఆరోపించారు. ఏపీలో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామని, అమరావతిని నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు పతనావస్థలోని తన పార్టీని పునర్నిర్మించుకునే పనిలో పడ్డారని విమర్శించారు. ఏపీని సన్‌ రైజ్‌ రాష్ట్రం చేస్తానని చెప్పారని, కానీ పుత్ర(సన్‌) వాత్సల్యంతో కుమారుడి అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కేంద్ర పథకాలకు ఇక్కడ స్టిక్కర్‌ అంటించుకుని, అవన్నీ ఆయన కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ప్రధాని ఆరోపించారు.

‘మోదీ గో బ్యాక్‌’కు కొత్త అర్థం

‘మోదీ గో బ్యాక్‌’ అంటూ నినాదాలు, పోస్టర్లతో టీడీపీ తెలుపుతున్న నిరసనలపైనా మోదీ స్పందించారు. ‘గో బ్యాక్‌’ అంటే నన్ను మళ్లీ దిల్లీలో కూర్చోమని చెప్పడమేనంటూ తానే మళ్లీ ప్రధాని అన్న అర్థంలో మాట్లాడారు. కొత్త పని మొదలుపెట్టినా, శుభకార్యాలు చేపట్టినా దిష్టి తగలకుండా నల్ల చుక్క పెడతారని, తానొస్తుంటే చంద్రబాబు, ఆయన పార్టీ ఎగరేసిన నల్లజెండాలతో తనకు దిష్టిపోయిందని, తన శుభారంభానికి ఇదే నాంది అని వ్యాఖ్యానించారు. ప్రతి రోజూ కొత్త కొత్త తిట్లతో చంద్రబాబు తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని మోదీ అన్నారు. ”నిఘంటువుల్లో ఉన్న తిట్లన్నీ నాకోసమే ఉపయోగిస్తున్నారు, ఈ పద్ధతి మంచిదేనా. విూ తండ్రీకొడుకుల రాజకీయంలో భాగంగా ఎంతోకాలంగా నన్ను తిడుతున్నా మౌనంగానే ఉన్నాను. విూ ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదు” అని చెప్పారు.

చంద్రబాబుకు ఓటమి భయం

”కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క చెప్పాలంటే చంద్రబాబుకు భయం.. ఎన్నికల్లో ఓడిపోతామనీ భయం.. కుమారుడు లోకేశ్‌ను రాజకీయంగా నిలదొక్కుకునేలా చేయగలనో లేదో అన్న భయం.. సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడమెలా అనే భయం.. నిజాయితీపరుడైన మోదీ అనే సేవకుడిని చూసి కూడా చంద్రబాబుకు భయం” అని మోదీ వ్యాఖ్యానించారు.

ప్రాజెక్టులు జాతికి అంకితం

ప్రజాచైతన్య సభకు ముందు, ప్రధాని అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓఎన్‌జీసీ, పెట్రోలియం శాఖ అనుబంధ సంస్థ రూ.7,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన రెండు ప్రాజెక్టులను రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆయన జాతికి అంకితం చేశారు. మరో రూ.2,280 కోట్లతో బీపీసీఎల్‌ సంస్థ కృష్ణపట్నం పోర్టులో చేపడుతున్న కోస్టల్‌ టర్మినల్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

తెలుగులో మాట్లాడిన మోడీ..!

మూడు కీలక ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు గుంటూరు వచ్చిన ప్రధాని మోడీ తెలుగులో మాట్లాడి అందరికిన ఆకట్టుకున్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మాట్లాడిన అనంతరం మైకు ముందుకు వచ్చిన ప్రధాని మోడీ ప్రసంగం మొదట్లో కొన్ని వాక్యాలను తెలుగులో మాట్లాడారు. ”అక్షర క్రమంలోనే కాకుండా అన్ని రంగాల్లో.. అంశాల్లో అగ్రగాములైన ఆంధ్రప్రజలకు శుభాకాంక్షలు. పద్మభూషణ్‌, దళిత రత్నం, కవి కోకిల గుర్రం జాషువా జన్మించిన గుంటూరు జిల్లా ప్రజలకు నమస్కారం. మహా కవి తిక్కన జన్మించిన గుంటూరు ప్రజలకు నమస్కారం.” అని అన్నారు. అనంతరం ఆయన తన ప్రసంగాన్ని హిందీలో కొనసాగించారు. అంతకు ముందు ఆయన విశాఖలో రూ.1178 కోట్లతో నిర్మించిన వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. కృష్ణ పట్నం పోర్టు వద్ద రూ.700 కోట్లతో నిర్మి ంచిన బీపీసీఎల్‌ టర్మిన ల్‌ శంకుస్థాపన చేశా రు. అమలాపురం వద్ద ఓఎన్‌జీసీ వశిష్ట, ఎస్‌1 ఆన్‌షోర్‌ ప్రాజెక్టును రిమోట్‌ ద్వారా ప్రా రంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here