Featuredరాజకీయ వార్తలు

ప్రచారాలపై నిరంతర పర్యవేక్షణ

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధులపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడా ఎలాంటి విమర్శలు రాకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించింది. ఈ నేపథ్యలంఓ ఇక జిల్లాల్లో అభ్యర్థుల ప్రచారంపై అధికారులు పక్కాగా నిఘా పెట్టనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల కమిషన్‌ నిరంతర నిఘా కొనసాగించనుంది. ఎన్నికల కమిషన్‌ నూతనంగా రూపొందించిన నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేగా బరిలో ఉన్న అభ్యర్థులు 28 లక్షలకు మించి ఖర్చు చేయడానికి వీలు లేదు. ప్రచార ఖర్చులపై నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుం టాయి. ఎలక్షన్‌ కమిషన్‌ రూపొం దించిన ప్రత్యేక నోట్‌బుక్కును అందించనున్నారు. అందులో రోజువారి ఖర్చు, బ్యాంకు లావాదేవీలతోపాటు తదితర వివరాలను అందులో పొందు పరచాల్సి ఉంటుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత రూ.28 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు నిర్దారణ జరిగితే.. గెలుపొందిన ప్పటికీ వారి అభ్యర్థిత్వం రద్దు చేయనున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు సైతం నిబంధనలకు మించి ఖర్చు పెట్టినట్లు తేలితే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసే అవకాశం కూడా ఉంది. వీడియో విజువల్స్‌ ధ్వారా వివిధ పార్టీల ర్యాలీలు, బహిరంగ సభల నిర్వహణను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక షాడో బృందాలు వారి వెన్నంటే తిరగనున్నాయి. ప్రచారానికి సంబంధించి అభ్యర్థులు ఖర్చును తక్కువగా చూపినా షాడో టీమ్‌లు ఇచ్చే సమాచారం ఆధారంగా అదనపు ఖర్చును వారి ఖాతాల్లోనే జమ చేయనున్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా అదనపు ఖర్చు చేసినట్లు తేలితే గెలుపొందినా

వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయనున్నారు. షాడో టీంల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా మిగతా నగదును ఆయా అభ్యర్థుల లెక్కల్లో జమ చేయనున్నారు.ర్యాలీలు, సభలు నిర్వహించే క్రమంలో అభ్యర్థుల ఫొటోలు ఉంటే.. ఖర్చు వారి ఖాతాలోకి వెళ్లనుంది. కేవలం పార్టీ పేరుతో ప్రచారం చేసుకుంటే మాత్రం ఖర్చుకు పరిమితి లేదు. ప్రచారానికి సంబంధించి ఖర్చుల వివరాలను నమోదు చేసేందుకు ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులకు రూ.50 వేలకు మించితే లెక్క చూపాల్సి ఉంటుంది. బ్యాంకు లావాదేవీలపై కూడా ఎన్నికల అధికారులు నిరంతరం నిఘా వేయనున్నారు. రోజువారీగా బ్యాంకు లావాదేవీలు చేసే వ్యక్తుల వివరాలను లీడ్‌బ్యాంకు మేనేజర్‌ ద్వారా ఎన్నికల అధికారులకు బ్యాంకు మేనేజర్లు చేరవేయనున్నారు. ఎన్నికల కోడ్‌ పూర్తయ్యే వరకు రూ.500 డ్రా చేసినా, డిపాజిట్‌ చేసినా నిఘా ఉండబోతుంది. ముఖ్యంగా రూ.10 లక్షలు, ఆ పైన నగదు లావాదేవీలను చేసే వారి పూర్తి వివరాలను ఇప్పటికే అధికారులు బ్యాంకర్ల నుంచి సేకరిస్తున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close