Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

వ్యూహాత్మక అడుగులు..

అవకాశాన్ని బట్టే స్నేహం..

  • దక్షిణాదిలో పావులు కదుపుతున్న బిజెపి..
  • జగన్‌తో మిత్రుత్వం.. కేసీఆర్‌తో శత్రుత్వం..
  • అంతరాష్ట్రమండలి సభ్యుడిగా జగన్‌

అవకాశాన్ని బట్టి బిజెపి అడుగులేస్తోంది.. ప్రాణమిత్రులను సైతం దూరం చేసేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. అపారమైన రాజకీయ అనుభవం ఉన్న కెసిఆర్‌తో శత్రుత్వం పెంచుకుంటూ పోతుంది. తెలంగాణలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ పార్టీ క్యాడర్‌ను పెంచుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తుంది. అందుకే దక్షిణాదిలో బిజెపి ప్రధాన టార్గెట్‌ కెసిఆర్‌.. కెసిఆర్‌కు మిత్రుడిగా ఉన్న జగన్‌ను దగ్గర తీసుకుంటూ అతనికి అంతరాష్ట్రమండలి సభ్యుడిగా కూడా నియమించింది. తలపండిన నాయకుడు కెసిఆర్‌ను పక్కనపెట్టి, రాజకీయాల్లో సరియైన అనుభవం లేని జగన్‌కు గుర్తింపు ఇవ్వడంలో మర్మమేమిటో అర్థమవుతూనే ఉంది. జగన్‌, కెసిఆర్‌ మిత్రుత్వాన్ని దూరం చేసి, కెసిఆర్‌ను ఒంటరిగా చేసి బిజెపి తనదైన మార్కులో తెలంగాణలో పాగా వేయాలని చూస్తోంది. అందుకే ఇతర పార్టీల వారందరికి ఆహ్వనం పలుకుతూ పార్టీలో చేర్చుకుంటుంది బిజెపి.. మునిసిపల్‌ ఎన్నికలయ్యాక అధికార పార్టీ నేతలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి చేరికలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అప్పటివరకు కెసిఆర్‌తో ఎవరెవరూ సన్నిహితంగా, స్నేహంగా ఉంటున్నారో వారందరిని దూరం చేయడమే కాషాయం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉండాలని జగన్‌ ఉవ్విళ్లూరుతున్నారు. మరీ కేంద్రంతో జగన్‌ మిత్రుత్వం కొనసాగాలంటే కెసిఆర్‌తో మిత్రుత్వాన్ని తెగదెంపులు చేసుకోవాల్సిందే.. జగన్‌కు అన్నివిధాలా అండగా ఉంటానన్న కెసిఆర్‌ స్నేహన్ని జగన్‌ ఎంతవరకు స్వీకరిస్తాడో తెలియడం లేదు.. ఇరువురి మధ్య చిచ్చుపెట్టి తన పని తాను చేసుకుంటూ పోతుంది బిజెపి..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

దక్షిణాది రాష్ట్రాల్లో బలోపేతం కావాలని బీజేపీ వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే కర్ణాటకలోబీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకొంది. రెండు తెలుగు రాష్ట్రాలపై ఇప్పుడు కేంద్రీకరించింది. అయితే తెలంగాణలో అధికారం కోసం పావులు కదిపే సమయంలో ఏపీ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ తో మాత్రం స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ మాసంలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకొంది.ఓట్ల శాతం కూడ బాగా పెరిగింది.దీంతో తెలంగాణపై బీజేపీ ప్రస్తుతం కేంద్రీకరించింది. తెలంగాణతో పాటే ఏపీ రాష్ట్రంలో కూడ బలపడేందుకు ఆ పార్టీ పావులు కదుపుతోంది. కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ లలో తనకు టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కంటే కూడ వైఎస్‌ఆర్‌సీపీ చీఫ్‌ జగన్‌ అత్యంత నమ్మకమైన మిత్రుడుగా కాషాయదళళం భావిస్తోంది. అంతరాష్ట్రమండలి స్టాండింగ్‌ కమటీ సభ్యుడిగా ఏపీ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌ ను బీజేపీ సర్కార్‌ నియమించింది.దక్షిణ భారతదేశం నుండి వైఎస్‌ జగన్‌ కు మాత్రమే ఈ స్థానం దక్కింది. ఈ కమిటీకి కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌ షా చైర్మెన్‌. పరిపాలనలో, అనుభవంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కంటే కేసీఆర్‌ సీనియర్‌. అయితే అంతరాష్ట్ర మండలి సభ్యుడిగా జగన్‌ను నియమించడంలో మోడీ సర్కార్‌ వ్యూహత్మకంగానే ముందుకు వెళ్లినట్టుగా అర్ధం అవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అవసరాన్ని బట్టి అడుగులేస్తున్న బిజెపి..

కేసీఆర్‌తో పోరాటం చేసే సమయంలో జగన్‌ తో స్నేహం చేయాలనే ఉద్దేశ్యంతోనే బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు రాష్ట్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ కమిటీ పనిచేస్తోంది.ఈ కమిటీలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తో పాటు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ ఉన్నారు. ఈ కమిటీలో బీజేపీ సీఎంలకు చోటు దక్కలేదు. నితీష్‌ కుమార్‌ ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. 2014-19 మధ్యకాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి. 2019లో కేంద్రంలో మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చాడు. 2018లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్‌ అధికారాన్ని నిలుపుకొన్నాడు. అయితే రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరవాత కేసీఆర్‌, మోడీల మధ్య అగాధం పెరుగుతుంది.లోక్‌సభ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ అనుసరించిన వ్యూహం కూడ కారణంగా చెబుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా పార్టీలను కూడగట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రయత్నించాడు. దేశంలోని పలు పార్టీల నేతలు, ఆయా రాష్ట్రాల సీఎంలను కేసీఆర్‌ కూడగట్టే ప్రయత్నం చేశారు. కానీ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదు. ఎన్నికల సమయంలో కూడ కేసీఆర్‌ ప్రధాని మోడీపై తీవ్రమైన విమర్శలు చేశారు. గత టర్మ్‌ లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కంటే కూడ తెలంగాణ సీఎం కేసీఆర్‌ తో బీజేపీ కొంత నమ్మకంగా ఉండేది. ప్రధాని మోడీతో పాటు బీజేపీ నేతలతో కూడ కేసీఆర్‌ సన్నిహితంగా ఉండేవాడు. ప్రధాని మోడీతో సమావేశం కోసం అప్పటి ఏపీ సీఎం చంద్రబాబునాయడు ఏడాదిపాటు వేచి చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్‌ పలు దఫాలు పీఎంతో సమావేశమయ్యారు.అయితే మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ వైపు బీజేపీ చూస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ రోజు రోజుకు బలహీనపడుతోంది. అదే సమయంలో పార్లమెంట్‌ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్‌ శాతం కూడ దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో పార్టీపై బీజేపీ ఎక్కువగా కేంద్రీకరించింది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close