Featured

విపక్షాలపై వేధింపులు ఆపాలి

ప్రతిపక్షాల్లో కీలక నేతగా ఎదిగే యత్నం

˜ ప్రధాని పదవి కోసమే జిమ్మిక్కు…!

˜ సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ˜

మమత దీక్షనకు విరమింపజేసిన బాబు

పశ్చిమబెంగాల్‌: పశ్చిమబెంగాల్‌పై కేంద్రం వేధింపులకు గురిచేస్తున్న సందర్భంలో భారీ మెజారిటీతో ఎంపీ అభ్యర్థులు గెలుపొందుతారని చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. మమతా బెనర్జీ విపక్షాలకు మూలస్థంభం అంటూ చంద్రబాబు కొనియాడారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 42 మంది ఎంపీ సీట్లను గెలిపించి ప్రధానిని ఎంపిక చేసే అధికారాన్ని మమతా బెనర్జీకి అప్పగించాలని కోరారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని కలిసి మద్దతు ప్రకటించిన చంద్రబాబు పశ్చిమ బెంగాల్‌ అభివృద్ధికి నిరంతర పోరాటం చేస్తున్నారని అలాంటి వ్యక్తిని బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తోందని స్పష్టం చేశారు. కేంద్రం బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంగళవారం నాడు కోల్‌కతాలో బెంగాల్‌ సీఎం మమత బెనర్జీతో చంద్రబాబునాయుడు దీక్ష విరమింపజేశారు.తన రాజకీయ జీవితంలో ఈ తరహా పరిస్థితులను ఎప్పుడూ చూడలేదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము కలిసికట్టుగా పోరాటం చేస్తామన్నారు. త్వరలోనే తామంతా సమావేశం కానున్నట్టు ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఏ సమస్య జరిగినా తనతో పాటు మమత బెనర్జీ, రాహుల్‌ గాంధీ లాంటి నేతలతో ఎన్డీఏ పక్షాలు కలిసి రానున్నాయని బాబు చెప్పారు.ఏపీ, బెంగాల్‌, ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకొంటున్నారని బాబు ఆరోపించారు. బెంగాల్‌ ప్రజలంతా మమతకు అండగా నిలిచారని ఆయన చెప్పారు.

సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ…పశ్చిమబెంగాల్‌ శారదా చిట్స్‌ కుంభకోణం కేసులో మంగళవారం నాడు సుప్రీంకోర్టులో వాడీవేడీగా వాదనలు కొనసాగాయి. ఈ కేసు విషయమై కోల్‌కత్తా సీపీని సీబీఐ ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీస్‌ కమిషనర్‌ సీబీఐ విచారణకు హాజరైతే వచ్చిన ఇబ్బందులేమిటని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశ్నించారు. శారదా కుంభకోణం కేసులో విచారణకు వచ్చిన సీబీఐ అధికారులకు బెంగాల్‌ ప్రభుత్వం నుండి ఆదివారం నాడు సహాయ నిరాకరణ ఎదురైంది. ఈ విషయమై బెంగాల్‌ సీపీని అరెస్ట్‌ చేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని మమత బెనర్జీ ఆరోపణలు చేశారు. సీబీఐ తీరును నిరసిస్తూ ఆదివారం రాత్రి నుండి ఆమె కోల్‌కత్తాలో దీక్ష చేపట్టారు. ఇదిలా ఉంటే శారదా స్కామ్‌లో సీపీ ఆధారాలను

మార్చారని సీబీఐ కోల్‌కత్తా సీపీపై ఆరోపణలు చేసింది.ఈ విషయమై సుప్రీంకోర్టులో కూడ అఫిడవిట్‌ దాఖలు చేసింది. సీబీఐ విచారణకు కోల్‌కత్తా సీపీ రాజీవ్‌ కుమార్‌ హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణకు సీపీ రాజీవ్‌ కుమార్‌ హాజరైతే తప్పేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేసు విచారణ ప్రారంభమైన వెంటనే రెండు వర్గాలకు చెందిన న్యాయవాదులు తమ తమ వాదనలను విన్పించారు.కోల్‌కత్తా సీపీని అరెస్ట్‌ చేయకూడదని కూడ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్‌ ఘటనపై సీల్డ్‌ కవర్లో సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదికను అందించింది.మమత బెనర్జీ కూడ విచారణకు రావాలని సుప్రీంలో ఏజీ వాదించారు.

ప్రత్యర్థులు తనపైకి విసిరే అస్త్రాలను వారిపైకే తిప్పికొట్టడంలో ప్రధాని మోదీ దిట్ట. ఈ రకమైన ప్రధాని వ్యూహాల దెబ్బకు ప్రతిపక్షాల్లో కీలక నేతల పదవులకు కూడా ఎసరు వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో 'చాయ్‌పే చర్చ', గుజరాత్‌ ఎన్నికల్లో మరో కాంగ్రెస్‌ నాయకుడి వ్యాఖ్యలను వాడుకొని పరిస్థితిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకొన్న తీరు చూస్తే ఇది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ హవాను అడ్డుకొనే నేతల కోసం ప్రతిపక్షాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. చాలా సర్వేలు మోదీ హవా తగ్గినా.. ఆయనే నంబర్‌ వన్‌ అంటూ పేర్కొనడం ప్రతిపక్షాలను మరింత అప్రమత్తం చేసింది. మరోపక్క రాహుల్‌ కూడా రఫేల్‌ వ్యవహారాన్ని బాగానే ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారనే అభిప్రాయం నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడే పక్షంలో మిత్ర పక్షాలకు నేతను ఎంచుకొనే అవకాశం ఇచ్చేవిధంగా ప్రియాంక గాంధీని కూడా కాంగ్రెస్‌ రంగంలోకి దింపింది. దీంతో కాంగ్రెస్‌ ప్రచారానికి భారీ ఆకర్షణ వచ్చినట్లైంది. ఈ క్రమంలో ఉద్యమ నేపథ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన మమతా బెనర్జీ దూకుడుగా రేసులోకి వచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం సందర్భంగా మొదలైన ప్రతిపక్షాల ఐక్యతను కొనసాగించడానికి మమత ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రధాని రేసులో తానూ ఉన్నట్లు చెప్పీ చెప్పకనే సందేశాలను పంపిస్తున్నారు.

ప్రధాని పీఠం కోసమే: అరుణ్‌

కేసు దర్యాప్తులో భాగంగా కోల్‌కతా సీపీని ప్రశ్నించేందుకు వచ్చిన సీబీఐకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన ధర్నాపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్ల ఫైరయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా కోల్‌కతా సీపీని ప్రశ్నించేందుకు వచ్చిన సీబీఐకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన ధర్నాపై కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్ల ఫైరయ్యారు. అనారోగ్యం కారణంగా ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్న ఆయన దీదీని విమర్శించారు. సీబీఐ విషయంలో మమత ఓవరాక్షన్‌ అనేక అనుమానాలను కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ చర్య వెనుక మమత వ్యూహమేంటో..? ధర్నాకు విపక్షనేతలను పిలవడం వెనుక అర్థమెంటోనని జైట్లీ ప్రశ్నించారు. కేవలం పోలీస్‌ అధికారికి అండగా ఉండేందుకే మమత ధర్నా చేపట్టారనుకుంటే అది పోరపాటేనని.. దీని వెనుక ఆమె ఉద్దేశ్యంత తనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకునేందుకు కానీ అరుణ్‌ జైట్లీ ఆరోపించారు. మమతకు చాలా మంది ప్రతిపక్ష పార్టీల నేతలు మద్ధతు పలికారు. అందులో చాలా మంది అవినీతి ఆరోపణల కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న వారేనని మండిపడ్డారు. అవినీతి పాలకులంతా ఏకమై దేశాన్ని పాలించాలని ఎత్తుగడలు వేస్తున్నారని జైట్లీ అభిప్రాయపడ్డారు. సిద్ధాంతాలు లేని సంకీర్ణాల వల్ల దేశ భవిష్యత్‌కు విపత్తు లాంటిదని ఆయన అభిప్రాయపడుతూ ట్వీట్‌ చేశారు.

‘సీబీఐ’తో రాజకీయాలు..

‘సీబీఐ పంజరంలో చిలుక’ అని సుప్రీం కోర్టే వాఖ్యానించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అటువంటి సీబీఐని పావుగా చేసుకుని కేంద్రప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను వేధిస్తోందనే విషయాన్ని దేశవ్యాప్తంగా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా మమత అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో పాలక పక్షమైన తెదేపా అటువంటి వాదననే వినిపిస్తోంది. వాస్తవానికి పలు ప్రతిపక్ష పార్టీల నేతలపై సీబీఐ దర్యాప్తులు ఇటీవల వేగవంతమయ్యాయి. మరోపక్క మమత ఇటీవల ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తూ కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇదే క్రమంలో భాజపా నేత అమిత్‌ షా పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో హెలికాప్టర్‌ క్లియరెన్స్‌కు సంబంధించిన సంఘటనలూ చోటు చేసుకున్నాయి. దీనిని అధికార దుర్వినియోగంగా భాజపా చెబుతుండగా.. భాజపాను ఢీకొనే నేతగా మమతకు ఇమేజ్‌ పెరిగిందని తృణమూల్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌కు మద్దతుగా మమత దీక్షకు దిగారు. పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్‌ పాలనను అవినీతి మయంగా చూపి రాష్ట్రంలో పాగా వేయాలని భాజపా ప్రయత్నిస్తోందని దీదీ భావిస్తున్నారు. అందుకే అదే సీబీఐని కేంద్రం పావుగా వాడుకొంటోంది అంటూ నిరసన దీక్షకు దిగారనీ, దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలకు నాయకత్వం వహించేలా వ్యూహరచన చేస్తున్నారనీ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఆచితూచి ప్రతిపక్షాల స్పందన..

మమత దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు ట్వీట్లు చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా, డీఎంకే నేత స్టాలిన్‌, ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌ ఆచితూచి స్పందించారు. వీరంతా సీబీఐని వినియోగించిన సమయాన్నీ, తీరునీ తప్పుపట్టారు గానీ.. శారదా కుంభకోణాన్ని సమర్థించలేదు. చివరికి మమత బెనర్జీ కూడా సీబీఐ తీరును మాత్రమే తప్పుపట్టారు. కుంభకోణాన్ని ఏమాత్రం సమర్థించలేదు. ఆధారాల కోసం సీబీఐ ఏళ్ల కొద్దీ ఉత్తరాలు రాస్తూ కాలక్షేపం చేసి ఎన్నికలకు కొన్ని నెలల ముందే దర్యాప్తును వేగవంతం చేయడం ఏమిటన్నది వీరి వాదన. ఇటీవల ఎస్పీ, బీఎస్పీ నేతలపై దర్యాప్తులను అకస్మాత్తుగా సీబీఐ వేగవంతం చేయడాన్నీ వీరు ఉదాహరణగా చెబుతున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం ప్రధాని రేసులో ఇంకా ముందు వరుసలోకి రాలేదనే చెప్పాలి. కేవలం అఖిలేష్‌ యాదవ్‌ మాత్రమే అమెను పరోక్షంగా ప్రధాని అభ్యర్థి అని పేర్కొన్నారు. కాకపోతే ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమి గణనీయంగా సీట్లను సాధిస్తే ఎన్నికల అనంతరం రాజకీయ సవిూకరణాల్లో మాయావతి అనూహ్యంగా ముందుకొచ్చే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పెట్టుకొన్న పొత్తు బలమైన పునాది వేసిందనే చెప్పాలి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close