Featuredస్టేట్ న్యూస్

మల్కాజిగిరి వైపు ఒక్కసారి చూడండీ.. అవినీతిని అరికట్టండి..

  • జిహెచ్‌ఎంసీ ఆదాయాన్ని కాపాడండి
  • ప్రైవేట్‌ సైన్యంతో డబ్బులు వసూలు..
  • టౌన్‌ ప్లానింగ్‌ అధికారిదే ఇష్టారాజ్యం..
  • జిహెచ్‌ఎంసీ కమిషనర్‌ దృష్టిసారించని వైనం.

మల్కాజిగిరి సర్కిల్లో అవినీతి రాజ్యమేలుతోంది.. అందినకాడికి దండుకుంటూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండికొడుతున్నారు. అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన అధికారులే అక్రమార్కులను ప్రోత్సాహిస్తూ వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మల్కాజిగిరి సర్కిల్లో జరుగుతున్న అవినీతిపై ఆధారాలతో పత్రికల్లో ప్రచురిస్తున్న సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకుంటున్న దాఖలాలే కనిపించడం లేదు. అధికారుల మద్దతు అక్రమార్కులకు, రాజకీయ నాయకులకు ఉండడంతో వారు మరింత చెలరేగిపోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై జిహెచ్‌ఎంసీ కమిషనర్‌ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మల్కాజిగిరి (ఆదాబ్‌ హైదరాబాద్‌): మల్కాజిగిరి సర్కిల్‌లో టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ నర్సింగ్‌ రావు వసూళ్ళ పర్వం జోరుగా కొనసాగుతూనే ఉంది. టౌన్‌ ప్లానిగ్‌ అధికారుల అక్రమ ధందా జిహెచ్‌ఎంసి వ్యాప్తంగా చెదలు లాగా పాకిపోతున్నా ఉన్నతాధికారులు, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ మాత్రం లంచగొండి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాల వెనక ఉన్నత అధికారులకు నెలవారి వాటాలు అందడం లంచగొండి అధికారికి పూర్తిగా రాజకీయ అండదండలు ఉండడంతో తాను ఆడిందే ఆట పాడిందే పాట లాగ కొనసాగుతోంది. ఏసీపీ ఎన్ని అక్రమాలు ఎత్తి చూపుతున్నా చర్యలు మాత్రం తీసుకోకుండా అక్రమార్కులను రక్షించే పనిలో ఇటు ఉన్నతాధికారులు అటు రాజకీయ నాయకులు కంకణం కట్టుకుని కూర్చున్నారు. మల్కాజిగిరి సర్కిల్‌లో కొందరు రాజకీయ నాయకులు, అధికారులతో కలిసి తన అక్రమ దందా దర్జాగా సాగిస్తున్నారు. విలేకర్లకు డబ్బులు ఇవ్వాలని చెబుతూ అక్రమ నిర్మాణదారుల నుంచి అధికారులు స్వయంగా రాయబారాలు నడిపిస్తున్నారు. ఈ విషయమై కొందరు స్థానిక విలేకర్లు ఎమ్మెల్యే వద్ద మొరపెట్టుకున్నట్లు సమాచారం. మల్కాజిగిరి పరిధిలోని 139డివిజన్‌ ఈస్త్‌ ఆనంద్‌ బాగ్‌లోని వెంకట్రాం కాలనీ ఇంటి నెంబర్‌ 23-40/13 పక్కనే నిర్మిస్తున్న ఈ నాలుగు అంతస్తుల అక్రమ నిర్మాణమే ప్రత్యేక నిదర్శనంగా చెప్పవచ్చు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారికి ఈ అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేసినా స్థానికంగా కొందరు రాజకీయ నాయకుల పేర్లు చెబుతూ కట్టిస్తున్నాడని ఫిర్యాదుదారుల ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలకు నామమాత్రంగా నోటీసు ఇవ్వడం, ఒక న్యాయవాది మొబైల్‌ నెంబర్‌ ఇవ్వడం, అక్రమ నిర్మాణం దారులకు స్టే ఇప్పించడం మల్కాజిగిరి టౌన్‌ ప్లానింగ్‌ అధికారికి విధులలో భాగంగా మారిపోయింది. అక్రమాలపై చర్యలు చేపట్టాల్సిన విజిలెన్స్‌ అధికారులు కళ్ళు మూసుకున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ అక్రమాలకు అవినీతి సొమ్ముతో తిమింగలముగా మారిన మల్కాజిగిరి ఏసిపిపై ఎందుకు ఆలస్యం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసిపి అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే తెలంగాణ జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఓ భారీ తిమింగలం ఏసీబీకి దొరకడం ఖాయమని మల్కాజిగిరి వాసులు సూచిస్తున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close