Featuredప్రాంతీయ వార్తలుస్టేట్ న్యూస్

ఇంకెన్నాళ్లీ బలిదానాలు

  • కార్మికులు రాలుతున్న స్పందనేదీ
  • స్వరాష్ట్రంలో ఆగని ఉద్యమాలు
  • మళ్లీ ఉదృతమవుతున్న పోరాటం..
  • సంధి దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు

రాష్ట్రం రాకముందు ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు.. రాష్ట్రం సాధించాక కూడా ఆగని బలిదానాలు..
స్వరాష్ట్రం వచ్చాక సాధించిందేమంటే విద్యార్థుల, రైతన్నల, ఉద్యోగుల, నిరుద్యోగుల అత్మహత్యలే..
తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ మనం కలలుగన్న స్వరాష్ట్రం సాధించామని, మన తెలంగాణ బంగారు తెలంగాణగా మారబోతుందని కోటి ఆశలతో,
కొంగొత్త వెలుగులతో ఎదురుచూశారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు అన్ని ఆంధ్రా వాళ్లే తీసుకుపోతున్నారని పిడికిలి బిగించి,
ఎలుగెత్తి ఉద్యమాన్ని ఉర్రూతలూగించి ఎంతోమంది వీరులు అత్మబలిదానం చేశారు. వేలాది మంది మరణాలతో,
కోట్లాదిమంది ఉద్యమంతో సాధించుకున్న బంగారు తెలంగాణలో బలిదానాలు మాత్రం అగడమే లేదు.
ఒకప్పుడు ఉద్యోగాలు కావాలని పోరాటం చేసి ప్రాణాలర్పించారు. కాని ఇప్పుడు మన బంగారు తెలంగాణలో ఉన్న పాత
ఉద్యోగాలను కాపాడుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించకముందు కన్న
కలలన్నీ కలలుగానే మిగిలిపోతున్నాయి. సామాన్యుడి ఆశలు నిరాశలైపోయాయి. ప్రత్యేక రాష్ట్రాన్ని అణిచివేసిన వారు ఇప్పుడు
పాలకులయ్యారు. రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణాలను ఫణంగా పెట్టి ఉద్యమించినవారు శత్రువులయ్యారు. ప్రజలందరూ
ఏకమై సాధించుకున్న బంగారు తెలంగాణ కొంతమంది చేతుల్లోనే బందీగా మారిపోయింది.

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌ :

సామాన్యుడి కొరుకున్న తెలంగాణ ఎంత వెదికినా ఎక్కడ కనిపించడం లేదు. ఏ నినాదంతో ప్రజలందరూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం
కోసం నెలలకు నెలలు తరబడి ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉద్యమించారో ఆ తెలంగాణ లేదు. ఉన్నత చదువులు చదివి
ఉద్యోగాలు కావాలని కలలుగన్న నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు లేవు. వేచి చూసి, చూసి నీరసించి నిరుద్యోగులు
అత్మహత్యలు చేసుకుంటున్న స్పందన లేదు. రాత్రింబవళ్ళు నిద్రాహరాలు మాని చదువుకున్న ఇంటర్‌ విూడియట్‌ విద్యార్థుల
ఫలితాల్లో అవకతవకలు జరిగినా ఇరవైకి పైగా విద్యార్థులు అత్మహత్యలకు పాల్పడినా కనీస చలనం లేదు. పంట పెట్టిన పెట్టుబడి
రాక, ప్రభుత్వం గొప్పగా ప్రవేశపెట్టిన రైతుబంధు సకాలంలో అందక ఎంతోమంది రైతులు అత్మహత్యలు చేసుకుంటున్న అయ్యో
అనే వారు లేరు. కొత్త ఉద్యోగాల నియమాకమెమో కాని ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని ఆర్టీసీ ప్రవేట్‌
చేయకుండా, అప్పుల్లో ఉన్న ఆర్టీసీని కాపాడాలని ప్రత్యేక తెలంగాణలో రాష్ట్రంలో గత వారం, పది రోజుల నుంచి నిరవధిక సమ్మె
చేస్తున్న వారి గోడును పట్టించుకునే వారే కరువయ్యారు. కార్మికుల సమస్యలను పట్టించుకోని, వారి సమస్యలను
పరిష్కరించాల్సిన ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తూ కార్మికులపై కఠినంగా వ్యవహరిస్తూ ఉద్యోగాలను తీసివేస్తున్నామని చెప్పడంతో
ఉపాధిని ఇచ్చే ఉన్న ఉద్యోగం పోతుందని భయంతో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలన్నీ తీరుతాయని, అందరికి నీళ్లతో పాటు, నిధులు వస్తూ, చదువుకున్న వారందరికి ఉద్యోగాలు
వస్తాయని భావించిన తెలంగాణ ప్రజానీకం ఆశలు అవిరైపోయాయి. జవాబుదారీగా ఉండాల్సిన పాలనా యంత్రాంగం ప్రజలను
కలవడానికి, ప్రజల సమస్యలను పట్టించుకోవడానికి తీరికే ఉండడం లేదని ఆరోపణలున్నాయి. అధికారులు, నాయకులందరూ
ఓకే తాను ముక్కలై ప్రజల సమస్యలను విస్మరించడంతో తెలంగాణలో రోజురోజుకు బలిదానాలు పెరిగిపోతున్నాయి

అందోళనతో పెరుగుతున్న బలిదానాలు

ఆర్టీసీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌ తో మొదలైన సమ్మె అంతకంతకూ ఉగ్రరూపంసంతరించుకుంటోంది. కలలో కూడా ఊహించనిరీతిలో ఒక డ్రైవర్‌, మరో కండక్టర్‌ ప్రాణ త్యాగం చేసిన తీరు ఆవేదనాభరితంకావటమే కాదు. ఆర్టీసీ సమ్మె మరింత ఉద్రిక్తమయ్యే పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే డ్రైవర్‌ తనను తాను కాల్చుకొని తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం
వేళలో ప్రాణాలు విడిచారు. ఈ ఉదంతంతో ఉలిక్కిపడిన ఆర్మీసీ కార్మికులకు మరో విషాదాన్ని మిగిల్చే ఘటన ఆదివారం రాత్రి వేళలో చోటు చేసుకుంది. రాణిగంజ్‌ డిపోలో కండక్టర్‌ గా పని చేస్తున్న సురేందర్‌ గౌడ్‌ సమ్మె విషయంలో సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర వేదనతో ఇంట్లో ఎవరూ లేని వేళ ఉరి వేసుకొని మరణించిన వైనం షాకింగ్‌ గా మారింది. ఏడాది క్రితం కూతురు పెళ్లి కోసం బ్యాంకులో అప్పుతీసుకున్న అతను ఈ నెలలో చేసిన పనికి చెల్లించాల్సిన జీతాల్ని సమ్మె చేస్తున్నారన్న కారణంగా చెల్లించకపోవటంతో ఈఎంఐ బౌన్స్‌ అయ్యింది. దీంతో తీవ్ర వేదనకు గురైన అతను ఎవరూ లేని వేళ ఆత్మహత్య చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని మరికొన్నిచోట్ల ఆత్మహత్యయత్నాలు ఒకట్రెండు చోటు చేసుకున్నాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారటమే కాదు. ఉద్యోగుల ప్రాణాలు పోయే వరకూ విషయాన్ని ప్రభుత్వం లాగుతుందన్న విమర్శ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యల పర్వమే నాటి కేంద్రాన్ని కదిలించిందని చెప్పాలి. మరి తాజాగా చోటుచేసుకుంటున్న బలవన్మరణాలు ఆగిపోయేలా సీఎం కేసీఆర్‌ ఎలా వ్యవహరిస్తారు అన్నది క్వశ్చన్‌ గా మారిందని చెప్పకతప్పదు. రోజురోజుకు సమ్మె ఉగ్రరూపం దాల్చడంతో కెసిఆర్‌ చర్చల దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకు మధ్యవర్తిగా సీనియర్‌ టిఆర్‌ఎస్‌ నాయకుడితో రాయబారాలు నడిపేలా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close