తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్షతో పాటు సవతి తల్లి ప్రేమ చూపుతోందని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. అవార్డులు, రివార్డులు వస్తున్నా కేంద్రం నుంచి మిషన్‌ భగీరథకు డబ్బులు రావడం లేదని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ విూడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు అన్ని వైపులా నుంచి ప్రశంసలు వచ్చాయి. నీతి అయోగ్‌ కూడా ఈ రెండు పథకాలకు రూ. 24 వేల కోట్ల సాయాన్ని ఇవ్వాలని ప్రతిపాదించిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు. మిషన్‌ భగీరథకు హడ్కో

రెండు సార్లు అవార్డులిచ్చింది. స్కోచ్‌ కూడా అవార్డు ఇచ్చిందని తెలిపారు. స్వయంగా గజ్వేల్‌ లో మిషన్‌ భగీరథను ప్రారంభించిన ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌ లో కూడా ప్రశంసలు కురిపించారని చెప్పారు. నీతి అయోగ్‌ రూ. 24 వేల కోట్లు సిఫారసు చేసినా దాన్ని తిరస్కరించినట్లు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ మేఘవాల్‌ పార్లమెంట్‌లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని కేటీఆర్‌ వెల్లడించారు.

ఇది బీజేపీ నీచ రాజకీయానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. తాము బలంగా లేని తెలంగాణకు ఎందుకు సాయం చేయాలన్నట్టుగా బీజేపీ వైఖరి ఉందని నిప్పులు చెరిగారు. తెలంగాణ పట్ల బీజేపీది సవతి తల్లి ప్రేమ అని కోపోద్రిక్తులయ్యారు. తమ ఉనికి లేదని తెలంగాణ పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోంది. గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 103 స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోయింది. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. ఇదే తీరుగా వ్యవహరిస్తే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ 17 సీట్లలో డిపాజిట్‌ కోల్పోవడం ఖాయమన్నారు. 2014లో బీజేపీ గెలిచిన సీటు కూడా ఇప్పుడు రాదన్నారు. నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్టు బీజేపీ వైఖరి ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం సాయం చేస్తూ తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. మహారాష్ట్ర సాగునీటి పథకాలకు కేంద్రం ఇటీవలే రూ. 3883 కోట్లు సాయం చేసిందని కేటీఆర్‌ గుర్తు చేశారు. నరేంద్ర మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రధాని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో పోలవరానికి 95 శాతం నిధులిస్తున్న కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ¬దా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్రం వైఖరిని పార్లమెంట్‌ లో ఎండగడుతూ నిలదీస్తారని కేటీఆర్‌ స్పష్టం చేశారు. విూడియా సమావేశంలో బాల్క సుమన్‌, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here