Featured

భూకబ్జాలపై ఉక్కుపాదం

అడవుల రక్షణకు కఠిన చర్యలు

  • సింగరాయిపల్లి సామాజిక ఫారెస్ట్‌ తనిఖీ
  • మూడేళ్ల కృషితో మారిన గజ్వేల్‌ పరిసరాలు
  • కోమటిబండ మిషన్‌ భగీరథ పనుల పరిశీలన
  • కలెక్టర్లు, మంత్రులకు సిఎం కెసిఆర్‌ స్పష్టీకరణ

హైదరాబాద్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా కోమటిబండలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, మున్సిపల్‌ చట్టం, రెవెన్యూ చట్టం రూపకల్పనపై కలెక్టర్లతో చర్చించారు. పల్లెల్లు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలనేది ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్‌ తెలిపారు. దీనికి అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. అవినీతికి ఆస్కారం లేకుండా, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తోందని తెలిపారు. అడవుల కబ్జాపై ఉక్కుపాదం మోపాలని మంత్రులు, అధికారులకు సిఎం కెసిఆర్‌ స్పష్టమైన ఆదేవాలు ఇచ్చారు. కలెక్టర్లతో సమావేశాల్లో భాగంగా బుధవారం రెండోరోజు ఉదయం హైదరాబాద్‌ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి మంత్రులు, అధికారులు, కలెక్టర్లతో కలిసి గజ్వేల్‌ లోని కోమటిబండకు వెళ్లారు. మార్గమధ్యలో.. సింగాయిపల్లి ఫారెస్ట్‌ బ్లాక్‌లో ఆగారు. 12వందల ఎకరాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. అక్కడ అడవుల పరిరక్షణ ఆక్రమణలపై అధికారులతో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఆక్రమణలు అడ్డుకునేందుకు చర్యలు ఏం తీసుకుంటున్నారని ప్రశ్నించారు. అందుకు వన సంరక్షణపై ప్రచారం, అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని అధికారులు, మంత్రులు వివరణ ఇచ్చారు. ఐతే దీనిపై సీఎం కేసీఆర్‌ ఒకింత సీరియస్‌ గా స్పందించారు. ఇది నా నియోజకవర్గం. ఇక్కడేం జరుగుతుందో చూస్తూనే ఉన్నా. 15రోజులకు ఒకసారి వస్తూ పోతూ చూస్తునే ఉన్నా. ఇక్కడేం జరుగుతుందో నాకూ తెలుసు. అడవులు, అటవీ భూములు కబ్జా కాకుండా చూడటం, వాటి సరిహద్దులు గుర్తించడం చాలా ముఖ్యం. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా ఈ పని చేయాలని కేసీఆర్‌ చెప్పారు. హరితహారంలో భాగంగా చేపట్టిన మొక్కల పెంపకం, వాటి ఫలితాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో మంత్రులు, అధికారుల బృందం సిద్దిపేట జిల్లాకు బయల్దేరింది. సీఎం సహా మంత్రులు, కలెక్టర్లు హైదరాబాద్‌ ప్రగతి భవన్‌ నుంచి బస్సుల్లో బయల్దేరి వర్గల్‌ మండలం సింగాయిపల్లికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో 2016-17లో చేపట్టిన అటవీ పునరుజ్జీవన పనులను పరిశీలించారు. గజ్వేల్‌, కోమటిబండ ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన సామాజిక వనాలను పరిశీలించారు. కోమటిబండలో కలెక్టర్లతో సమావేశమైన సీఎం కేసీఆర్‌ రెవెన్యూ చట్టంపై చర్చించారు. గజ్వేల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. సామాజిక అడవుల పెంపకం, ఆవాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపయోగపడితే అడవుల పెంపకం మొత్తం వాతావరణంలోనే మార్పు తెస్తుందని చెప్పారు. వర్షాలు బాగా కురవడానికి జీవ వైవిధ్యానికి దోహద పడుతుందని సీఎం తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో గజ్వేల్‌ నియోజకవర్గంలో అటవీభూములు, చెట్లులేక ఏడారిలా ఉండేదని మూడేళ్ల క్రితం ప్రారంభమైన అటవీ పునరుద్ధరణ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని కేసీఆర్‌ తెలిపారు.

అడవుల పునరుద్ధరణకు ప్రణాళిక చేయండి

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీభూముల్లో అడవుల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించి, కార్యాచరణ ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లను ఆదేశించారు. సామాజిక అడవుల పెంపకం, ఆవాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపయోగపడితే.. అడవుల పెంపకం మొత్తం వాతావరణంలోనే మార్పు తెస్తుందన్నారు. వర్షాలు బాగా కురవడానికి జీవవైవిధ్యానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని అటవీభూములు తెలంగాణ ఏర్పడిన కొత్తలో చెట్లులేని ఎడారుల్లా కనిపించేవన్నారు. అందువల్ల అడవిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేసినట్టు చెప్పారు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన పునరుద్ధరణ ఫలితాలు ఇపుడు కనిపిస్తున్నాయన్నారు. ఆ ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళ లాడుతోందని, వర్షపాతం కూడా పెరిగిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 27 రకాల పండ్ల మొక్కలను కూడా అడవుల్లో పెంచడం వల్ల అవి మంకీ ఫుడ్‌ కోర్టుల మాదిరిగా తయారవుతున్నాయని చెప్పారు. కలెక్టర్లతో కలిసి గజ్‌ఎవ్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కలియదిరిగారు. గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని సింగాయిపల్లి, నేంటూరు, కోమటిబండ తదితర ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్వయంగా చూపించారు. అనంతరం కోమటిబండలో నిర్మించిన మిషన్‌ భగీరథ ప్లాంటును సందర్శించారు. అక్కడే కలెక్టర్లతో కలిసి సీఎం కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేశారు. పలువురు మంత్రులు జగదీశ్వర్‌ రెడ్డి, శ్రీనివాసగౌడ్‌, ఇండ్రకరణ్‌ రెడ్డిలతో పాటు ఎంపీ సంతోష్‌ కుమార్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, మంతంరులు జఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అడవుల పెంపుదలకు గజ్వేల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా అటవీ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీ భూమి ఉందని చెప్పారు. అది మన భూభాగంలో 23.4శాతమని వివరించారు. ఇంత అటవీభూమి ఉన్నప్పటికీ అదే నిష్పత్తిలో అడవులు లేవని చెప్పారు. ప్రస్తుతమున్న అడవులను కాపాడుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. వాటిలో మొక్కలు నాటి అడవిని పునరుద్ధరించాలని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఈ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

అటు, గజ్వేల్‌ అటవీప్రాంతంలో చేపట్టిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అటవీశాఖ పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ, అడిషనల్‌ పీసీసీఎఫ్‌ ఆర్‌.ఎం.డోబ్రియాల్‌ కలెక్టర్లకు వివరించారు. అడవుల్లో ఉన్న రూట్‌ స్టాక్‌ ను ఉపయోగించుకొని సహజమైన పద్ధతిలో చెట్ల పెంపకం చేపట్టామన్నారు. అడవి చుట్టూ కందకాలు తీసామని చెప్పారు. అందువల్ల అడవికి రక్షణ ఏర్పడుతుందని బయటి జంతువులు లోపలకు రావడంగానీ లోపలి జంతువులు బయటకు వెళ్లడం కానీ సాధ్యం కాదని చెప్పారు. ఆ కందకాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల చెట్లకు కావల్సిన తేమ అందుతోందన్నారు. కందకాల కట్టలపై గచ్చకాయ చెట్లు నాటడం వల్ల అడవికి సహజమైన రక్షణ ఏర్పడుతోందని తెలిపారు. 27రకాల పండ్ల చెట్లు కూడా అడవుల్లో పెంచుతున్నామని, దీనివల్ల గ్రామాలు, పట్టణాల్లోని కోతులు అడవికి వాపస్‌ పోతున్నాయన్నారు. అడవుల పునరుద్ధరణ వల్ల కాలుష్యం, ఉష్ణోగ్రతలు తగ్గి వర్షపాతం పెరుగుతుందని చెప్పారు. ఆయా జిల్లాల్లోని అటవీభూముల్లో అడవుల పునరుద్ధరణకు అవసరమయ్యే కాంపా నిధులు అందుబాటులో ఉన్నాన్నారు. చెట్ల పెంపకానికి అవసరమైన చర్యలు అటవీశాఖ ద్వారా తీసుకుంటామని తెలిపారు. అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం కలెక్టర్లు కోమటిబండలో నిర్మించిన మిషన్‌ భగీరథ ప్లాంటును సందర్శించారు. అక్కడే సీఎం కేసీఆర్‌ కలెక్టర్లతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం వారితో సమావేశమయ్యారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, కొత్త మున్సిపల్‌ చట్టం అమలుపైన చర్చించారు. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపైన చర్చ జరిపారు. ప్లలెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళ లాడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్‌ అన్నారు. అందుకు అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. అవినీతికి ఆస్కారం లేని.. రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగని పారదర్శకమైన రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తోందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close