Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

ప్రభుత్వ స్థలంలో ప్రతిమ హాస్పిటల్ .

ఒక్క గజం కాపాడితే ఒట్టు..       ___

——-ఇంటి పక్కనే కబ్జా నోరుమెదపని కేంద్రమంత్రి .

…… తెరాస ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రభుత్వం ……..

జన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకట నారాయణ.

……………………..బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రస్తుత కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తన ఇంటి పక్క గల ప్రభుత్వ స్థలాన్ని కాపాడలేకపోయార ని జన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకట నారాయణ ఆవేదన వ్యక్తపరిచారు.నగరంలోని బర్కత్ పుర లో సుమారు 2200 చదరపు గజాల స్థలం ప్రభుత్వానికి చెందినదని గతంలో హిమాయత్నగర్ ఎమ్మార్వో గా పనిచేసిన సుగుణ, ప్రభుత్వ స్థలం అంటూ సదరు స్థలంలో బోర్డులు పెట్టారు.వాస్తవానికి ఈ స్థలం సుమిత్ర బాయి అనే మహిళ అని ఆమె మరణానంతరం వారసులు ఎవరూ లేకపోవడంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అప్పటి హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ ప్రొసీడింగ్స్ నెంబర్ .b2/6638/2007.తేదీ .25/09/2007 ఉత్తర్వుల్లో పేర్కొన్నారని వెంకట నారాయణ ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధితో మాట్లాడుతూ వివరించారు. ఈ స్థలం పై కన్నేసిన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ బంధువులు సాయి బాలాజీ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సుమిత్ర దేవి నుండి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించారని ఆయన వెల్లడించారు.అయితే జిహెచ్ఎంసి సైతం సదరు ఫోర్జరీ డాక్యుమెంట్లను ఆధారంగా చూపించి రెవెన్యూ యంత్రాంగం నుండి ఎన్. ఓ.సి. లేకుండానే భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారని ఆయన విమర్శించారు.ఈ వ్యవహారంపై పూర్తి ఆధారాలతో ఆనాటి ఎమ్మార్వో కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వదిలేశారని జన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటనారాయణ ఆరోపించారు.కబ్జాదారులు తమకున్న రాజకీయ పలుకుబడితో ఫిర్యాదులను తొక్కిపెట్టి ప్రతిమ హాస్పిటల్ పేరుతో 8 అంతస్తుల భవనం నిర్మించి ప్రైవేటు ఆసుపత్రి నడిపిస్తున్నారని ఆయన చెప్పారు. కస్తోదియన్ నిబంధనల మేరకు ప్రతిమ హాస్పిటల్ స్థలాన్ని తన ఆధీనంలో ఉంచుకోవాలని హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వ సహకారం, అండదండలతో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించడం అంటే ప్రభుత్వం లోనే కబ్జాదారులు ఉన్నట్లుగా భావించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల ప్రతినిధిగా ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించాల్సిన కిషన్ రెడ్డి సైతం కబ్జాదారుల తరిమికొట్టడం లో మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు.ఇప్పటికైనా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా జి.కిషన్రెడ్డి కబ్జాదారులను పారద్రోలి ఆ స్థలంలో నిర్మించిన భవనంలో ప్రభుత్వ ఆసుపత్రి నడిచేలా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ ను విశ్వ నగరంగా మారుస్తానని ప్రతి ఇంచు స్థలానికి లెక్క ఉండాలి అని పదేపదే చెబుతున్నా,ఎమ్మార్వో నుండి కలెక్టర్ స్థాయి వరకు ప్రతిమ హాస్పిటల్ స్థలం ప్రభుత్వానిదేనని ఉత్తర్వులు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం కబ్జాదారుల నుండి కనీసం ఒక్క గజం స్థలం అయినా తీసుకోలేకపోవడం సిగ్గుచేటైన విషయం గా వెంకటనారాయణ అభివర్ణించారు. ఇప్పటికైనా ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు ప్రతిమ ఆసుపత్రిని స్వాధీనం చేసుకుని ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిజాయితీగా పని చేసిన అధికారులను పరిశీలించాలని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటనారాయణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close